బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్

కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం…

భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు

‘ఇండియన్ రైల్వేస్’ కి భారత దేశ ప్రయాణీకుల అంతరంగంలో ఉత్కృష్ట స్ధానం ఉంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ లక్షల కొద్దీ పల్లెలనూ, పట్నాలనూ కలుపుతూ వ్యాపించిన భారత రైల్వేలు లేకుండా భారతీయుడికి రోజు గడవదు. భారత దేశంలో ప్రజలకు జీవనాడిగా ఉన్న వేల కొద్దీ వృత్తులూ, ఉద్యోగాలూ ఏదో ఒక రూపంలో రైల్వేలతో సంబంధం లేకుండా లేవు. అది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఐనా, ప్రవేటు కంపెనీ సమకూర్చిన ఉద్యోగం అయినా, స్వయం ఉపాధి అయినా……

సునిశిత హాస్యం ఈ గీతల సొంతం -స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు

ఈ వీధి చిత్రాల్లో కళాకారులు పెద్దగా కష్ట పడినట్లు కనిపించదు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని గీతలనీ, రోజువారీ ఉపయోగం కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలనూ, ఉపకరణాలనూ ఆధారం చేసుకుని వారు అర్ధవంతమైన చిత్రాలు రాబట్టారు. తరచుగా ఈ చిత్రాల్లో కేవలం కొన్ని గీతలో, కొంత పాఠ్యమో, మహా అయితే రోజూ చూసే చిన్న చిన్న బొమ్మలో కనిపిస్తాయంతే. ఇలాంటి వీధి చిత్రాలు సృష్టించడంలో బ్యాంక్సీ (ఇంగ్లండ్) సిద్ధహస్తుడు. ఓక్ ఓక్ (ఫ్రాన్సు) కూడా. వీరద్దరు…

2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు

2011 జనాభా లెక్కల వివరాలు దశలవారీగా వెల్లడవుతున్నాయి. దేశంలో మొత్తం 24.67 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 16.78 కోట్ల కుటుంబాలు గ్రామాల్లోనూ, 7.88 కోట్ల కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నారని ఈ లెక్కల్లో వెల్లయింది. ఆమ్టే 68.03 శాతం మంది గ్రామాల్లో నివశిస్తుంటే, 31.97 శాతం మంది పట్నాల్లో నివసిస్తున్నారన్నమాట. భారత దేశానికి ఇంకా పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. భారత దేశంలో అత్యధికులకి కనీస సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని కూడా ఈ…

Rape conviction rate

రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు

రేపిస్టులు భారత దేశంలో కాలరెత్తుకు తిరుగుతున్నారు. అనేక సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మరీ రేప్ నేరాలను రిపోర్టు చేస్తున్న బాధితులకు దక్కుతున్నది అవమానాలూ, నిరాశే తప్ప న్యాయం కాదు. 1973 నుండి ఇప్పటి వరకూ శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్యలు చూస్తే రేప్ నేరాల్లో నేరం రుజువై శిక్ష పడిన కేసులు ప్రతి దశాబ్దానికి పడిపోతూ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రేప్ నేరాలలో పోలీసులు జరుపుతున్న పరిశోధనల్లో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, తేలిక భావం చోటు చేసుకోవడం…

బూతు మంత్రులే కాదు, డజను పైన బూతు ఎం.ఎల్.ఏ లు కూడా

కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మాని, ముగ్గురు మంత్రులు బూతు వీడియోలు చూసి టెలివిజన్ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు మంత్రులే కాకుండా ఇంకా డజను కంటే ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కూడా ఆ రోజు బూతు వీడియోలు చూసి తరించినట్లు అసెంబ్లీ కమిటీ పరిశోధనలో బైట పడినట్లు తెలుస్తోంది. మంత్రులు సవాది లక్ష్మణ్, సి.సి.పాటిల్, కృష్ణ పాలేమార్ లు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ…

రేప్ బాధితురాలిని చచ్చిపొమ్మని బెదిరిస్తున్న గ్రామం

పశ్చిమ బెంగాల్ లోని ఓ గిరిజన గ్రామం అది. కామాంధులైన ఐదుగురు చేతిలో సామూహిక మానభంగానికి గురయిన గ్రామ మహిళ ఒకరిని చావనైనా చావాలని లేదా ఊరొదిలైనా పోవాలనీ ఆ గ్రామం హింసిస్తోంది. ఇంటిపై దాడి చేసి తలుపులు పగల గొట్టి, చావబాది గ్రామ పెద్ద విధించిన ‘గ్రామ బహిష్కరణ’ శిక్షను అమలు చేయించడానికి ఆ గ్రామం అంతా ప్రయత్నిస్తోంది. సామూహిక అత్యాచారంతోనే షాక్ లో ఉన్న ఆ మహిళ, గ్రామస్ధుల హింసతో హతాశురాలై సాయం కోసం…

ఇరాన్ వీధి చిత్రకళ -ఫొటోలు

ఇరాన్ వీధి చిత్రకారులు ఐ.సి.వై, ఎస్.ఓ.టి లు గీసిన వీధి చిత్రాలివి. వీరు ఇరాన్ లోని తాబ్రిజ్ నగరానికి చెందినవారు. ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ లాగా వీరు స్టెన్సిల్ టెక్నిక్ తో వీధి చిత్రాలు గీయడంలో సిద్ధ హస్తులు. బ్యాంక్సీ లాగా వీరు కూడా పిన్న వయస్కులు. ఐ.సి.వై వయసు 26 ఏళ్ళు కాగా ఎస్.ఓ.టి వయసు 20 యేళ్ళు. యువకులే అయినప్పటికీ వీరు గీసిన వీధి చిత్రాలలో పరిణితికి కొదవేమీ లేదు.  అసత్యారోపణలతో…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

ట్రాఫిక్ గుర్తుల్ని స్ట్రీట్ ఆర్ట్ గా మలిచిన వైనం -ఫొటోలు

ట్రాఫిక్ గుర్తుల్ని రూపొందించినవారికి కళా దృష్టి తప్పని సరి. బిజీ రోడ్లపై ట్రాఫిక్ ను నియంత్రించడానికి వాడుతున్న గుర్తుల్ని రూపొందించడంలో కళాత్మక దృష్టిని మనం చూడగలం. కళాత్మక దృష్టి లేకుండా ట్రాఫిక్ లో ఎదురవగల ప్రమాదాలను కేవలం కొన్ని రేఖలతో గీసిన గుర్తుల ద్వారా, పెద్దగా రంగులు వాడకుండానే చెప్పగలగడం సాధ్యమేనా? స్ట్రీట్ అర్ట్ చిత్రకారులు తమ కళా దృష్టికి మరింత పదును పెట్టి గీసిన ట్రాఫిక్ గుర్తులివి. మౌస్ పాయింటర్ తో కంప్యూటర్లలో ఎన్నో ఆపరేషన్స్…

Saif Ali Khan

హీరో, హీరోయిన్లా, విలన్లా?

బహిరంగ స్ధలం అయిన ఓ హోటల్ లో పెద్దగా మాట్లాడవద్దన్న పాపానికి ఒక వ్యాపారిపై పిడిగుద్దులు కురిపించి అతని ముక్కు ఎముకను విరగ్గొట్టిన బాలీవుడ్ హీరో ఉదంతం ఇది. సినిమాల్లో విలన్లనూ, వారి అనుచరులనూ యధేచ్ఛగా కొట్టి, కాల్చి చంపే హీరోలు వాస్తవ జీవితంలో కూడా అదే పద్ధతిని కొనసాగించవచ్చని భావిస్తున్నారా? ముంబైలో గల తాజ్ హోటల్ లో జరిగిందీ ఘటన. బుధవారం రాత్రి నలభై నాలుగేళ్ల ఇక్బాల్ నవీన్ శర్మ అనే ఎన్నారై వ్యాపారి సైఫ్…

ఫాలక్ తల్లి మున్నీని కాపాడిన పోలీసులు, తల్లిని చేరనున్న ఫాలక్

వళ్లంతా కొరికిన గాయాలతో, ఎముకలు విరికిన చేతులు కాళ్ళతో, గాయపడిన మెదడుతో ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల ‘ఫాలక్’ తల్లి ‘మున్నీ ఖాటూన్’ ను ఢిల్లీ పోలీసులు రాజస్ధాన్ వ్యభిచార గృహం నుండి రెండు రోజుల క్రితం రక్షించారు. మున్నీ పెద్ద కూతురు మూడేళ్ల పాపను కూడా కాపాడిన పోలీసులు తల్లీ కూతుళ్లను ఒక చోటకి చేర్చగలిగారు. అయితే మున్నీ, తన చిన్న కూతురు ఫాలక్ ను మాత్రం ఇంకా కలవ వలసి ఉంది.…

ఢిల్లీ బాలిక ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

వొళ్లంతా కొరికిన గాయాలతో పాటు, చిట్లిన కపాలం, విరిగిన కాలి, చేతి ఎముకలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ‘ఫాలక్’ (ఆకాశం) గా ఆసుపత్రి సిబ్బంది పేరు పెట్టిన పాపను జనవరి 18 తేదీన పద్నాలుగేళ్ల బాలిక ‘పాపకు తానే తల్లినంటూ’ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చిన సంగతి విదితమే. ముంబై టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ అరెస్టుతో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లేనని…

అగ్నిపధ్ సినిమా స్ఫూర్తితో టీచర్ ని పొడిచా

అగ్నిపధ్ సినిమాలో హీరోని స్ఫూర్తిగా తీసుకుని తన టీచర్ ని కత్తితో పొడిచానని చెన్నై లోని ఓ పాఠశాలలో టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి తెలిపినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం విద్యార్ధి ఇటీవలే ‘అగ్నిపధ్’ సినిమా చూశాడు. సినిమాలో హీరో తన తండ్రిపైన తప్పుడు ఆరోపణలు చేసినవారిని కత్తితో పొడిచి చంపి పగ తీర్చుకుంటాడు. ఈ దృశ్యం నుండే తాను స్ఫూర్తి పొందానని విద్యార్ధి పోలీసులకు తెలిపాడు. విద్యార్ధి…