సివిల్స్ డైరెక్టివ్ ‘డిస్కస్’ గురించి… -ఈనాడు

సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ (డైరెక్టివ్) గురించి ఈనాడు చదువు పేజీలో చర్చిస్తున్నాము. ఈ వారం భాగంలో ‘డిస్కస్’ అనే డైరెక్టివ్ గురించి రాశాను.  గత సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నను ఉదాహరణగా తీసుకుని చర్చించాను. తెలుగు పత్రికల్లో పెద్దగా చర్చకు రాని షేల్ గ్యాస్ గురించిన ప్రశ్నను తీసుకుని సమాధానం ఎలా రాయవచ్చో వివరించాను. ఈనాడు వెబ్ సైట్ లో ఈ వారం భాగాన్ని చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయగలరు. వివరంగా……

ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….

పొన్నం శ్రీనివాస్: పాలస్తీనా సమస్య ఉగ్రవాద సమస్యే తప్పా… జాతుల అంతం లాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావం ఎలా జరిగింది. అక్కడున్న వాళ్లంత ఎక్కడికి వలస వెళ్లారు. మళ్లి వాళ్ల స్వస్థలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా… సమాధానం: శ్రీనివాస్ గారూ, ఇదే తరహా ప్రశ్నను గతంలో మరో మిత్రుడు అడిగారు. సమాధానం ఇచ్చాను. సమాధానంతో పాటు పాలస్తీనా సమస్యపై రాసిన కొన్ని ఆర్టికల్స్ కు లింక్ లు…

చందమామ అందిన ఆ రోజులు… -ఫోటోలు

పాటల్లో పాడుకోవడమే తప్ప నిజంగా చందమామను అందుకోగలమని మనిషి అప్పటివరకూ ఊహించలేదు. ‘చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు’ అన్న పాట అమెరికన్లు చంద్రుడి మీద కాలు పెట్టకముందు వెలువడిందో తరవాత వెలువడిందో తెలియదు. ఒకవేళ ముందే ఈ పాట రాసి ఉన్నట్లయితే ‘మనవాళ్లు ముందే చెప్పారు’ అని గర్వంగా చెప్పుకోవచ్చునేమో! పసి పిల్లల్ని మాయపుచ్చి జోకొట్టడానికి అద్దం చూపి చంద్రుడిని కిందికి దింపిన తల్లులు మనిషే ఎగిరి వెళ్ళి చంద్రుడిని అందుకున్నాడని తెలిసి ఎలా…

పాక్ ఉల్లంఘన కూడా చర్చిస్తార్ట!

త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని…

రైతు నెత్తిన పిడుగు -కత్తిరింపు

దళారులకు, మిల్లర్లకు లాభం చేకూర్చుతూ కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గిట్టుబాటు ధరలకోసం ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను ఆలకించడం మాని వారి డిమాండ్ కు సరిగ్గా వ్యతిరేక నిర్ణయాన్ని చేసి రాష్ట్రాలకు సమాచారం పంపింది. గిట్టుబాటు ధరకు బదులుగా బోనస్ చెల్లిస్తున్న రాష్ట్రాలు అలా చెల్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే పేరుతో ఈ నిర్ణయాన్ని చేసింది. “మతిమాలిన పాపులిస్టు విధానాలను ఒప్పుకోము” అని…

కురువృద్ధ కాంగ్రెస్ ను తీరానికి చేర్చేదిలాగేనా! -కార్టూన్

వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని…

MH17: మీడియా చెప్పనిదేమిటి? -అమెరికా హౌస్ సభ్యుడు రాన్ పాల్

(రాన్ పాల్ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ – మన లోక్ సభకు సమానం)లో 2013 వరకు సభ్యుడు. అమెరికా అధ్యక్ష పదవికి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో రెండు సార్లు అధ్యక్ష పదవికోసం పోటీ పడ్డారు. అమెరికా రహస్య గూడచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అరాచకాలను బైటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాను రాన్ పాల్ కే ఓటు వేశానని బహిరంగంగా చెప్పాడు. అమెరికా బహుళజాతి కంపెనీలకు రాన్ పాల్…

ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు

మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…

శివసేన పులి స్వారీ -కార్టూన్

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఒక ముస్లిం ఉద్యోగి చేత శివసేన ఎం.పిలు బలవంతంగా చపాతీ తినిపించిన సంఘటన చుట్టూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు చర్చను నడుపుతున్నాయి. సదరు చర్చకు పత్రికలు యధా శక్తి సహకరిస్తున్నాయి. ముంబై లోని మహా రాష్ట్ర సదన్ లో వడ్డిస్తున్న భోజనం క్వాలిటీ నాసిరకంగా ఉందని శివసేన ఎం.పి లు చెప్పదలిచారట. ప్రజా ప్రతినిధుల స్ధానంలో ఉన్నవారికి ఆ విషయాన్ని చెప్పడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. నాగరిక సమాజంలో…

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య –వీడియో వివరణ

ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడిలో గాజా రక్తం ఓడడం కొనసాగుతోంది. అంతర్జాతీయ చీత్కరింపులను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ట్యాంకులు, గన్ బోట్లు జనావాసాలపై బాంబులు కురిపిస్తూ పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. ఇజ్రాయెల్ ఒక పక్క మానవ హననం సాగిస్తుంటే మరో పక్క అమెరికా, ఐరోపా, ఐరాసలు బూటకపు శాంతి ఉద్భోదలతో పొద్దు పుచ్చుతున్నారు. పాలస్తీనా (దురాక్రమణ) సమస్య ను క్లుప్తంగా వివరించడానికి ఈ వీడియోలో ప్రయత్నం జరిగింది. నా పి.సికి సౌండ్ డివైజ్ పని…

పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

దాగలేని నిజం: వార్ జోన్ మీదికి విమానాన్ని ఎందుకు మళ్లించారు?

ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతంలో కూల్చివేసిన మలేషియా విమానం MH17, తన రోజు వారీ రూట్ లో కాకుండా జులై 17 తేదీన కాస్త ఉత్తర దిశకు జరిగి ప్రయాణం చేసింది. రోజువారీ రూట్ లో ప్రయాణం చేసి ఉన్నట్లయితే MH17 అసలు తిరుగుబాటు ప్రాంతం దోనెత్స్క్ ప్రాంతం మీదకు వెళ్ళి ఉండేదే కాదు. కూలిపోయిన రోజున యధాప్రకారం ఆంస్టర్ డాం నుండి ఆగ్నేయ దిక్కులో నేరుగా ప్రయాణించకుండా కాస్త పైకి దిశ మార్చుకుని ప్రయాణించింది. ఆ రోజు…

మేము ఈల వేస్తే…. -కార్టూన్

అదేదో సినిమాలో తాను ఈల వేస్తే గోల్కండ కోట ఎగిరి పడుద్ది అని పాడతాడు. ఆయన సంగతేమో గానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అది కూడా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పెద్దల అవినీతి, అవకతవకల గురించి ఈల వేయడం మొదలు పెడితే జనానికి తెలియని చాలా అఘాయిత్యాలు బైటికి వస్తాయి. ఒక సంస్ధలో పని చేస్తూ, ఆ సంస్ధలో జరిగే అక్రమాలను బైటికి, రహస్యంగా గానీ బహిరంగంగా గానీ, చెబితే దానిని ఆంగ్లంలో విజిల్ బ్లోయింగ్…

2013లో రేపిస్టుల్లో 95 శాతం బాధితులకు తెలిసినవారే

ప్రతి 100 మంది రేపిస్టుల్లో 95 మంది బాధితులకు తెలిసినవారేనని జాతీయ నేర నమోదు సంస్ధ (National Crime Record Bureau -NCRB) తెలిపింది. ‘2013లో భారత దేశంలో నేరాలు’ పేరుతో ఎన్‌సి‌ఆర్‌బి నివేదికను విడుదల చేసింది. నివేదికలో మహిళలపై నేరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను పొందుపరిచింది. నివేదిక ప్రకారం అత్యాచార నేరాలకు సంబంధించి ఐ.పి.సి సెక్షన్ 376 కింద 2013 సంవత్సరంలో దేశవ్యాపితంగా 33,707 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 31,807 కేసుల్లో నిందితులందరూ బాధితులకు…

డి.ఎం.కె కోసం అవినీతి జడ్జిని యు.పి.ఏ పొడిగించింది -కట్జు

యు.పి.ఏ హయాంలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితుడయిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు కేంద్ర ప్రభుత్వం మార్పుతో కొత్త ప్రభుత్వాన్ని కాకా పట్టే పనిలో పడ్డారా? ఎప్పుడో పదేళ్ళ నాటి జడ్జి నియామకపు అవకతవకల్ని ఆయన ఇప్పుడు తవ్వి తీస్తుండడంతో ఈ అనుమానం కలుగుతోంది. డి.ఎం.కె ఒత్తిడికి లొంగిన యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి జడ్జికి మూడుసార్లు పొడిగింపు ఇచ్చిందని కట్జు తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా తాజా తమిళనాడు ముఖ్యమంత్రి ఏనాడూ కోర్టు…