అమెరికాలో మంచు కురిస్తే భరత ఖండం వణికిపోవాల!
చైనాలో వర్షం కురిస్తే ఇక్కడ గొడుగు పడతారని భారత కమ్యూనిస్టుల గురించి ఒక సామెత లాంటి జోక్ ప్రచారంలో ఉండేది. చైనాలో సోషలిజానికి చరమగీతం పాడిన తర్వాత ఆ సామెత (లాంటి జోక్) ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకుండా పోయింది. ఐతే 1992 నుండి అమలవుతున్న నూతన ఆర్ధిక విధానాల పుణ్యాన ఈ సామెతను మార్చి చెప్పుకోవాల్సిన అగత్యం ఎప్పుడో వచ్చింది. ‘అమెరికాలో మంచు కురిస్తే భారత ప్రజలు వణికిపోవాలి’ అని. అయితే చైనాలో వర్షం కురిస్తే…
