ఇరాన్ వీధి చిత్రకళ -ఫొటోలు


ఇరాన్ వీధి చిత్రకారులు ఐ.సి.వై, ఎస్.ఓ.టి లు గీసిన వీధి చిత్రాలివి. వీరు ఇరాన్ లోని తాబ్రిజ్ నగరానికి చెందినవారు. ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ లాగా వీరు స్టెన్సిల్ టెక్నిక్ తో వీధి చిత్రాలు గీయడంలో సిద్ధ హస్తులు. బ్యాంక్సీ లాగా వీరు కూడా పిన్న వయస్కులు. ఐ.సి.వై వయసు 26 ఏళ్ళు కాగా ఎస్.ఓ.టి వయసు 20 యేళ్ళు. యువకులే అయినప్పటికీ వీరు గీసిన వీధి చిత్రాలలో పరిణితికి కొదవేమీ లేదు.  అసత్యారోపణలతో ఇరాన్ పై యుద్ధానికి దురాక్రమణ గుంపు అమెరికా, యూరప్, ఇజ్రాయెల్  సిద్ధమవుతున్న నేపధ్యంలో గీసిన ‘హార్డ్ టైమ్స్’, బిచ్చగాడికి ప్రేమను దానం చేస్తున్న బాలిక, మానవ పరిణామంలో స్లైడింగ్ బల్లను చేర్చడం, ప్రేమను ఆటవస్తువుగా చేసుకున్న బాలుడు మొదలయిన చిత్రాలు వీరి పరిణతికి అద్దం పడుతున్నాయి.

2 thoughts on “ఇరాన్ వీధి చిత్రకళ -ఫొటోలు

  1. ఇరాన్ వీధి చిత్రాలు చాలా బాగున్నాయి.

    చివరి నుంచి రెండోది ఎంతో సహజంగా, సజీవంగా కనిపిస్తోంది. ఇనపగుండును మోస్తున్న వ్యక్తి బొమ్మ నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది. బండరాళ్ళ మీద ఆకాశంవేపు చూస్తున్న చిత్రం జీవన విషాదాన్ని బలంగా సూచిస్తోంది!

  2. వేణు గారూ అవును. చివరి నుండి రెండవది చాలా బాగుంది. భవన శిధిలాల నేపధ్యంలో కొత్త నిర్మాణానికి బయలుదేరుతున్న బాలుడు దృశ్యం అది. శిధిలాలనుండే కొత్త నిర్మాణానికి ఊపిరిపోయాలన్న కృత నిశ్చయం బాలుడి మొఖంలో స్ఫురిస్తోంది.
    అగ్ర రాజ్యాల బెదిరింపులను ఇరాన్ ఎదుర్కొంటూన్న నేపధ్యంలో ఈ చిత్రం సందర్భోచితం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s