భారత్ ఆయుధాలు ఉక్రెయిన్ లో ప్రత్యక్షం, రష్యా అసంతృప్తి!

155mm Shells భారత దేశ ప్రభుత్వ ఆయుధ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలను ఉక్రెయిన్, రష్యాపై యుద్ధంలో ప్రయోగిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడి చేసింది. భారత ప్రభుత్వ కంపెనీల తయారీ ఆయుధాలు తమపై ప్రయోగించేందుకు ఇండియా అనుమతి ఇవ్వడం పట్ల రష్యా ఇప్పటికే రెండు సార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఇండియా నేరుగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం లేదు. వివిధ ట్యాంకులు, మర ఫిరంగులు ఉపయోగించే మందుగుండు సామాగ్రిని ఇండియా…

డాలర్ కి వేగంగా తూట్లు పొడుస్తున్న చైనా!

మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది. చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు…

ఆర్ జి కార్ డాక్టర్ల ఆందోళనకు పరిష్కారం ఎప్పుడు?

అటు సుప్రీం కోర్టు, ఇటు కోల్ కతా ప్రభుత్వం, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రి లో అత్యాచారం, హత్య కు గురైన బాధిత మెడికో కు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, దేశ వ్యాపితంగా ఆందోళన చేస్తున్న…

సాక్షాలు నాశనం చేశారు: కోల్కతా సీనియర్ డాక్టర్లు

ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెపెంబర్ 16 తేదీన, సోమవారం మరోసారి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు ఈ రోజు (16 సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా గం 6:30 ని.లకు ప్రారంభం అయినట్లు తెలుస్తున్నది. కాగా అత్యాచారం…

పుటిన్ హెచ్చరిక, బైడెన్ వెనకడుగు!

Joe Biden with Kier Starmer రష్యా లోలోపలి నగరాల పైన, వివిధ టార్గెట్ ల పైన పశ్చిమ దేశాలు సరఫరా చేసే లాంగ్-రేంజ్ మిసైళ్లతో దాడి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అనేక రోజులుగా అమెరికా, యుకె, ఇయు లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. బ్రిటన్ సరఫరా చేసే స్టార్మ్ షాడో మిసైళ్ళు, అమెరికా సరఫరా చేసే ఎం‌జి‌ఎం-140 ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ATACMS) మిసైళ్ళు లాంగ్ రేంజ్ మిసైళ్ళ…

కేజ్రీవాల్ కి బెయిల్

ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా…

స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…

అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

సిజెఐ ఇంట్లో గణపతి పూజ: మోడీకి ఆహ్వానం!?

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, భారీ రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తన ఇంట్లో గణపతి పూజ జరిపిన చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిని తన ఇంట్లో జరుగుతున్న పూజకు ఆహ్వానించారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు కారణం అయింది. అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్, రాజ్యాంగం నిర్దేశించిన “అధికారాల సమాన విభజన” (Separation of…

ఓటమి దిశలో ఉక్రెయిన్!

Mariupol city destroyed in war ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఉక్రెయిన్ ఓటమితో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికుల పోరాట పటిమ గురించీ, రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సైన్యం చెమటలు పట్టించడం గురించీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పడంలో ఇన్నాళ్లూ మునిగి ఉన్న పశ్చిమ కార్పొరేట్ పత్రికలు మెల్లగా ఉక్రెయిన్ సైన్యం వెనక పట్టు పట్టడం గురించి వార్తలు ప్రచురిస్తున్నాయి. దానితో ఉక్రెయిన్ ఓటమి దగ్గర పడుతోందన్నదే నిజమైన వార్తగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు…

విజయవాడ మునక ఎలా జరిగింది?

కలెక్టర్ సృజన గారు బిబిసి తెలుగు చానెల్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడ లో 64 వార్డులు ఉంటే అందులో 32 వార్డులు వరద నీటిలో మునిగిపోయాయి. విజయవాడ మునకకు ఆమె మూడు కారణాలు చెప్పారు. ఒకటి: బుడమేరు వాగు పైన వెలగలేరు వద్ద లాకులు ఎత్తివేయవలసి రావటం, రెండు: ఎన్నడూ లేని విధంగా 26 సె. మీ వర్షపాతం విజయవాడలో కురవటం మూడు: కృష్ణా నది పైన 12 మీటర్ల కంటే ఎత్తున నీటి…

అమెరికా ఎన్నికల్ని రష్యా, చైనా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయిట!

“ఆడలేక మద్దెల ఓడు” అన్నాట్ట వెనకటికొకడు! ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన ప్రాజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మాది అని ఒకటే ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి దేశాలపై దుర్మార్గమైన దాడులు చేసి ఆ దేశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు తగుదునమ్మా అంటూ “మా దేశ ఎన్నికలని ప్రభావితం చేస్తున్నాయ్ బాబోయ్” అంటూ తెగ ఏడ్చి చస్తోంది! “అయినా…, మన బంగారం మంచిది కానప్పుడు…”…

నేను ఛండాలుడ్ని ఎట్లా అయ్యాను?

ఈ వీడియో నాకు వాట్సప్ మేసెజ్ గా వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం అని వీడియో చివర తనే చెప్పారు. ఆయన తాను రాసిన కవితను ఈ వీడియోలో చదివి వినిపించారు. కవిత అద్భుతంగా ఉన్నది. సహజంగానే కవిత నచ్చని వారు ఉండవచ్చు. వారికి నా వైపు నుండి ఒక విజ్ఞప్తి ఏమిటంటే కవిత ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ఆఫ్ కోర్స్, కామెంట్ ద్వారా నన్ను కూడా ప్రశ్నించవచ్చు.) సత్యం గారు…

అమెరికా దాష్టీకం: వెనిజులా అధ్యక్ష విమానం సీజ్!

Venezuelan Aircraft Seized and Stationed in Florida అమెరికా బలహీన పడే కొద్దీ దాని చర్యలు పామరులకు కూడా అర్ధం అయేంతగా హద్దు మీరుతున్నాయి. అంతర్జాతీయ సూత్రాల ఆధారిత వ్యవస్థ (International Rules Based Order) అంటూ పదే పదే సొల్లు కబుర్లు చెబుతూనే ఏ సూత్రానికీ, నిబంధనకూ తన దుష్ట ప్రవర్తన కట్టుబడి ఉండదని చాటి చెబుతున్నది. తాజాగా వెనిజులా దేశాధ్యక్షుడి విమానాన్ని సీజ్ చేయటమే కాకుండా “ఆకుకు అందని పోకకు పొందని” కబుర్లతో…

టర్కీలో అమెరికా సైనికులపై యువకుల దాడి!

The US’ marines attacked in Izmir, Turkey నాటో సభ్య దేశం అయిన టర్కీలో అమెరికా సైనికులకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్మీర్ పట్టణ వీధుల్లో సంచరిస్తున్న అమెరికన్ మెరైన్ సైనికులపై టర్కిష్ యువకుల బృందం దాడి చేశారు. ఒక సైనికుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ వాస్ప్, ఇటీవల వరకు ఇజ్రాయెల్ తీరాన మోహరించింది. సదరు నౌక టర్కీ రేవు ఇజ్మీర్…