బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్
తెలంగాణలో మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అందరూ నిర్ధారించారు. అది వాస్తవం కాదని కండిషన్ లో లేని బస్సును పక్కనబెట్టకుండా తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్కూలు పిల్లలను ఉటంకిస్తూ ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలిసినా డ్రైవర్ పైకి తప్పు నెట్టేసి స్కూలు యాజమాన్యాన్ని కాపాడుతున్నారని తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, రైలు వస్తున్న సంగతి…