తెలంగాణ ఉద్యోగుల “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమణ

తెలంగాణ ఉద్యోగులు 16 రోజులనుండి చేస్తున్న “సహాయ నిరాకరణ” ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుండి విధుల్లో చేరాలని తెలంగాణ ఎన్జీఓల సంఘం నాయకుడు స్వామి గౌడ్ ఉద్యోగులను కోరాడు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక సెక్షన్ ఉద్యమం విరమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమించినందుకు ఆగ్రహంతో స్వామి గౌడ్ దిష్టి బొమ్మను కూడ ఆ జిల్లాలో దహనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసౌకర్యాన్ని తప్పించడానికే పది లక్షలకు పైగా విధ్యార్ధులకు మార్చి…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు

  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పి.జె.ధామస్ నియామకాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చారు. కేరళలొ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండగా 1992లో పామాయిల్ ను అధిక ధరలకు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న పి.జె.ధామస్ ను సి.వి.సి గా నియమించడం చెల్లదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ “సుప్రీం తీర్పు ప్రధానికీ, ఆయన ప్రభుత్వానికీ పెద్ద దెబ్బ” అని పేర్కొంది. సి.వి.సి ప్రతిష్ట సుప్రీం…

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…

ముబారక్ నియమించిన ఈజిప్టు ప్రధాని రాజీనామా

  ఈజిప్టు మాజీ అధ్యక్షుడు తన చివరి రోజులలో నియమించిన ప్రధాని అహ్మద్ షఫిక్ గురువారం రాజీనామా చేశాడు. ముబారక్ కు సన్నిహితుడుగా భావిస్తున్న షఫిక్ తొలగింపు కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి. మిలట్రీ కౌన్సిల్ షఫిక్ రాజీనామాను ఆమోదించినట్లుగా తన ఫేస్ బుక్ పేజీ లో ప్రకటించింది. రవాణా శాఖ మాజీ మంత్రి ఎస్సామ్ షరాఫ్ ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లుగా కూడా కౌన్సిల్ తెలిపింది. సోమవారం నాడు ముబారక్, అతని కుటుంబ…

తిరుగుబాటు ప్రాంతాలపై గడ్డాఫీ సైనికుల దాడి, తిప్పికొట్టామంటున్న తిరుగుబాటుదారులు

  తిరుగుబాటు మొదలయ్యాక మొట్టమొదటిసారి గడ్డాఫీ తిరుగుబాటు ప్రాంతాలపై తన సైన్యంపై దాడి చేశాడు. ఈ దాడిని తిప్పికొట్టామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బెంఘానీ పట్టణం సమీపంలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గడ్డాఫీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు వర్గాలు కూడా మొదట గడ్డాఫీ పక్షం దాడి విజయవంతం అయిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత వారిని మళ్ళీ వెనక్కి తరిమినట్లు ప్రకటించారు. ఆయిల్ ఉత్పత్తిని బైటికి సరఫరా చేయటానికి ప్రధాన టెర్మినల్ గా ఉన్న…

పిలవని పేరంటానికి అమెరికా, లిబియా వద్ద యుద్ధ వాతావరణం

  అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని…

ఫ్రాన్సు అతి తెలివి – ట్యునీషియా మచ్చ లిబియాకు సహాయంతో మటుమాయం?

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రస్తుతం గడ్డాఫీ వ్యతిరేకుల ప్రభావంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి సహాయం చేసే పనిలో ఫ్రాన్స్ ఉంది. డాక్టర్లు, నర్సులు, మందులతో రెండు విమానాలు లిబియాలో తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణానికి బయలుదేరినట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ ఫిల్లాన్ ప్రకటించాడు. ట్యునీషియాలో ప్రజల తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు జైన్ ఎల్-అబిదైన్ బెన్ ఆలీ పదవీచ్యుతుడయిన విషయం తెలిసిందే. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగుతున్న…