‘పొదుపు విధానాల’ క్షతగాత్ర ‘యూరప్’ -కార్టూన్
2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అమెరికా, యూరప్ లకు చెందిన బడా కార్పొరేట్ కంపెనీలు అక్కడి ప్రభుత్వాల ద్వారా ప్రజలపైన దారుణమైన పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల ఫలితంగా అనేక యూరప్ దేశాలు క్షత గాత్ర దేశాలుగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము అభివర్ణించుకునే ఈ దేశాల ప్రభుత్వాలు తాము వత్తాసు పలికే పెట్టుబడిదారీ కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు…

