యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు
యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…