ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు
సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది.…
