రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే…

మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు

జపాన్ దక్షిణ ద్వీప రాష్ట్రం ఒకినావాలో అమెరికా సైనికులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో అమెరికా సైనిక స్ధావరం సమీపంలో వాకింగ్ కి వెళ్ళిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ మహిళను గొంతు పిసికి చంపేశారు. మే 26-27 తేదీలలో టోక్యోలో G7 దేశాల సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా జపాన్ ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. ఒకినావా రాష్ట్రంలోను ఫుటెన్మా సైనిక స్ధావరాన్ని పూర్తిగా…

కోల్డ్ వార్ 2.0: కజకిస్తాన్ లో ప్రేరేపిత ఆందోళనలు

కోల్డ్ వార్ వర్షన్ 2.0 లో కజకిస్తాన్ ఒక భాగం అయింది. రష్యా పొరుగు దేశం కజకిస్తాన్ లో సో-కాల్డ్ ప్రజాందోళనలు చెలరేగడంతో రష్యా వ్యతిరేక కోల్డ్ వార్ లో మరో ఫ్రంట్ ను అమెరికా తెరిచినట్లయింది. సిరియాను అస్తవ్యస్తం కావించి రష్యాను సిరియా యుద్ధంలో కూరుకుపోయేలా చేయడానికి శత విధాలుగా ప్రయత్నించి విఫలం అయిన అమెరికా మరో దుస్సాహసానికి ఒడిగడుతోంది. మే 21 తేదీన కజకిస్తాన్ లో వివిధ నగరాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలలో…

గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్

నాటో అంటే తెలిసిందేగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్! దీనికి అమెరికా నేత. నాటో కూటమిలో పేరుకు 28 సభ్య దేశాలు ఉన్నా, అమెరికా ఒక్కటే ఒకటి (1). మిగిలిన 27 దేశాలన్నీ ఆ ఒకటి పక్క సున్నాలే. అంటే ఏ రష్యాతో యుద్ధం అంటూ వస్తే బాంబులు అవీ తీసుకుని అమెరికా రావాలే తప్ప ఇతర దేశాలు రష్యా ముందు నిలవలేవు.  1990ల ఆరంభంలో సోవియట్ రష్యా కూలిన తర్వాత రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య…

రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి‌ఏ‌జి) చేసిన పరిశోధనలో ఈ వాస్తవం వెల్లడి అయింది. ఈ పాపంలో కాంగ్రెస్, బి‌జే‌పిలు రెండూ భాగం పంచుకోగా కాంగ్రెస్ కంటే బి‌జే‌పి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని సి‌ఏ‌జి గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1996-97, 1997-98, 2006-07, 2007-08, 2014-15 సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కేంద్రం పంపిణీ చేసిందని సి‌ఏ‌జి…

ముగింపు: భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం -22

(21వ భాగం తరువాత………….) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ మార్పులపై ఒక నోట్ – పార్ట్ 22 – చాప్టర్ VII – ఎక్కడ నిలబడి ఉన్నాం? భారత వ్యవసాయానికి సంబంధించి ఈ లక్షణాలను పరిశీలించిన దరిమిలా మనం ఎక్కడ నిలబడి ఉన్నట్లు? అంబికా ఘోష్ పేర్కొన్నట్లుగా “ఈ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడ్డ స్ధూల ప్రభావం ఏమిటంటే రైతాంగ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావటం; భూస్వామ్య విధానం లేదా ధనిక రైతాంగ ఆర్ధిక…

మార్క్స్ ‘వర్తక పెట్టుబడి’ మన ‘వడ్డీ పెట్టుబడి’ -21

(20వ భాగం తరువాత…………..) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానంపై ఒక నోట్ – పార్ట్ 21 – పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలలో అధిక వడ్డీ గురించి చర్చిస్తూ కారల్ మార్క్స్ ఇలా చెప్పారు: “తన బాధితుడి నుండి అదనపు శ్రమను పిండుకోవడంతో సంతృప్తి చెందని అధిక వడ్డీదారుడు (usurer) అతని శ్రమ పరిస్ధితులనూ, భూమి,ఇల్లు మొ.న సాధనాలనూ కూడా క్రమ క్రమంగా స్వాధీనం చేసుకుంటాడు. ఆ విధంగా అతనిని స్వాయత్తం చేసుకునే కృషిలో నిరంతరాయంగా నిమగ్నమై ఉంటాడు.…

4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు -కార్టూన్

అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్న ఈ కార్టూన్, మన ముందు పరిచిన తమాషాను చెప్పుకుని తీరాలి. ఎడమ-పైన నుండి గడియారం ముల్లు తిరుగు దిశలో… 1. అస్సాం: బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షాకు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి తల బొప్పి కట్టింది. బీహార్ ఎన్నికల్లో లాలూ, నితీష్ లు ఉమ్మడిగా కొట్టిన దెబ్బకు ఆ బొప్పి మరింత వాచిపోయింది. అస్సాం ఎన్నికల్లో వాచిపోయిన బొప్పి కాస్త ఒంటి కొమ్ము…

ఈజిప్టు విమానం అదృశ్యం!

ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశామనీ, యాంత్రిక వైఫల్యం కారణం కావడానికి అవకాశాలు దాదాపు లేవని ఈజిప్టు ప్రభుత్వం, ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్ధ ప్రకటించాయి. యాంత్రిక లోపం కంటే ఉగ్రవాద చర్యే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ఈజిప్టు ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్ బస్ కంపెనీ తయారీ అయిన విమానం…

ఎన్నికల ఫలితాలు: ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి!

4 రాష్ట్రాల (పుదుచ్చేరి మినహా) ఎన్నికల ఫలితాలు  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా ఖాయం చేశాయి. ఒక్క తమిళనాడులోనే అంచనాలు తారుమారు అయ్యాయి. అయితే ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే మెజారిటీ బాగా తగ్గిపోయింది. మళ్ళీ జయలలిత అధికారంలోకి వస్తుందని రెండు సంస్ధల ఎగ్జిట్ పోల్స్ లో తెలిసినందున రెండు శిబిరాల మధ్యా పోటా పోటీ నెలకొంటుందని పరిశీలకులు భావించగా అదే నిజమైంది. అస్సాంలో బి‌జే‌పి కొత్తగా, మొదటిసారిగా అధికారం సాధించింది. పశ్చిమ బెంగాల్ ను మమత బెనర్జీ నిలబెట్టుకోవడమే కాకుండా…

భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ

(19వ భాగం తరువాత….) భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 20 D) భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ సరుకుల ఉత్పత్తి, వర్తక పెట్టుబడుల నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి, పారిశ్రామిక పెట్టుబడిలోకి జరిగే మార్పు సంక్లిష్టమైనది, సుదీర్ఘమైనది. ఇది అభివృద్ధి చెందిన దేశాల లోణూ, తక్కువ అబివృద్ధి చెందిన దేశాల లోనూ భిన్నమైన రూపాలు ధరిస్తుంది. వర్తక పెట్టుబడి వలయం (circuit)నిర్మాణాత్మకంగా సాధారణ పెట్టుబడి వలయంతో పోల్చితే ఒకటిగానే ఉంటుంది. తేడా…

బ్రెగ్జిట్ కు పెరుగుతున్న ఆదరణ!

బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈ‌యూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈ‌యూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి. కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట…

స్టేషన్ల చుట్టూ తిప్పారు, తిట్టారు, కొట్టారు, ఉమ్మారు!

హంద్వారా (కాశ్మీర్) అమ్మాయి ఎట్టకేలకు నోరు విప్పింది. పోలీసులే తన చేత బలవంతంగా అబద్ధం చెప్పించారని చెప్పింది. పోలీసులు ప్రచారం చేసుకున్న వీడియోలో తాను చెప్పినది నిజం కాదని వెల్లడి చేసింది. పోలీసులు చెప్పమన్నట్లు వీడియోలో చెప్పానని తెలిపింది. ఆ వీడియో రికార్డు చేసిన జిల్లా ఎస్‌పిని వీడియోను ఎవరికి చూపవద్దని కోరానని, కానీ అదే వీడియోను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపింది. తన కూతురును నిర్బంధంలో ఉంచుకుని ఆమె చేత అబద్ధం చెప్పించారని ఆమె…

పెట్టుబడిదారీ రైతు కోసం వెతుకులాట! -19

(C) పెట్టుబడిదారీ రైతు కోసం అన్వేషణ “వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పెట్టుబడిదారీ రైతు ప్రధానమైన, ఖచ్చితమైన సంకేతం” (Ranjit Sau: On the Essence and Manifestation of Capitalism in Indian Agriculture –Mode of Production Debate, edited by Utsa Patnaik– P-116) పై పుస్తకంలో అశోక్ రుద్ర తన వ్యాసంలో పెట్టుబడిదారీ రైతుకు కొన్ని ప్రమాణాలను పేర్కొన్నారు. (Ibid, P-27) (1) పెట్టుబడిదారీ రైతు తన భూమిని లీజుకి ఇవ్వడం…