జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24 pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…