యుద్ధంలో ఇరాన్ చమురు ఆదాయం రెట్టింపు
ఇరాన్ అభివృద్ధిని అణగదొక్కి, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను తిరుగులేని శక్తిగా అవతరింప జేయాలన్న కాంక్షతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఇరాన్ యుద్ధం సత్ఫలితాలను ఇవ్వటం లేదని పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు మొత్తుకుంటున్నాయి. ఇరాన్ అణు విధానంను సాకుగా చూపిస్తూ ఇరాన్ తన చమురు అమ్ముకోనివ్వకుండా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు 45 యేళ్లుగా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ప్రపంచ అణు పెత్తనం కోసం అమెరికా, ఐరోపా లు ఏర్పాటు చేసిన అంతరాతీయ అణు ఇంధన…
