ఇజ్రాయెల్ లో యధాతధస్ధితి -ది హిందు ఎడిట్..
[Status quo in Israel శీర్షికన ఈ రోజు -20/03/2015- ప్రచురించబడిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] 2015 ఇజ్రాయెలీ చట్టసభ ఎన్నికల్లో మొత్తం 120 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకున్న లికుడ్ పార్టీ ప్రధమ స్ధానంలో నిలవడం, దరిమిలా బెంజమిన్ “బీబీ” నెతన్యాహు ప్రధాన మంత్రిగా తిరిగి ఎన్నిక కావడం ఒకింత ఆశ్చర్యకరం. లేబర్ పార్టీతో సహా వివిధ సెంట్రిస్టు-మోడరేట్ పార్టీల కూటమి జియోనిస్టు యూనియన్ కు మెరుగైన ఫలితాలు లభిస్తాయని ఎగ్జిట్…