లిబియా – ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు పశ్చిమ దేశాల దాడులు
లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త…