భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2

కనపడేవీ, కనపడనివీ అన్నీ గ్రహించాలి వ్యవస్ధల మార్పులు మనిషి కంటికి కనపడే పరిధిలోనివి కావు. వ్యవసాయంలో ఒక పంట కాలం కొద్ది నెలలు ఉంటుంది. దుక్కు దున్నడం, నాట్లు వేయడం, పంటకు రావడం, కోత కోసి పంట అమ్ముడుబోయి డబ్బులు చేతికి రావడం వరకూ మన కళ్లెదుటే జరిగే పరిణామం. కనుక మనిషి విత్తుదశనుండి పంట చేతికి వచ్చేవరకు జరిగే పరిణామాలను గుర్తించగలుగుతాడు. అలాగే మనిషి పుట్టుక, పెరుదల, చదువు సంధ్యలు, పెళ్ళి, పునరుత్పత్తి, సంతానం సాకడం,…

కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా

చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది. భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది.…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ

దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో…

తమరు అంతగా సంతోషించడానికేమీ లేదు -మోడితో సంజయ్ భట్

సుప్రీం కోర్టు తీర్పులో నరేంద్రమోడీ సంతోషించడానికేమీ లేదని ఓ బహిరంగ లేఖలో పోలీసు అధికారి సంజీవ్ భట్ తేల్చి చెప్పాడు. పైగా ఆ తీర్పుతోనే మోడిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని సంజీవ్ భట్ తన లేఖలో పేర్కొన్నాడు. గోద్రా ఘటనపై ముస్లింలపై మారణ కాండ ప్రారంభమైనప్పుడు ‘దాడులు చేస్తున్న హిందువులను అడ్డుకోవద్దని’ చెప్పడానికి మోడి ఏర్పాటు చేసిన సమావేశానికి తాను కూడా హాజరయ్యానని కొద్ది వారాల క్రితం ప్రకటించి సంజీవ్ భట్ సంచలనం సృష్టించాడు. ఆ…

శాకాహారులారా ఉరితీసుకొండి! పులిగారు శాఖాహారం బోధిస్తున్నారు

“ఒక ప్రఖ్యాత సామెత ఉంది. ‘ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయంచలేదు’ అని. మన దేశానికి నిజమైన బలం తన ఐకమత్యం, సామరస్యంలలోనే ఉంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అన్నది భారత దేశ నిర్వచనం. మన సామాజిక జీవనంలో ఐకమత్యాన్ని బలవత్తరం కావించడం మనపై ఉన్న బాధ్యత. సానుకూల దృక్పధంతో పురోగమించే అద్భుత అవకాశం మనకు చేజిక్కింది. కనుక, మనం ఒక్కటిగా కలిసి గుజరాత్ పరువును ఉద్దీపింపజేద్దాం. ఈ సామాజిక సామరస్యతను, సోదరభావాన్ని బలీయం చేసే బృహత్తర బాధ్యతలో భాగంగా…

ఇండియా టెర్రరిస్టులే ఢిల్లీ పేలుళ్ళ బాధ్యులు కావచ్చు -హోం మంత్రి

ఇండియాలో ఉన్న టెర్రరిస్టులే ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యులు కావచ్చని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నాడు. ” భారతదేశంలో జరిగే టెర్రరిస్టు దాడులకు ఇప్పుడు కేవలం సరిహద్దుల అవతలినుండే జరుగుతున్నాయని ఆరోపించలేము” అని ఆయన అన్నాడు. వార్తా ఛానెళ్ళకు అందిన ఈ మెయిళ్ళ సమాచారాన్ని నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్ళలో చనిపోయినవారి సంఖ్య 13కి చేరుకుందని కూడా ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ…

శవాల కుప్పలపై ‘నాటో’ ప్రజాస్వామ్య స్ధాపన -కార్టూన్

నాటో – ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’, అన్నది మిలట్రీ ఒప్పందం. మిలట్రీ పరంగా ఒకదానికొకటి ముడి వేసుకున్న ఈ కూటమి ప్రజాస్వామ్య స్ధాపన చేస్తానంటూ బయలుదేరడమే ఒక వింత. తన ప్రజాస్వామ్యాన్ని అంగీకరించకపోతే అది జరిపే హత్యాకాండ, ఇతరులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది. – కార్టూనిస్టులు: క్రిటికల్ పాయింట్ (కార్టూనిస్టుల గ్రూపు)

ఇజ్రాయెల్ ఎంబసీపై ఈజిప్షియన్ల దాడి, దేశం విడిచిపోయిన రాయబారి

ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తామే, తాత్కాలికంగానే అయినా, తెంచేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై పెద్ద సంఖ్యలో దాడి చేసిన ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ జెండాను కూలగొట్టి, రాయబార కార్యాలయంలోపలికి జొరబడ్డారు. లోపల ఉన్న ఫర్నిచర్, రికార్డులు అన్నింటినీ ధ్వంసం చేశారు. దానితో ఇజ్రాయెల్ రాయబారి ఈజిప్టు విడిచి కుటుంబంతో సహా స్వదేశం వెళ్ళిపోయాడు. గత నెలలో ఈజిప్టు సరిహద్దు భద్రతా దళాల పోలీసులను ఇజ్రాయెల్ సైనికులు చంపినందుకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటానని…

పాలస్తీనా దేశ ప్రకటనను వీటో చేస్తాం -అమెరికా దుర్మార్గం

అమెరికా తన దుర్నీతిని బహిరంగంగా ప్రకటించుకుంది. తాను నిత్యం వల్లించే మానవ హక్కుల సిద్ధాంతాలూ, ప్రజాస్వామికి సూత్రాలు తాను పాటించేది లేదని మరొకసారి బైటపెట్టుకుంది. అక్రమంగా ఇజ్రాయెల్ దేశాన్ని తెచ్చి అమెరికా, యూరప్ లు పాలస్తీనా ప్రజల నెత్తిన పెట్టిన దగ్గర్నుండీ, తాము కోల్పోయిన తమ స్వంత దేశం కోసం, స్వంత నేల కోసం తపన పడుతున్న పాలస్తీనా ప్రజలను దారుణంగా మోసం చేసింది. చర్చలతో పాలస్తీనా రాజ్యాన్ని స్ధాపించగలమని ఇచ్చిన హామీని దశాబ్దాల తరబడి సాగతీస్తూ…

హమ్మయ్య! సోనియా తిరిగొచ్చింది!

కాంగ్రెస్ నాయకులు సోనియా ఉన్నప్పటి కంటే, ఆమె లేనప్పుడే ఎక్కువగా ఆమె నామ జపం చేస్తారని భారత ప్రజలకు తెలిసొచ్చింది. ఇంకా వెల్లడికాని జబ్బు నయం కావడానికి, శస్త్ర చికిత్స కోసం సోనియా గాంధీ నెల రోజూల క్రితం అమెరికా వెళ్ళింది. సోనియా గానీ, ఆమె కుటుంబం గానీ చెప్పకుండానే తనకు గర్భాశయ కాన్సర్ సోకిందని పత్రికలు నిర్ధారించాయి. ప్రతి పత్రికా ‘సోనియాకు కాన్సర్’ అని మీడియా చెబుతున్నదని రాయడమే గానీ నిర్ధారించినవారెవరూ లేరు. ఎవరికీ చెప్పాపెట్టకుండా…

ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క. కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా. —

అబద్ధపు వార్తలపై కొత్త కౌబాయ్ సవారీ -కార్టూన్

అంకుల్ శామ్ కౌబాయ్ రూపంలో సవారి చేయడానికి ఇప్పుడు గుర్రాలు అవసరం లేదు. గుర్రాల శక్తికి పరిమితి ఉంది. వాటికి తిండి పెట్టాలి. రెస్ట్ కావాలి. కౌబాయ్ కూడా శ్రమ పడాలి. కాని ఆధునిక గుర్రంపై సవారీకి అవేమీ అవసరం లేదు. అది వారానికి ఏడురోజులూ, రోజుకి ఇరవై నాలుగ్గంటలూ అలుపు సొలుపూ లేకుండా పని చేస్తుంది. కౌబాయ్ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా పని చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలకీ ఏక కాలంలో ప్రయాణం చేస్తుంది.…

పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -1

(పాఠకులకు గమనిక: అమెరికానుండి వెలువడే ‘మంత్లీ రివ్యూ’ పత్రికలో మింషి లీ రాసిన ఆంగ్ల రచనకు ఇది యధాతధ అనువాదం. రచయిత 1990-92 కాలంలో చైనాలో రాజకీయ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఉతా, (సాల్ట్ లేక్ సిటి) లో ఎకనమిక్స్ బోధిస్తున్నాడు. మావో కాలంనాటి చైనాలోని సోషలిస్టు వ్యవస్ధ, ఇప్పటి పెట్టుబడిఉదారీ వ్యవస్ధలను తులనాత్మకంగా ఈ వ్యాసం పరిశీలిస్తుంది. సైద్ధాంతిక వ్యాసం అయినందున కొంత కఠినంగా ఉండవచ్చు.) జులై 2009లో జిలిన్‌లోని తొంఘువా…

ఢిల్లీ పేలుళ్ల ఈమెయిల్‌కు కాశ్మీరుతో లింకు, ఇండియన్ ముజాహిదీన్ నుంచి మరో ఈమెయిల్

ఢిల్లీ హైకోర్టు వద్ద బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు తమదే బాధ్యత అంటూ ‘హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ’ సంస్ధ పంపిన ఈ మెయిల్ కాశ్మీరు నుండి వచ్చినదిగా పోలిసులు తేల్చారు. కాశ్మీరులోని కీష్త్వర్ పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ యజమానులైన సోదరులిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. వారు వర్ణించినదాని ప్రకారం కొన్ని కీలకమైన క్లూలను సంపాదించినట్లు కూడా పొలీసులు గురువారం తెలిపారు. జమ్ము నుండి 230 కి.మీ…