ఈనాడు దిన పత్రిక సోమవారం (18-02-2013) నాటి ‘చదువు’ పేజిలో ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ని ప్రచురించింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆర్టికల్ కాపీని కింద ఇస్తున్నాను. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులొ చూడగలరు.) మొదటి భాగం వరకు ఈ రోజు ప్రచురించారు. రెండో భాగాన్ని, తరువాత వచ్చే చదువు పేజిలో (వచ్చే సోమవారం) ప్రచురించనున్నట్లు పత్రిక తెలిపింది. గత సంవత్సరం ఏప్రిల్ 23 తేదీన ఈనాడు పత్రికే ఈ బ్లాగ్ ను తన పాఠకులకు పరిచయం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. విద్యార్ధులు, ఉద్యోగార్ధులు జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపై ఒక దృక్పధాన్ని పెంచుకొవలసిన అవసరాన్ని అదే రోజు ఈ బ్లాగ్ లో చర్చించడం జరిగింది. ఈ నాటి ఆర్టికల్ ఆ చర్చకు కొనసాగింపుగా చూడవచ్చు.
ఇంటర్నెట్ యుగంలో బ్లాగింగ్ అందుబాటులోకి వచ్చాక సకల అంశాలపైన తమ తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పుకునే సౌకర్యం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో పత్రికలకు, బ్లాగర్లకు మధ్య సహకారం సరికొత్త పరిణామంగా ముందుకు రావడం ముదావహం. అటువంటి సహకారం పత్రికలు మరింతగా ప్రజాస్వామికీకరణ చెందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎంతగా ప్రజాస్వామికీకరణ చెందితే పత్రికలు అంతగా ప్రజలకు చేరువ అవుతాయి. ఈనాడు పత్రికకు ఈ సందర్భంగా ధన్యవాదాలు.
–

విశెఖర్ గారూ ముందుగా మీకు అభినందనలు బ్లాగు తొపాటు వార్తపత్రికలుకుకుడా వ్యాసాలు రాస్తె బాగుంటుందని నా అభిప్రాయం. సమాజం పైన అవగాహన లేని వాళ్ళు ఎంతొమంది రాస్తున్నారు అవగాహన వున్న మీలాంటి వాళ్ళు రాస్తె ఎంతొమందికి ఉపయొగకరంగా ఉంటుంది.
శేఖర్ గారూ మీకు అభినందనలు. ఈనాడు పత్రిక మీ సైటు ని ప్రజలకు తెలియచేయటం ఇది రెండో సారి. మీరు ఇంకా బాగా ఈ బ్లాగ్ ని రన్ చేయటానికి ఇది మీకు మంచి మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. మీ పై (మీ పోస్టులపై) బూతులు రాసిన వారికి ఈ వార్త మింగుడు పడదు. వారిని ఇది బాగా కలవర పెడుతుంది. వారు ఇకనైనా బుద్ది తెచ్చుకుంటారని అనుకుంటున్నాను.
రామమోహన్ గారు, ధన్యవాదాలు. మీ సూచనను దృష్టిలో ఉంచుకుంటాను. కాని, పత్రికలకు అనేక పరిమితులు కదా. ఐనా ప్రయత్నించడంలో తప్పు లేదు.
భాస్కర్ గారు, ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు బ్లాగ్ ని ఇంకా బాగా నడపడానికి ఇది ప్రోత్సాహాన్నిస్తుంది.
Keep it up!
It is very very helpful for Civil services Thanks a lot.
శేఖర్ గారు కంగ్రాట్స్. ఆర్టికల్ చాలా ఉపయోగకరం గా ఉంది. వచ్చే వారం ఆర్టికల్ కోసం ఎదురు చూస్తున్నా
వాసవ్య గారూ ధన్యవాదాలు.
రూప గారు, మీ మిత్రులకు కూడా తెలియజేయగలరు.
చందుతులసి గారు, ధన్యవాదాలు.
sir can u write indias relation with world means bilateral or trilteral..thanks
vishekhar garoo,
Hearty congractulations..
I introduced our blog to my friends also.
Please write one blog on (why currency value different from country to country, factors to plays important role in currency value matters b/w countries).
2. Route cause factors for recession(we had seen so many recessions till now, please relate old recission strategies to new recession strategies)
Please its my special advice. Don’t give your valuable time to worst people comments. If you get any comments from now, please ignore. It would be great to continue with your analysis.
Again heartly congratulation to you Sir!!
-Subhas
shekar garu miru chala manchi vyasalu rastunnaru