జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…

ఎమర్జింగ్ దేశాలు ఆంటే అర్ధం ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల వర్గీకరణలో “ఎమర్జింగ్ దేశాలు” అనే కొత్త పదం ఒకటి వచ్చి చేరింది. ఈ పదం చేరక ముందు మూడు రకాల వర్గీకరణ మాత్రమే ఉండేది. అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలను మొదటి ప్రపంచం అని పిలుస్తున్నాము. గతంలో రష్యా, అమెరికాలు రెండు అగ్ర రాజ్యాలు కనుక ఆ రెండు మొదటి ప్రపంచం అన్నారు. ఆ తర్వాత రష్యా పతనం కావటంతో అమెరికా ఒక్కటే మొదటి ప్రపంచంగా ఉంటూ వచ్చింది.…

ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్రెజిల్ పొదుపు ప్రయత్నాలు

  ద్రవ్యోల్బణం అదుపు, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్) పేరుతో ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోతలు విధించడానికి బ్రెజిల్ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లు కనిపిస్టోంది. పెరిగి పోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి 50 బిలియన్ల రియళ్ళ (రియల్ అనేది బ్రెజిల్ కరెన్సీ) మేరకు ఖర్చులు తగ్గిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పొదుపు మొత్తం  30 బిలియన్ డాలర్లకు సమానం.   ఆర్ధిక సంక్షోభం పుణ్యాన అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనా, బ్రెజిల్,…

11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు

  బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ…

శతృవుల పుకార్లతో మా కంపెనీల షేర్లు పడిపోతున్నాయ్ -అనీల్ అంబానీ

మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.   కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు, ద్రవ్యోల్బణం సాకుతో రిటైల్ రంగం ప్రైవైటీకరణ

శుక్రవారం షేర్ మార్కెట్ బారీగా నష్తపోయింది. బోంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) 441 పాయింట్లు కోల్పోయి 18008 వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్.ఎస్.ఇ లేదా నిఫ్టీ) 131 పాయింట్లు కోల్పోయి 5395 దగ్గర క్లోసయ్యింది. ఈజిప్టు ప్రజాందోళనలతో ఆయిలు ధర కొండెక్కడం ఖాయం అన్న ఆందోళన పెరగడం, దానివలన నిత్యావసరాల ధరలు కూడా పేరిగి పోతాయన్న భయాలతో దేశీయ మదుపరులు స్టాక్ మార్కెట్ జోలికే రాక పోవటం, ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకొవటం…