అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను


TVlu2

టెంప్లేట్ ని మళ్ళీ మార్చాల్సి వచ్చింది. క్రితం టెంప్లేట్ లో ప్రధానమైన లోపం నేవిగేషన్ కష్టంగా ఉండడం. ‘పాత టపాల’ లోకి వెళ్లడానికి హోమ్ పేజీలో ఎక్కడా సౌకర్యం లేదు. ఇది నేవిగేషన్ కు బాగా ఇబ్బందిగా మారింది. దీనిని కవర్ చేయడానికి ‘ఈ బ్లాగ్ లో విహరించడం ఎలా?’ అన్న పేరుతో వివరణ ఇచ్చాను గానీ అదొక చాట భారతంలా కనిపించింది. కేవలం ‘స్లైడర్’ లో 20 టపాలను చూపించవచ్చు అనుకున్నాను గానీ అవి వెంటనే కనిపించే వెసులుబాటు లేని సంగతిని విస్మరించాను.

అదీ కాక స్లైడర్ కొన్నిసార్లు పని చేయని సంగతిని గమనించాను. అంకెలపై క్లిక్ చేస్తే సంబంధిత టపాను క్లుప్తంగా చూపించాల్సి ఉండగా పేజీ కొద్దిగా కిందికి జరుగుతోంది తప్ప టపా మారడం లేదు. కొన్నిసార్లు మాత్రమే ఇలా జరుగుతోంది. కొన్నిసార్లే అయినా అది పాఠకుడిని చికాకు పరచవచ్చు.

ప్రస్తుత టెంప్లేట్ లో ఇంతవరకు ఆ సమస్య కనపడలేదు. (వేరే బ్లాగ్ లో నిన్నటి నుండి చూస్తున్నాను.) ఇందులో మొదటి 6 టపాలు స్లైడర్ లో కనిపిస్తాయి. ఎందుకైనా మంచిదని 6 కే పరిమితం చేశాను. తదుపరి 9 టపాలు ఆ కింద కంటెంట్ ను క్లుప్తంగా చూపిస్తూ సిద్ధంగా కనిపిస్తాయి. అల్లా పాత టెంప్లేట్ అన్ని విధాలుగా బాగుంది అన్న సూచనను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని వెతికితే ఇది దొరికింది.

వర్గాలు, పేజీలు బ్లాగ్ పై భాగంలో వరుసగా కనిపిస్తాయి. టైటిల్ పైన క్ల్లిక్ చేస్తే హోమ్ పేజీలోకి వెళ్లవచ్చు. ఎప్పటిలా హోమ్ పేజీ కింది భాగంలో వివిధ విడ్గెట్లు ఉన్నాయి. కానీ బ్లాగ్ మిత్రులు కింద గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో సందర్శకుల గ్రావతార్ లను చూపించడానికి వీలు లేదు. ఇది ఈ ధీమ్ లో కనిపిస్తున్న ఒకే ఒక్క లోపం. ఒక్కో టపాను విడిగా చూసినపుడు కుడి పక్క సైడ్ బార్ కనిపిస్తుంది. ఇందులో తాజా టపాలు 20, ఉత్తమ టపాలు 10 కనిపిస్తాయి.

టెంప్లేట్ వేట ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటూ…. మీ అభిప్రాయాలు కోరుతున్నాను.

8 thoughts on “అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను

  1. This template is really really good. Navigability is good. The font size is really exploiting the real-estate of the screen. We can see the recent posts and the previous posts as glancing like we do in our original template. The purple color navigation ribbon is good. If you would like you can change the color – I guess – to promote the mood, aim and ambition of this site. I think purple is no good for this site. Your call is final- anyways.

    Most importantly this template is simplistic and nice.

  2. విశేఖర్ గారు… ఈ పాట వినండి. చాలా బావుంది. జాలాది గారు రాశారు. జీవితానికి ..రైలు ప్రయాణానికి మధ్య సంబంధాన్ని గొప్పగా చెప్పారు. మన పాఠకుల కోసం..
    [audio src="https://dl.dropboxusercontent.com/u/190095910/RAGHU%20FINAL/RAJASHEKAR/Ida%20Prapancham%20(1987)/02%20-%20Bandelli%20Pothondi.mp3" /]

  3. విశేఖర్ గారూ…పర్పుల్ అంత గొప్పగా లేదు. ఇది బాగానే ఉంది.

    ఐతే ఇన్ని సార్లు మీరు మార్చినా..మొదటి దానికి మాత్రం ఏది సాటి
    లేదండి. మార్పుకు అలవాటు పడడానికి కొంతకాలం పడుతుందనుకుంటా..

  4. చందుతులసి, మీరు పోస్ట్ చేసిన పాట విన్నాను. ఈ పాట ఫేమస్ కదా! ముందే విన్నాను. కధలు, నవల్లు, తత్వ బోధనల్లో కూడా జీవితాన్ని రైలు ప్రయాణంతో పోల్చడం మామూలే. కానీ అది యాంత్రికంగా ఉంటుంది. జాలాది పోలిక మాత్రం యాంత్రికంగా కాకుండా బతుకుల లోతు చూసినట్లు ఉంటుంది. ఆయన రాసిన ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు…’ పాట కూడా నాకిష్టం. తరచుగా దాన్ని పాడుకుంటుంటాను.

    ఔను. ఆ ధీమ్ సౌకర్యంగా ఉంది. కాని మరీ ఇరికించినట్లుగా అనిపించేది. ఈ ధీమ్ కి పైన పట్టినన్ని కేటగిరీలు అందులో పట్టలేదు. నాకు అదొక కొరవగా ఉండేది. మార్పు తలపెట్టడానికి అది కారణం.

వ్యాఖ్యానించండి