‘తెలుగువార్తలు డాట్ కామ్’ ఉరఫ్ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కోసం టెంప్లెట్ వేట ఇంకా ఆగిపోలేదు. ఆక్సిజన్ అలంకారం (అదేనండీ, ధీమ్ ఉరఫ్ టెంప్లేట్) కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదని అర్ధం అయిపోయింది. మిత్రులు ఆ సంగతి నేరుగా చెప్పలేక ‘అది ఉంది కానీ ఇది లేదు’ ‘ఫర్ఫాలేదు, కానీ అంతకుముందుదే బాగుంది’ లాంటి వ్యాఖ్యలతో తమ అసంతృప్తిని పరోక్షంగా చెప్పేశారు.
నిజానికి ‘ఆక్సిజన్’ నాకూ నచ్చలేదు. వేణు గారు అన్నట్లు అది క్లమ్సీగా ఉంది. స్లైడర్ లాంటి ఆధునిక అంశాలు ఉన్నప్పటికీ అది ఫ్రంట్ పేజీలోని మిగిలిన భాగంతో పెద్దగా కలవలేదు. ఇంగ్లీష్ భాగుల్లో ఆక్సిజన్ చాలా అందంగా కనిపించింది. తెలుగు అక్షరాలకు వచ్చేసరికి పొందిక కుదర్లేదు. టపాలు గరిష్ట సంఖ్యలో కంటికి ఇంపుగా కనిపిస్తున్న పరిస్ధితి లేకుండా పోయింది. దానితో అది కూడా తీసేయాలని డిసైడ్ అయిపోయాను. మళ్ళీ పాత ‘సబర్బియా ధీమ్’ కు వెళ్ళాక తప్పదని అనుకుంటూ ‘అయినా చూద్దాం’ అని వెతికాను. చివరికి ఇది కనిపించింది.
ఈ ధీమ్ పేరు ‘స్ప్లెండియో.’ మొదట చూసినపుడు సాధారణంగా కనిపించింది. కొంత పరిశోధన చేశాక పాఠకులు లేవనెత్తిన అన్ని అంశాలకు (లేదా మెజారిటీ) సమాధానం ఇందులో ఉన్నట్లు అర్ధం అయింది.
తాజా ధీమ్ లో రంగుల కలయిక అందంగా బాగుంది. రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ రీత్యా వృధా లేదు. ఇందులో కూడా స్లైడర్ ఉంది. బహుశా ఓ 20 వరకూ తాజా టపాలను ఈ స్లైడర్ లోనే చూడవచ్చనుకుంటాను. కొందరు మిత్రులు కోరినట్లు ఫోటోతో పాటు కొంత మేటర్ కూడా కనిపిస్తోంది. ఫోటోలు ఎక్కువ స్ధలం ఆక్రమించలేదు. స్లైడర్ లో టపా శీర్షిక చక్కగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘ఇటీవలి టపాలు’ కింద 20 టపాలు కనపడేలా పెట్టాను. ఉత్తమ టపాలు కింద 10 టపాలు కనిపిస్తాయి. కింది భాగంలో ఐదు విడ్గెట్ ఏరియాలు ఇవ్వడం అదనపు సౌకర్యం. (గతంలో నాలుగే.) “IN OTHER NEWS” పేరుతో కొన్ని టపాలు కనిపిస్తున్నాయి. ఇది నేను అమర్చింది కాదు. ఏ ప్రాతిపదికన ఇవి కనిపిస్తున్నాయో ఇంకా అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక దాన్ని అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తాను. ‘సింగిల్ పేజి టెంప్లేట్’ పేరుతో ఇంకొకటి ఏదో ఇచ్చారు. అది అర్ధం కాలేదు. అయ్యాక అమర్చగలను.
హెడర్ ఏరియాలోనే ‘వెతుకు’ బాక్స్ కనిపించడం, దాని కింద ట్విట్టర్, ఫేస్ బుక్ లోగోలు కూడా ఉండడం అదనపు ఆకర్షణ!
ఈ టెంప్లేట్ పైన కూడా అభిప్రాయాలూ చెప్పాలని విన్నవిస్తూ…
చూడగానే ఈ టెంప్లేట్ నాకు నచ్చింది. రంగుల సమ్మేళనం, అక్షరాల పరిమాణం బాగున్నాయి.
పైన ‘వెతుకు’ ఆప్షన్ జనరల్ సెర్చి మాత్రమే. యాహూ సెర్చింజన్ లోకి వెళ్తోంది. ఇలా కాకుండా ఈ బ్లాగులోని అంశాలు వెతికే సెర్చిని అమర్చితే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.
అవునా? అయితే బ్లాగ్ సెర్చి పెడతాను. వీలయితే అక్కడే కింద, లేకపోతే అడుగున ఫుటర్ విడ్గెట్ లో
this template is nice
i like this template is very much
ee template kante paatadi chaala professional ga undi.. idi kuda bane undi kani adi chala chala bagundi…
ఒ.కె. విశేఖర్ గారు. ఇది బాగానే ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బావుంది.
This template is nice! Good one! 😀
చూడడానికి కళ్లకి ఇంపుగా,చాలా బాగుంది.
పింగ్‌బ్యాక్: అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ