2014 లో జాతీయ అంతర్జాతీయ వార్తా విశ్లేషణ -సమీక్ష

ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కు సంబంధించి 2014 సంవత్సర కాల సమీక్ష తయారు చేసి అందించారు. వర్డ్ ప్రెస్ లో బ్లాగింగ్ చేసేవాళ్లందరికి ఈ సౌకర్యం ఉంటుంది. బ్లాగ్ మిత్రులు, పాఠకుల కోసం సమీక్షను ప్రచురిస్తున్నాను. సమీక్షను పూర్తిగా ప్రచురించే సౌకర్యాన్ని వాళ్ళు ఇవ్వలేదు. కేవలం లింక్ మాత్రమే ఇచ్చారు. కింది భాగం అంతా వారు అందుబాటులో ఉంచిన లింక్ ని క్లిక్ చేయగా ఆటోమేటిక్ గా పబ్లిష్…

గగనతలంలో మరో ట్రాజెడీ -ది హిందు ఎడిటోరియల్

(True translation of the editorial published today i.e 31.12.2014 in The Hindu. -Visekhar) ********* ఇండోనేషియాలోని సురబయ నుండి సింగపూర్ కు వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం కనపడకుండా పోయి రెండు రోజులు పూర్తయ్యాక రక్షణ బృందాలు విమానంలో ఉన్న 162 మంది ప్రయాణీకులు మరియు సిబ్బందిలో కనీసం 40 మంది మృత దేహాలను విమాన శిధిలాలను కనుగొన్నారు. ఫలితంగా, రాడార్ తెరపై నుండి విమానం అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయిన దరిమిలా విమానం…

సముద్రంలోనే కూలింది, 6 మృత దేహాలు లభ్యం -ఫోటోలు

అనుకున్నట్లుగానే ఎయిర్ ఆసియా విమానం QZ 8501 విమానం జావా సముద్రంలోనే కూలిపోయిందని నిర్ధారణ అయింది. జావా సముద్రం లోని బోర్నియో ద్వీపానికి సమీపంలో విమానానికి సంబంధించిన అనేక శిధిలాలు కనపడడంతో ప్రమాదం నిర్ధారించబడింది. ప్రయాణీకులకు చెందిన 6 మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు. అనేకమంది ప్రయాణీకుల మృత దేహాలు ఇంకా విమానంలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. 40 మృత దేహాలను వెలికి తీశామని మొదట ఇండోనేషియా నౌకా బలగం ప్రకటించింది. అయితే అనంతరం…

షొరాబుద్దీన్ ఎన్ కౌంటర్: ఓ పనైపోయింది!

‘గజం మిధ్య పలాయనం మిధ్య’ అని ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి.బి.ఐ కోర్టు తీర్పు చెప్పేసింది. కేసులో అన్యాయంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలని అమిత్ షా విన్నవించుకోగా ‘సరే, కానీండి!’ అని రాసేసింది. దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్ కేసు చివరికి దూదిపింజలా తేలిపోయింది. ఎన్ కౌంటర్ సంగతి తర్వాత, అసలు షొరాబుద్దీన్ అన్న గ్యాంగ్ స్టర్ ఉన్నాడా లేదా అని రేపు కోర్టులు విచారణ మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదేమో! షొరాబుద్దీన్,…

మోడి చాతుర్యం: దొడ్డిదారిన భీమా బిల్లు -కార్టూన్

అరుణ్ జైట్లీ: “ఇన్సూరెన్స్ పాలసీలోని ఫైన్ ప్రింట్ కి అనుగుణంగానే అది ఉంది” ********* బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా భీమా రంగంలో ఎఫ్.డి.ఐ ల వాటా పెంపుదల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నిండా లాభాలు పండిస్తున్న భీమా రంగాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అంటూ జాతీయవాద ఫోజులు పెట్టి ప్రశ్నించింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా దేశాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారు అని ఆగ్రహించింది. మేము అధికారంలోకి వచ్చాక బిల్లును చెత్త బుట్టలో వేస్తామని జనానికి హామీ ఇచ్చింది.…

చైనాలో జీమెయిల్ బంద్!

అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు…

చెల్లింపుల సమతూకం (BoP) అంటే… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ లో చెల్లింపుల సమతూకం (Balance of Payments) ఒక ముఖ్యమైన అంశం. ఒక దేశం తన అవసరాల రీత్యా (ఉదా: దిగుమతులు) విదేశాలకు చెల్లింపులు చేయగల స్ధితిలో ఉన్నదా లేదా అన్నది ఆ దేశ BoP తెలియజేస్తుంది. పేరులో ఉన్నట్లు BoP అంటే చెల్లింపులు చేయడం కాదు. అది ఒక ఆర్థిక ప్రకటన. ఒక కంపెనీ ఆర్ధిక పరిస్ధితిని ఆ కంపెనీ యేటా ప్రకటించే బ్యాలన్స్ షీట్ తెలియజేసినట్లే ఒక…

162 మందితో మరో మలేసియా విమానం అదృశ్యం -ఫోటోలు

మళ్ళీ మరో విమానం! కూలి పోవడం కాదు, అదృశ్యం అయిపోయింది. మలేషియా విమాన కంపెనీ ఎయిర్ ఆసియా విమానం ఇండోనేషియా లోని రెండో అతి పెద్ద నగరం సురబాయా నుండి సింగపూర్ వెళ్తూ మార్గ మధ్యంలో జావా సముద్రంపై ఉండగా అదృశ్యం అయిపోయింది. ఎదురుగా ఉన్న మేఘాలను తప్పించేందుకు ఎడమ పక్కకు తిరిగి కాస్త పైకి వెళ్తామని పైలట్ అనుమతి కోరాడని, ఇంతలోనే విమానం రాడార్ నుండి అదృశ్యం అయిందని ఇండోనేసియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పారు.…

నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు…

ఐరోపా మంచు తుఫాను: పైన్ చెట్లా? హిమ శిల్పాలా? -ఫోటోలు

ప్రాకృతిక వింతలను రికార్డు చేయడం మొదలు పెట్టాలే గానీ దానికిక అంతూ పొంతూ అంటూ ఉండదు. అదొక మహా యజ్ఞం అనడం సబబుగా ఉంటుంది. కాదంటే రెండు రోజుల పాటు కురిసిన మంచు తుఫాను తూర్పు యూరప్ దేశాలలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిపై విస్తరించిన అటవీ వృక్షాలను, ఇతర నిర్మాణాలను హిమనీ శిల్పాలుగా మార్చివేయడం గురించి ఎలా చెప్పగలం? ఐరోపాలోని పలు దేశాలను తీవ్ర వాతావరణ పరిస్ధితులు చుట్టు ముట్టాయి. ఎముకలు కొరికేసే చలి వాతావరణం జనజీవనాన్ని…

చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?

భారత దేశంలో అతి పొడవైన మార్గంలో బులెట్ ట్రైన్ రైలు, ట్రాక్ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ జపాన్ ఇస్తున్న పోటీ వల్ల చైనా ఇవ్వజూపుతున్న సహాయం వెనక్కి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ చొరబడడంతో మెక్సికోలో బిడ్డింగ్ పూర్తయిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు సైతం చైనా చేజారడంతో ఇండియాలోనూ అదే జరగవచ్చని చైనా అనుమానిస్తోంది. ఇండియా మాత్రం అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకుని చైనా అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇండియాకు చెందిన ‘హై స్పీడ్ రైల్…

వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

ప్రభుత్వమే ఖర్చు పెంచాలి -ఆర్ధిక సలహాదారు

మోడి ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు పెట్టుబడులు ఎంతకీ ముందుకు రావడం లేదు. ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదం కాస్తా హుళక్కి అయిపోయింది. బి.జె.పి/మోడి రాక వల్లనే మొదటి త్రైమాసికంలో జి.డి.పి 5.7 శాతం వృద్ధి చెందిందని తమ జబ్బలు తామే చరుచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మెల్లిగా ‘అబ్బే, ప్రభుత్వమే ఖర్చు పెంచక తప్పదు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ అంటూ ప్రభుత్వ ఖర్చును తగ్గించి తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలని ప్రబోధించిన…

అస్సాం మారణకాండ -ది హిందు ఎడిటోరియల్

(ది హిందు, 25.12.2014 నాటి Carnage in Assam ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు…

అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర…