
–
31/03/2026
- హార్ముజ్ జలసంధి ని తెరవక పోయినా సరే, యుద్ధాన్ని విరమించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తమ మిత్ర రాజ్యాలతో ట్రంప్ చెప్పాడని ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక నిన్న – మార్చి 30 – తెలియజేసింది.
- హోర్ముజ్ జల సంధి గుండా వెళ్ళే చమురు ఇతర వాణిజ్య రవాణా నౌకల నుండి ఇరాన్ ఇప్పటికే ప్రొటెక్షన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నది. కనుక ఈ ట్యాక్స్ ఇక పర్మినెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- సూయజ్ కెనాల్ ద్వారా జరిగే రవాణా పైన ఈజిప్టు సుంకం (టోల్) వసూలు చేస్తుండగా, పనామా కాలువ ద్వారా జరిగే రవాణా పైన పనామా దేశం టోల్ టాక్స్ వసూలు చేస్తున్నాయి. ఇదే తరహాలో హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణా పైన టోల్ టాక్స్ వసూలు చేసేందుకు ఇరాన్ ప్రస్తుత యుద్ధం ద్వారా అవకాశం దొరకబుచ్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది.
- హార్ముజ్ జల సంధి ని ఇరాన్ నియంత్రణ కు వదిలేస్తూ యుద్ధ విరమణ కు అంగీకరించటానికి ట్రంప్ సుముఖంగా ఉండటం గల్ఫ్ రాజ్యాలకు మింగుడు పడటం లేదు. సౌదీ అరేబియా, యు ఏ ఈ, కతార్ దేశాలు ఇప్పటి దాకా యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ కి తెర వెనుక చెబుతూ వచ్చాయి. ట్రంప్ ప్రకటన వారిని భయాందోళనలకు గురి చేస్తూ ఉండాలి.
- అయితే ట్రంప్ ప్రకటనలు నమ్మటం కష్టం. గంట గంట కీ స్టాండ్ మార్చటం ఆయన లక్షణం. అందుకని ఈ ప్రకటన ను సీరియస్ గా తీసుకుంటున్నవారు తక్కువ.
- యుద్ధ భారాన్ని గల్ఫ్ దేశాలు కూడా భరించాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ ఇంకో ప్రకటన చేశాడు. 🤨
02/04/2026
- ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్ లో మార్చకుండా ఉండేందుకు, అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఉభయ సభలు బిల్లు ఆమోదించాయి. ఇక రాష్ట్రపతి సంతకం ఒకటే మిగిలి ఉంది.
- ఇరాన్ పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ లు ఇప్పటికే ఓటమి చెందాయని అమెరికా, ఐరోపా లకు చెందిన మాజీ రాయబారులు, సి ఐ ఏ, ఎం ఐ 6, లాంటి ఇంటలిజెన్స్ సంస్థల ఎనలిస్టులు తీర్మానిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన అలెస్టర్ క్రూక్, అమెరికాకి చెందిన ల్యారీ జాన్సన్, ఇంకా అనేక మంది ఈ కోవలో ఉన్నారు.
- హార్ముజ్ తెరవక పోతే తీవ్ర వినాశనం తప్పదని హెచ్చరించి 5 రోజులు గడువు కూడా పెట్టిన ట్రంప్ ఇప్పుడు తోక ముడిచి అసలు హార్ముజ్ అవసరం మాకు లేదని ప్రకటిస్తున్నాడు. ఇంకో రెండు మూడు వారాల్లో యుద్ధం ముగుస్తుందని నిన్న వైట్ హౌస్ నుండి చేసిన ప్రధాన ప్రసంగం లో ఆయన చెప్పాడు.
- గల్ఫ్ లో అమెరికాకి చెందిన 13 మిలట్రీ స్థావరాలను ఇప్పటి వరకు చేసిన దాడుల్లో ఉపయోగానికి వీలు లేకుండా ఇరాన్ నాశనం చేసింది. దాంతో అమెరికా సైన్యం దుబాయ్, ఖతార్ లాంటి చోట్ల హోటళ్లలో ఉంటున్నారు. అందుకే గల్ఫ్ దేశాల్లోని హోటళ్ల పైన కూడా ఇరాన్ కొన్ని దాడులు చేసింది.
- ఫ్రెంచి అధ్యక్షుడు మెకరాన్ ట్రంప్ ని దాదాపు ఎగతాళి చేశాడు. ట్రంప్ తన ప్రకటనలను తానే వ్యతిరేకిస్తూ సవరించుకుంటున్నాడని గుర్తు చేస్తూ, ఇరాన్ పైన భూతల దాడిని తిరస్కరించాడు. ఇరాన్ పైన దాడులకు తమ భూ, గగన తలాలను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వటం లేదని స్పెయిన్ ప్రకటించింది.
- ఇరాన్ తో సంధి చేసుకునే ముందు ఇరాన్ పైన భూతల దాడి చెయ్యాలని, గ్రౌండ్ యుద్ధం ద్వారా ఇరాన్ వద్ద ఉన్న 1000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ను దొంగిలించాలని ఇజ్రాయెల్, ట్రంప్ పైన గట్టిగా వత్తిడి చేస్తోంది.
- యుద్ధం ద్వారా సాధించ దలచిన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించటంలో ఇజ్రాయెల్ విఫలం అయిందని ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ ఇంటలిజెన్స్ అధికారి డ్యానీ సిట్రినోవిజ్ ప్రకటించాడు. యుద్ధం నుండి తప్పుకోవడానికి అవసరమైన కథల్ని (narrative) ప్రచారంలో పెట్టడాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే మొదలు పెట్టిందని ఆయన వెల్లడించాడు.
- “ఒక చేదు నిజం ఏమిటంటే ఐడీఎఫ్ తనంతట తానే కూలిపోతున్నది. ఐడీఎఫ్ కూలిపోవడం అంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా కూలిపోవటమే”. —- ఐడీఎఫ్ రిటైర్డ్ జనరల్ యిట్జాక్ బ్రిక్
- బెదిరింపులకు జడిసి యుద్ధంలో వెనక్కి తగ్గటానికి ఇరాన్ న్యూయార్క్ లోని రియల్ ఎస్టేట్ ధనికుల లాంటి వారు కాదన్న నిజం ట్రంప్ కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. —- ఇజ్రాయెల్ జర్నలిస్ట్
04/04/2026
- ఐ రా స భద్రతా సమితిలో అమెరికా మద్దతుతో బహ్రెయిన్ నిన్న ఒక తీర్మానం ప్రతిపాదించింది. సైనిక బలగాలను ఉపయోగించి హార్ముజ్ జలసంధి తెరిపించాలని ఈ తీర్మానం ప్రతిపాదించింది. బహ్రెయిన్ ప్రతిపాదించినప్పటికీ ఇది అమెరికా తీర్మానమే.
- ఈ తీర్మానాన్ని చైనా, రష్యా లతో పాటు ఫ్రాన్స్ కూడా వ్యతిరేకించింది. దాంతో తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానం అమలు వాస్తవికం కాదని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇరాన్ వ్యతిరేక తీర్మానం విషయంలో అమెరికా శిబిరం నుండి ఫ్రాన్స్ వేరు పడటం ఇదే మొదటి సారి. మునుముందు జరగబోయే మార్పులకు ఇది ఒక సూచన కావచ్చు.
- అమెరికా మాజీ మిలట్రీ ఎనలిస్టు, ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్ అయిన కరెన్ క్వియాతోవ్ స్కి ప్రకారం: అమెరికా ఇండియాని అవసరం అయినప్పుడు వాడుకుంటుంది. అక్కర్లేదు అనుకుంటే బస్సు చక్రాల కిందికి నిర్దాక్షిణ్యంగా తోసేస్తుంది. ఈ సంగతి రష్యా, చైనా లకు బాగా తెలుసు.
- కరేన్ ఇంకా ఇలా అన్నాడు: “అవసరం అనుకుంటే చైనాకి కౌంటర్ వెయిట్ గా ఇండియాని ఉపయోగిస్తుంది. అవసరం లేనప్పుడు వదిలేస్తుంది. ఇది ఇండియా కే కాదు, అన్ని దేశాల పట్ల అమెరికా విధానం ఇలాగే ఉంటుంది. ఇండియాలోని నిపుణులైన వర్క్ ఫోర్స్, సాంకేతిక సామర్థ్యం అమెరికాకి అవసరం. అందుకే అమెరికా ఇండియాని ముఖ్య భాగస్వామి గా భావిస్తుంది. ఇండియాని మోసం చెయ్యటంలో ట్రంప్ అందరినీ మించిపోయాడు.” ఇండియాను అమెరికా గత అధికారులు కూడా ఇలాగే మోసం చేశారని, ఇండియా పాలకులను అవసరానికి వాడుకున్నారని కరేన్ ప్రకటన తెలియజేస్తున్నది.
- ఏప్రిల్ 3 తేదీన కువైట్ లోని ఒక విద్యుత్ ప్లాంట్, ఒక వాటర్ డీ సాలినేషన్ ప్లాంటు మిసైల్ దాడికి గురై ధ్వంసం అయ్యాయి. ఈ దాడి ఇరాన్ చేసిందని కువైట్ ఆరోపించగా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తాము ఆ దాడి చేయలేదని, ఇజ్రాయెల్ చేసిందని చెప్పింది.
- అంటే ఇజ్రాయెల్ ఫాల్స్ ఫ్లాగ్ దాడులు చేస్తోంది. తానే దాడి చేసి ఆ నెపాన్ని ఇరాన్ పైకి నెట్టడం ఈ దాడుల లక్ష్యం. ఇలాంటి దాడులని ఇజ్రాయెల్, అమెరికా, ఇంగ్లాండ్ గతంలో సిరియాలో అనేకసార్లు చేశాయి. ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్ ఇలాగే సైప్రస్ పైన కూడా దాడి చేసి ఆ నెపాన్ని ఇరాన్ పైకి నెట్టిందని ఇరాన్ కొద్ది రోజుల క్రితం ఆరోపించింది. సైప్రస్ పైన హిజ్బోల్లా దాడి చేసి ఉండొచ్చని మరొక వాదన వినిపిస్తోంది.
- ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు అన్నీ నాశనం చేశామని గత బుధవారం ట్రంప్ గొప్పలు చెప్పుకొన్నాడు. కానీ శుక్రవారం శనివారం రెండు రోజుల్లో అమెరికా రెండు ఫైటర్ జట్లు, మరొక ఎఫ్ -35 యుద్ధ విమానం (అత్యంత ఖరీదైనది, అత్యాధునికం అని అమెరికా చెప్పుకునేది) లను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చాయి.
- ఇరాన్ మిసైల్ మరియు డ్రోన్ లు 90 శాతం చెక్కు చెదరలేదని, వాటిని నాశనం చేశామన్న ట్రంప్ ప్రకటనలో నిజం లేదని రష్యన్ విశ్లేషకుడు ఒకరు ఈ రోజు తన బ్లాగ్ లో ప్రచురించిన ఒక ఆర్టికల్ లో చెప్పాడు.
05/04/2026
- ఇరాన్ గగనతలం నుండి దాడి చేస్తున్న ఎఫ్ 35 ఫైటర్ జెట్ ను ఇరాన్ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. కూల్చిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ లోని ఇద్దరు పైలట్లు ఎజెక్ట్ అయ్యారు. ఒక పైలట్ కువైట్ లో ల్యాండ్ కాగా, ఇంకో పైలట్ ఇరాన్ లో ల్యాండ్ అయ్యాడు.
- ఇరాన్ లో ల్యాండ్ ఐన పైలట్ ను కాపాడడానికి వెళ్ళిన రెండు అమెరికా హెలికాప్టర్ లని ఇరాన్ కూల్చేసింది. పైలట్ ను ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా పైలట్ ఇరాన్ కు దొరికిపోవటం అన్నది అమెరికాలో హాట్ టాపిక్ అవుతుంది. యుద్ధ వ్యతిరేక సెంటిమెంట్లు మరింత పెరిగిపోతాయి. ట్రంప్ కి పీడకల గా మారే అవకాశం ఉంది.
- This is wrong news. Pilot has been rescued by US forces. Trump described the US troup rescue as one of the daring and dangerous rescue operation in the history of wars.
06/04/2026
- కూలిన జెట్ పైలట్ కోసం జరిగిన సర్చ్ & రెస్క్యూ ఆపరేషన్ లో అమెరికాకి చెందిన రెండు C130 విమానాలు, రెండు హెలికాప్టర్లు, ఒక ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చి వేసింది. కాగా సైన్యాన్ని తీసుకెల్లే సి 130 యుద్ధ విమానాలు ఇరాన్ లో బురదలో ఇరుక్కుపోయాయని, అవి ఇరాన్ చేతులకు చిక్కకుండా ఉండేందుకు తామే బాంబులతో నాశనం చేశామని అమెరికా చెబుతున్నది.
- C130 విమానం నిజానికి 100 మంది సైనికులను రవాణా చేసే విమానం. పైలట్ ను రక్షించే నెపంతో ఇరాన్ లోని ఒక అణు ఇంధన శుద్ధి కర్మాగారం నుండి శుద్ధి చేసిన 1000 పౌండ్ల యురేనియం ఇంధనాన్ని దొంగిలించేందుకు అమెరికా పథకం వేసిందని అంతా అనుమానిస్తున్నారు. అది విఫలం కావటంతో పాటు విమానాలు జెట్ లు కూలిపోవడంతో ట్రంప్, చివరికి బూతుల కు దిగాడు. ఫకింగ్ బాస్టర్డ్ అని తిట్టే దాకా వెళ్ళాడు.
- పైలట్ నిజానికి పర్షియన్ అఖాతం తీరానికి 80 కిమీ దూరంలో ఉంటే రెస్క్యూ విమానాలు, బలగాలు మాత్రం 200 కి.మీ లోపల దిగాయి. దాంతో అనుమానాలు బలపడ్డాయి.
- అమెరికా పైలట్ ను పట్టుకోవటానికి గాలింపు చర్యలు చేపట్టిన ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించేందుకు, తద్వారా అమెరికా పైలట్ ఇరాన్ కు దొరకకుండా తప్పించేందుకు అమెరికా పైలట్ కూలిన లొకేషన్ గురించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టిందని, ఇరాన్ సైన్యం ఆ ప్రచారాన్ని నమ్మిందని ఇప్పుడు వెల్లడి అయింది.
- యుద్ధానికి ముందు ఇరాన్ లో జరిగిన నిరసన ప్రదర్శనకారులకు తాము పెద్ద మొత్తంలో తుపాకులు, బాంబులు సరఫరా చేశామని ఫాక్స్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. “లేదు. నేను చేస్తున్న యుద్ధం సమర్థించు కోటానికి 100 శాతం వీలు లేనిది. నా యుద్ధంలో ఎలాంటి నైతిక పునాది లేదు గాక లేదు” అని ట్రంప్ తేల్చి చెప్పాడు. గత అధ్యక్షులకు, డొనాల్డ్ ట్రంప్ కూ ఉన్న తేడా ఇదే. గత అధ్యక్షులు తమ చట్ట వ్యతిరేక యుద్ధాలను, దాడులను సమర్ధించుకునేందుకు రకరకాల కట్టుకధలు, అబద్ధాలు చెప్పగా డొనాల్డ్ ట్రంప్, ఎలాంటి హిపోక్రసీ లేకుండా అమెరికా దుర్బుద్ధిని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నాడు. తమ దుర్బుద్ధిలో తప్పు ఉన్నట్లు కూడా ఆయన భావించటం లేదు.
- ట్రంప్ నిర్మొహమాటపు ఒప్పుకోలుతో శాంతి యుత నిరసన ప్రదర్శనలపై ఇరాన్ ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేత అమలు చేసిందన్న పశ్చిమ పత్రికల ప్రచారం శుద్ధ అబద్ధం అని ట్రంప్ స్వయంగా చెప్పినట్లే.
- అమెరికా, భూతల యుద్ధానికి వస్తే గనక వారిని ఎదుర్కోవటానికి మిలియన్ మంది (పది లక్షలు) ఫైటర్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. అమెరికా సైన్యం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఇరాన్ విదేశీ మంత్రి ఒక అమెరికా టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన సమాధానంతో ఖంగు తినటం టి.వి యాంకర్ వంతయింది.
- ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి విషయంలో రష్యా వ్యవహరణ పక్కా సామ్రాజ్యవాద లక్ష్యాలతో కూడి ఉంది. అమెరికా ఆధిపత్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఇరాన్ కు పూర్తి మద్దతుగా నిలబడే బదులు ఇరాన్ ను అడ్డం పెట్టుకుని సొంత ప్రయోజనాలు నేర్చుకునే పనిలో నిమగ్నం అయింది.
- మార్చి నెలలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ బహ్రెయిన్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వీటో చేసే బదులు ఓటింగ్ నుండి రష్యా, చైనా లు విరమించుకున్నాయి. అంటే abstain అయ్యాయి. ఆ తర్వాత రోజే రష్యా చమురు రవాణా పైన విధించిన ఆంక్షలను నెల రోజుల పాటు ఎత్తి వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
- ఇజ్రాయెల్, గాజా పైన సాగించిన అమానుష హత్యాకాండను కూడా రష్యా బేషరతుగా ఖండించ లేదు. కారణం అడిగితే ఇజ్రాయెల్ లో రష్యా నుండి వలస వెళ్ళిన యూదులు 1 నుండి 1.25 మిలియన్ల ఉన్నారని, ఇజ్రాయెల్ దాదాపు రష్యన్ దేశంగా చెప్పొచ్చని పుతిన్ వ్యాఖ్యానించాడు.
- గల్ఫ్ దేశాలతో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) వాణిజ్య పథకం రీత్యా ఉన్న వాణిజ్య సంబంధాలు దెబ్బ తింటాయన్న భయంతో చైనా కూడా గోడ మీద పిల్లి పంథా అనుసరిస్తోంది.
- కాబట్టి చైనా, రష్యా లు ముఖ్యం గా రష్యా, బహుళ ధృవ ప్రపంచ దిశగా ఎంత స్థిరంగా పని చేస్తాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.
- గమనించాల్సింది ఏమిటంటే, బహుళ ధృవ ప్రపంచం అంటే అమెరికా కి ఖరాఖండిగా వ్యతిరేకించి నిలబడాలన్న అవగాహన రష్యా, చైనా లకు లేదు. అవసరం అయితే అమెరికాతో రాజీకి, లోపాయకారి అవగాహన కు వచ్చేందుకు అవి సుముఖంగా ఉన్నాయి.
- కనుక సౌత్ దేశాలకు (మూడో ప్రపంచ దేశాలకు) బ్రిక్స్ కూటమి అండగా ఉండే అవకాశాలు కనబడడం లేదు. సౌత్ దేశాలను వాటాలుగా పంచుకునే వాతావరణం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
- ఇరాన్ మాత్రం స్థిరంగా సార్వభౌమత్వానికి కట్టుబడి అమెరికాతో తలబడుతోందని ఆ దేశ ప్రకటనలు, నిర్ణయాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే అంశం భవిష్యత్ లో చైనా, రష్యాలకు ఇరాన్ మింగుడు పడని దేశంగా పరిణమించ వచ్చు.
- ఏ విషయం లోనూ ఇరాన్ రాజీ పడటం లేదు. ఇందు కోసమే 40 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా యుద్ధంలో ఎత్తుగడలు వేస్తోంది.
- ఇరాన్ యుద్ధం సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ పెద్దల గురించి ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాగ్చి లోతైన విజ్ఞానం కలిగిన మేధావి. బ్రిటిష్ మార్క్సిస్ట్ స్కాలర్, మార్క్స్, ఎంగెల్స్ ల సిద్ధాంతం పైన పలు పుస్తకాలు రాసిన డేవిడ్ మెక్ లిల్లాన్ కి శిష్యుడిగా పి హెచ్ డి చేశాడు. అలాగే ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఆలీ లారిజాని 18వ శతాబ్దపు జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయేల్ కాంట్ ఫిలాసఫీ లో నిపుణులు.
- ఇరాన్ ప్రభుత్వ పెద్దలు ఇతర గల్ఫ్ దేశాలకు మల్లే మత మౌఢ్యం తో ఉన్నట్లు గాని, మత మౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నట్లు గానీ కనిపించటం లేదు. వారిలో కొందరు మత సూత్రాల అమలు లో గట్టిగా ఉండాలని కోరుతుండవచ్చు. కానీ చనిపోయిన అయితుల్లా ఖమేనీ మాత్రం ఆ జాబితాలో లేదు. ఎందుకంటే ఆయన షియా ఫిలాసఫీ తో పాటు పశ్చిమ దేశాల ఫిలాసఫీ, రాజకీయ సిద్ధాంతాలు కూడా చదవాలని గట్టిగా బోధించే వాడట.
- ఇరాన్ రాజకీయ నాయకత్వం ఎంత కాలం యుద్ధం చేయాలని నిర్ణయిస్తుందో అంత కాలం యుద్ధం చేసేందుకు ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి ప్రకటించాడు. ఇంకో యుద్ధం చేయటానికి వెనకడుగు వేసే పరిస్థితి కి శత్రువు చేరుకునే వరకూ యుద్ధం చేస్తాం. యుద్ధం మొదలు పెట్టినందుకు శత్రువు చింతించాలి. అని ఆర్మీ ప్రతినిధి మహమ్మద్ అక్రమిలియా అన్నాడు.
07/04/2026
- ఇరాన్ తో భూతల యుద్ధానికి తలపడేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు అమెరికా పూర్తి చేసింది. గ్రౌండ్ దాడి కి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసిన ఆర్మీ కమాండర్లను యుద్ధ మంత్రి పీట్ హెగ్ సేత్ వారి బాధ్యతల నుండి తొలగించాడు. ఆయుధ సామాగ్రిని, సైనికులను యూరప్ లోని వివిధ అమెరికా సైనిక స్థావరాలకు తరలించారు.
- గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆర్మీ బేస్ లు అన్నీ ఇరాన్ దాడుల్లో నాశనం అయ్యాయి. అవి సైనిక కార్యకలాపాలు తర్వాత సంగతి కనీసం ఉండటానికి కూడా వీలు లేనంతగా నాశనం అయ్యాయని ఐరోపా, అమెరికా పత్రికలు తేల్చేశాయి. ప్రస్తుతం అమెరికా, యుద్ధాన్ని ఐరోపా (ప్రధాన కేంద్రం జర్మనీ, బ్రిటన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్) దేశాల లోని తన సైనిక స్థావరాల నుండి చేస్తోంది.
- అంటే ఐరోపా దేశాలు కూడా ఆల్రెడీ యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయి. అవి యుద్ధం నుండి దూరంగా ఏమీ లేవు.
- గ్రౌండ్ యుద్ధంలో యు ఏ ఇ, సౌదీ అరేబియా లు కూడా పాల్గొవచ్చు అంటున్నారు. ఐతే యుద్ధం రెచ్చగొట్టిన ఇజ్రాయెల్ మాత్రం గ్రౌండ్ ఆపరేషన్ లో పాల్గొనక పోవచ్చు.
- యుద్ధ విశ్లేషకుల ప్రకారం, అమెరికా ఒకేసారి రెండు దిశల్లో గ్రౌండ్ ఆపరేషన్ చేయొచ్చు. ఒకటి: ఖార్గ్ ఐలాండ్ పైన దాడి. ఇరాన్ చమురు, గ్యాస్ ఎగుమతుల్లో 90 శాతం ఈ ఐలాండ్ నుండే జరుగుతాయి. ఖార్గ్ ఐలాండ్ ను అదుపులో తెచ్చుకుని హార్ముజ్ జలసంధి తెరిపించాలని అమెరికా ఎత్తుగడ.
- రెండు: దాదాపు ఇరాన్ సెంటర్ లో ఉన్న ఇస్ఫాహన్ అణు శుద్ధి కేంద్రం పైన దాడి చేసి అక్కడ దాచినట్టు భావిస్తున్న 1000 పౌండ్ల యురేనియం ను ఎత్తుకెళ్లడం. ఇది చెయ్యాలంటే భూమి, కొండల్ని తొలిచే ఎక్స్ కేవెటర్లు అక్కడికి మోసుకెళ్లాలి. ఎందుకంటే అణు కర్మాగారం కొండ కింద భూగర్భంలో లోతులో ఉంటుంది. అలాగే విమానం దిగి, ఎగరటానికి రన్ వే నిర్మించే సామాగ్రి తీసుకెళ్లాలి.
- రెండు: దాదాపు ఇరాన్ నడిబొడ్డున ఉన్న ఇస్ఫాహన్ అణు శుద్ధి కేంద్రం పైన దాడి చేసి అక్కడ దాచినట్టు భావిస్తున్న 1000 పౌండ్ల యురేనియం ను ఎత్తుకెళ్లడం. ఇది చెయ్యాలంటే భూమి, కొండల్ని తొలిచే ఎక్స్ కేవెటర్లు అక్కడికి మోసుకెళ్లాలి. ఎందుకంటే అణు కర్మాగారం కొండ కింద భూగర్భంలో లోతులో ఉంటుంది. అలాగే విమానం దిగి, ఎగరటానికి రన్ వే నిర్మించే సామాగ్రి తీసుకెళ్లాలి.
08/04/2026
- “Whole civilization of Iran will die” అన్న ట్రంప్ మాటల్ని అమెరికా మిలట్రీ మాజీ అధికారి లారెన్స్ సెల్లిన్స్ గట్టిగా ఖండించాడు. అమెరికా సైన్యం చట్ట వ్యతిరేక ఆర్డర్లను అమలు చేయదని స్పష్టం చేశాడు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై సాగిస్తున్న సంయుక్త వార్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని కోరాడు.
- యుద్ధాన్ని విరమించాలని వెంటనే హార్ముజ్ జలసంధి తెరవాలని కోరుతూ బహ్రెయిన్ ఇంకోసారి ఐరాస భద్రతా సమితి లో తీర్మానం ప్రతిపాదించింది. అమెరికా మద్దతు తెలిపింది. కానీ చైనా, రష్యాలు వీటో చేశాయి. దాంతో తీర్మానం వీగిపోయింది.
- ఫ్లాష్! ఫ్లాష్!! అమెరికా – ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.