చట్టాల అమలులో హింసా ప్రయోగం -ది హిందు ఎడిట్..

[Violence in law enforcement శీర్షికన ఈ రోజు (ఏప్రిల్ 8) ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ఆంద్ర ప్రదేశ్ కు చెందిన యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది చెక్కకోత పనివాళ్లను -ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తూ- చంపివేయడం వల్ల పోలీసుల జవాబుదారీతనం పట్లా, అసమతుల్య బలప్రయోగం పట్లా వ్యాకులపూరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్కకోత పనివాళ్లను లొంగి పొమ్మని టాస్క్ ఫోర్స్ బలగాలు…

ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్

“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…

క్లుప్తంగా… 8/4/15

గుజరాత్ లో ముస్లిం తరిమివేత హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్…

కొత్త ధీమ్ సెట్ చేశాను!

‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ లేదా తెలుగువార్తలు వెబ్ సైట్ కు కొత్త ధీమ్ సెట్ చేశాను. దాని పేరు బ్రాడ్ షీట్. ఇది ప్రీమియం ధీమ్. అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు మంచి డిజైన్ లు తయారు చేసి అమ్మకానికి పెడతారు. వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి డబ్బు! నేనేమీ డబ్బు త్యాగం చేసేయలేదు. నా వెబ్ సైట్ లో వర్డ్ ప్రెస్ వాళ్ళ యాడ్ లు కనిపిస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన ఆదాయంలో కొంత…

పొగాకు లాబీకి లొంగి కేంద్ర మంత్రి తొలగింపు?

విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం. లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని…

చవకబారు వాగుడు -ది హిందు ఎడిటోరియల్

[బి.జె.పి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల నేతలు తమ చవకబారు భావజాలాన్ని నిస్సిగ్గుగా ఆరబెట్టుకోవడం కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళకు బదులు నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే ఆమెను నాయకురాలిగా కాంగ్రెస్ నేతలు అంగీకరించి ఉండేవారా అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించగా, ఆందోళనలో ఉన్న నర్సులు తమ ఆందోళనను విరమించకపోతే వారి చర్మం నల్లబడి మంచి భర్తల్ని వెతుక్కోవడం కష్టమై పోతుందని గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొన్నటివరకు ఇలాంటి…

ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?

సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి గారే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. లేదా ఎదుర్కొన్నానని మంత్రి గారు లోకానికి చాటారు. అదేమీ లేదని ఫాబ్ ఇండియా వారు వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణ విస్తృత వ్యాప్తిలో ఉన్న ఒక అసహ్యకరమైన వ్యాధిని వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యాధి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ అదేమీ ఎరగనట్లు నటించడమే వ్యాధి విస్తరణకు ప్రధాన పోషకురాలు. ఈ రీత్యా స్మృతి ఇరానీ చిన్నపాటి సాహసం చేశారని చెప్పవచ్చు.…

ఎన్నికల విజయం, రాజకీయ ఓటమి -ది హిందు ఎడిట్..

[‘Electoral victory, political defeat’ శీర్షికన ఈ రోజు ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. ఈ మధ్య కాలంలో ది హిందు నుండి అరుదుగా మారిన సంపాదకీయ రచనల్లో ఇది ఒకటి. -విశేఖర్] మెరుగైన ప్రజాస్వామిక మరియు పారదర్శక పాలన అందించే లక్ష్యమే తన ఉనికికి కారణంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత నాయకత్వ స్ధాయిలో ఎదురవుతున్న కష్టాలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు పార్టీ జాతీయ కన్వీనర్…

జంతువులకూ తెలుసు…! -వీడియో

జీవజాలంలో అన్నింటికంటే అభివృద్ధి చెందిన జీవి మనిషి. సృష్టిలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన పదార్ధం అయిన మెదడు మనిషి సొంతం. అందుకే మనిషి ఆ అభివృద్ధి సాధించగలిగాడు. బోరింగ్ పంపు, చేతితో తిప్పే ట్యాపు, బర్రెల్ని మందలు మందలుగా కట్టివేసే ఇనప కొక్కేలు… ఇవన్నీ మనిషి ఇటీవల తయారు చేసుకున్నవి. ఇటీవల అంటే పదుల సంవత్సరాలని కాదు. వందల సంవత్సరాలని ఇక్కడ అర్ధం. మానవ పరిణామం పదుల వేల యేళ్ళ తరబడి జరిగింది కనుక ‘ఇటీవల’ అన్న…

స్విస్ దొంగనోట్లు: యూరో, డాలర్ తర్వాత స్ధానం రూపాయిదే

రూపాయిల నల్ల డబ్బు మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా రహస్యంగా నల్ల డబ్బు దాచుకునే బడా బాబులకు స్విట్జర్లాండ్ స్వర్గధామం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి స్విట్జర్లాండ్ లో కూడా రూపాయి తన ‘నల్ల ప్రతాపాన్ని చాటుకుంటోంది. ఆ దేశంలో చెలామణిలో ఉన్న విదేశీ మారక ద్రవ్యంలో నల్ల డబ్బు కూడా ఒక పాత్ర పోషిస్తోంది. స్విట్జర్లాండ్ కు విదేశీ మారక ద్రవ్యంగా ఉండే వివిధ విదేశీ కరెన్సీలలో యూరో డాలర్ల తర్వాత…

చలి మంచు క్రీడల ఆనందమే వేరు! -ఫోటోలు

పెద్దగా శ్రమ పదకుండా చెక్క (లేదా ప్లాస్టిక్) పలకలపై నిలబడి వందల మీటర్ల దూరం జారుతూ పోవడాన్ని ఎవరు ఇష్టపడరు గనక? మంచు కప్పేసిన ఏటవాలు కొండ తలాలపై ప్రమాదకరంగా స్కీయింగ్ చేయడం పశ్చిమ దేశాల్లో మామూలు విషయం అనుకుంటా. చలికాలం తెచ్చి పడేసిన మంచు ప్రజా జీవనానికి ఒక కోణంలో ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రతి యేడూ మంచు కురవడం సాధారణ వాస్తవం అయినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించే ఆటలు పుట్టుకోస్తాయి కాబోలు!  స్కీయింగ్, ఐస్ హాకీ…

ద్రవ్యోల్బణం మళ్ళీ పెరగక తప్పదా?

కారణం ఏదైతేనేం గత కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతూ వచ్చింది. కృత్రిమంగా తగ్గించారా లేక అదే తగ్గిందా అన్నది బ్రహ్మ రహస్యం. ఆర్ధిక మంత్రి మాటలను బట్టి చూస్తే ద్రవ్యోల్బణం మళ్ళీ పెరగక తప్పదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. ఆర్.బి.ఐ రెండేళ్లకు పైగా వడ్డీ రేట్లు తగ్గించకుండా కొనసాగించింది. అందుకు కారణం మొండిగా తగ్గుదల లేకుండా కొనసాగిన ద్రవ్యోల్బణం దాదాపు సంవత్సరం క్రితం ఇండియా ద్రవ్యోల్బణం 8.5 శాతం పైనే ఉంది. ఆరు నెలల…

అల్లరి మూకల్ని మోస్తూ అభివృద్ధి ఎలా సాధ్యం? -కార్టూన్

“అబ్బే అలాంటిదేమీ లేదు- డెలివరీ ఇవ్వాల్సిన చిన్న పార్సిల్, అంతే…” హిందూత్వ బ్రిగేడ్ లో ఫ్రింజ్ గ్రూపులది ప్రత్యేక స్ధానం. సదరు గ్రూపులు మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టి ప్రజల్లో విభేదాలు సృష్టిస్తే ఆ విభేదాలు ఆసరాగా గంభీర వదనాలతో ఓట్లు నంజుకు తినడం బి.జె.పి నేతల పని. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి గుజరాత్ హత్యాకాండ మీదుగా ముజఫర్ నగర్ అల్లర్ల వరకు జరిగింది ఇదే. అయితే కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిస్ధితిలో కొద్దిగా…

ఎగరలేని మోడి విమానం -కార్టూన్

ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి పార్లమెంటు విమానం. ఈ విమానానికి ఒక రెక్క లోక్ సభ అయితే మరొక రెక్క రాజ్య సభ. ఇరు సభల్లో కూర్చొని ఉన్న సభ్యుల సంఖ్య ఆ రెక్కల కింద ఉండే ఇంజన్లు. మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి లోక్ సభలో నిఖార్సయిన మెజారిటీయే ఉంది. కానీ రాజ్య సభలో ఆ పార్టీకి మెజారిటీ లేదు. అనగా మోడి విమానానికి ఒక రెక్కకు ఒకటే ఇంజన్ ఉంటే మరో రెక్కకు ఏకంగా…