ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ప్రకటించింది. సిరియా భవిష్యత్తును సిరియా ప్రజలే నిర్ణయించుకోవాలి తప్ప విదేశీ శక్తులు కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో బొతైన భారత సందర్శన ప్రాముఖ్యత సంతరించుకుంది.
బొతైన షాబాన, సిరియా అధ్యక్షుడు బషర్ కు అత్యున్నత స్థాయి రాజకీయ, సమాచార సలహాదారు. వచ్చే మంగళవారం మార్చి 3 తేదీన ఆమె ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలవనున్నది. సిరియా ప్రభుత్వం నుండి ప్రత్యేక సందేశాన్ని ఆమె మోసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు ఇతర భారత అధికారులను, మంత్రులను కూడా కలిసి సిరియాలో తాజా పరిస్ధితిని ఆమె తెలియజేస్తుందని సిరియా రాయబారులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో కలిసి ఆమె ఏప్రిల్ 2008 లో ఒకసారి భారత దేశం సందర్శించింది.
ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆలి లారిజానీ భారత్ పర్యటన మార్చి 1 తో ముగిసింది. ఐదు రోజుల పాటు ఆలి భారత్ లో పర్యటించిన అనంతరం బొతైన భారత్ రావడం విశేషం. ప్రధానితో పాటు భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులను కలిసిన ఆలి పర్యటనలో సిరియా ఘర్షణల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సిరియా విషయమై వారు ఏమి మాట్లాడుకున్నదీ వివరాలు పత్రికలు ఇవ్వలేదు. వాణిజ్య, పార్లమెంటరీ సహకారం గురించి చర్చించామని చెప్పినప్పటికీ అవేమిటో వెల్లడి కాలేదు. చైనా తర్వాత ఇరాన్ చమురు వినియోగించే దేశాల్లో ఇండియాయే (సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయల చమురు ఇరాన్ నుండి దిగుమతి అవుతోందని ఫార్స్ న్యూస్ అంచనా) అతి పెద్దది.
అస్సాద్ సలహాదారు బొతైన, పశ్చిమ దేశాలు కక్ష కట్టిన ఇరాన్ నాయకులలో ఒకరు. ఆమె అంతర్జాతీయ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి. అయితే బొతైన ప్రకారం ఆమెకు పశ్చిమ దేశాలలో అసలు ఖాతాలే లేవు. 2005 నుండి ఆమె అమెరికా బ్లాక్ లిస్టులో బొతైన షాబాన పేరు కొనసాగుతోంది.
రష్యా టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఇలా తెలిపింది. “2005 నుండి నాకు అమెరికా నుండి అనేక ఆహ్వానాలు అందాయి. నేను వెళ్లలేదు. ఎందుకంటే వారి విమానాశ్రయాల్లో ప్రజలతో వ్యవహరించే పద్ధతి నాకు నచ్చదు. నాకు ఒక్క డాలర్ కూడా లేకపోయినా నా ఆస్తులను స్తంభింపజేసినట్లు ప్రకటించారు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ నాకు ఆస్తులు లేవు. వారు నాకు సంబంధించి ఎన్ని ఆస్తులైనా స్తంభింపజేసుకోవచ్చు. నేను రాసిన రెండు పుస్తకాలు అమెరికాలో అమ్ముడవుతున్నాయి. డ్యూక్ యూనివర్సిటీలో నేను బోధించాను. ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీలో కూడా బోధించాను. నేను కాదు, వారే సిగ్గుపడాలి.”
అవకాశం వచ్చినప్పుడల్లా అమెరికా వెళ్ళి అక్కడ తమ దుస్తులు తనిఖీ చేశారని, గంటల తరబడి తనిఖీ చేసి నిలబెట్టారని, వొళ్ళంతా తడిమారని భారత అధికారులు, రాయబారులు తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. అలా ఫిర్యాదు చేసే బదులు శుభ్రంగా అక్కడికి వెళ్లడమే మానుకోవచ్చని సిరియా నాయకురాలు బొతైన మాటలు తెలియజేస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాని కామెరాన్ ను తొలగించాలని బ్రిటిష్ ప్రజలకు ఇతర దేశాలు పిలుపునిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తూ ఆమె ప్రజాస్వామిక సూత్రాలు తమకొక విధంగానూ, అరబ్ ప్రజలకు మరొక విధంగానూ ఉండాలని పశ్చిమ దేశాలు కోరుకుంటాయని ప్రకటించడం ద్వారా తన ఆస్తుల స్తంభన ప్రకటనకు కారణం ఏమిటో ప్రపంచానికి తెలియజేసింది.
సిరియాకు వ్యతిరేకంగా సాగుతున్న అంతర్జాతీయ కుట్రను ఎండగట్టడానికి భారత దేశం క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ దేశం కోరుతోంది. రష్యా, చైనా, ఇరాన్ దేశాలకు మల్లే తమ దేశంలో హింసాత్మక టెర్రరిజం అంతం కావడానికి భారత ప్రభుత్వం సానుకూల పాత్రం పోషించాలని ఆశిస్తోంది. సిరియాలో ఘర్షణ పడుతున్న వైరి వర్గాల మధ్య నేరుగా చర్చలు జరగాలని కోరుతున్న ఐరాస రాయబారి లఖ్దర్ బ్రహ్మి చొరవకు ఇండియా ఇప్పటికే మద్దతు ప్రకటించింది.
సిరియాలో మిలట్రీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వివిధ సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రకటించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. సిరియాను మరింత మిలిటరీకరణ చేయడం వలన సమస్య పరిష్కారం కాకపోగా మరింత క్లిష్టం అవుతుందని ఇండియా ఐరాసలో కూడా అభిప్రాయం తెలిపింది. అయితే ఇండియా బోధలు ఇంతవరకు మాటల వరకే పరిమితం. చారిత్రక సంబంధాలు కలిగి ఉండడమే కాక దాదాపు 60 లక్షల మంది భారతీయులకు ఆవాసం అయిన మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) మిలిటరీకరణ భారతదేశ ప్రయోజనాలకు తీవ్ర భంగకరం. కానీ ఆ మేరకు భారత్ వైపు నుండి అంతర్జాతీయ కార్యాచరణ లేకపోవడం విచారకరం.

Haa nice
Is she used to be a prof. @ eastern Michigan ? I was student @ emu too.
Any how, I have a question here!
Why any country allows other counteries interference in to their own stuff.
In the above situation why they seeking India’s help? Why don’t others(any other super powe country)
And I do agree with her comments about USA.
I don’t wanna talk about government here because I am not a political person, but in average American view, there is still racism in the form of “mask racism”.no offence but,Still people other than white consider they are 3 rd class citizens.
And also I do appreciate vsheker’ effort. Thank you soo much