గడ్డాఫీకి మద్దతుగా లిబియా ప్రజలు?

  Retreating rebels in Libya పశ్చిమ దేశాల వైమానిక దాడులు లేకుండా లిబియా తిరుగుబాటు బలగాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. మంగళవారం లండన్ లో లిబియా విషయమై ప్రపంచ దేశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటు బలగాలపై గడ్డాఫీ బలగాలు భారీగా దాడి చేశాయి. దానితో లిబియా తిరుగుబాటు దారులు సిర్టే పట్టణం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వదిలేసి తూర్పువైపుకు పలాయనం ప్రారంభించారు. సిర్టే పట్టణ…

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్

ఇండియాపై అమెరికా కర్రపెత్తనానికి ఇది మరో ఋజువు. ఈ సారి అమెరికా చెప్పినట్టు ఇండియా వినకపోవడమే వార్త. అయితే అందులో ఇండియా పాలక వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండటంతో అమెరికా గీసిన గీత దాటడానికి ఇండియా పాలకులు ధైర్యం చేశారు. డిసెంబరు 2008లో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం గాజా పై దాడి చేసి అక్కడి పౌరులను చంపడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా మద్దతు తెలిపింది. ఓటింగ్ కుముందు అమెరికా లాబీయింగ్ ను ఇండియా వ్యతిరేకించిన విషయాన్ని…

జపాన్ అణు రియాక్టర్ లీకేజి, నీరు, భూమి, గాలి లలో రేడియేషన్ మరింత తీవ్రం?

రోజులు గడుస్తున్నకొద్దీ జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టరు వద్ద రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ ప్రమాదం, ప్రమాదకర రేడియేషన్ భయాలు పెరుగుతున్నాయి తప్ప ఉపశమించడం లేదు. అణు విద్యుత్ తో పెట్టుకుంటే ఏర్పడే ప్రమాదాలకు విరుగుడు మనిషి చేతిలో లేదని అంతకంతకూ స్పష్టం అవుతోంది. అత్యంత శుభ్రమైనదీ, పర్యావరణ రక్షణకు అత్యంత అనుకూలమైందీ అన్న పేరుతో పశ్చిమ దేశాలు అణు విద్యుత్ కి ఇటీవల కాలంలో ప్రచారం పెంచాయి. పర్యావరణం తర్వాత సంగతి, ముందు మానవాళి…

పశ్చిమ దేశాల దాడుల్లో వందకు పైగా లిబియన్ల మరణం, కొనసాగుతున్న దురాక్రమణ దాడులు

లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 2

2005, 2007 ల మధ్య కాలంలో అమెరికా, ఇండీయా లమధ్య అణు ఒప్పందం కుదరడం వెనక అన్ని పనులు పూర్తి కావడంలో తీవ్రంగా శ్రమించిన జై శంకర్ ఇప్పుడు ఇండియా తరపున చైనాకు రాయబారిగా పని చేస్తున్నాడు. రాబర్ట్ బ్లేక్ ఆ తర్వాత శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా పని చేశాడు. ఈయన ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని స్టేట్ డిపార్ట్ మెంటు లో దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల శాఖకు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.…

ఎయిర్టెల్ జాబ్ నుండి గ్రామ సర్పంచ్ గిరీకి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చేసిన వారంతా రెండు సంవత్సరాల పాటు గ్రామాల్లో వైద్యం చేస్తేనే డిగ్రీ చేతికి ఇస్తామని ప్రకటించినపుడు మెడికల్ విద్యార్ధులు ఆ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం చూశాం. ఇండియాలో ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాసంస్ధలలో భారత ప్రజల డబ్బుతో చదువుకొని కోట్ల కొద్ది జీతాల కోసం అమెరికా వాల్ స్ట్రీట్ కంపెనీల ఉద్యోగాల కోసం పరిగెత్తే విద్యాధికులను చూశాం. ఇంజనీర్లు, డాక్టర్లైతే చాలు ఎప్పుడు…

ఫుకుషిమా అణు రియాక్టర్ల వద్ద మరింత పెరిగిన అణు ధార్మికత

మానవ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రమాదంగా పేరు తెచ్చుకున్న జపాన అణు ప్రమాదం మరింత తీవ్రమవుతోంది. దైచి అణు విద్యుత్ కర్మాగారం లోని రియాక్టర్ల నీటిలో రేడియేషన్ మామూలు స్ధాయి కంటే 10 మిలియన్ల రెట్లు రేడియేషన్ నమోదైనట్లు అణు కర్మాగారాల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెని (టెప్కో) తెలిపింది. ప్రమాద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపకుండా దాపరికంతో వ్యవహరిస్తున్నందుకు టెప్కో పై విమర్శలు వస్తున్నాయి. కర్మాగారంలో రియాక్టర్లను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్న వర్కర్లకు సరైన దుస్తులు ఇవ్వలేదని…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 1

శ్రీశ్రీ గారి మహా ప్రస్ధానం రచనకు గుడిపాటి చలం ముందుమాట రాశారు. అందులో ఆయన “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ కి బాధ” అని చమత్కరించారు. అది చమత్కారమే అయినా వాస్తవం కూడా ఉంది, అది వేరే సంగతి. అమెరికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాకి ఏ భాధ వచ్చినా దాన్ని ప్రపంచానికి అంటగడుతుంది. ఎయిడ్స్ జబ్బుని అలాగే అంటగట్టింది. “టెర్రరిజం పై సమరా”న్ని కూడా అలాగే అంటగట్టింది. తాజాగా ఆర్ధిక…

యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

  భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర…

సంకీర్ణ సేనల దాడుల సాయంతో కీలక పట్టణం తిరుగుబాటుదారుల స్వాధీనం

పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న…

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి, ఆగ్రహించిన అమెరికా రాయబారి -వికీలీక్స్

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు తొ జరిగిన విషయం తెలిసిందే. జులై 2005 లో జరిగిన ఈ వివాహం రిసెప్షన్ జులై 23, 2005 తేదీన దుబాయ్ లోని హోటల్ హయత్ లో జరిగింది. ఈ హోటల్ యజమాని అమెరికాకి చెందిన హయత్ కార్పొరేషన్ కావడమే అమెరికా రాయబారి ఆగ్రహానికి కారణం. దుబాయ్ లోని హోటల్ హయత్ అమెరికాకి చెందిన హోటల్ అని భారత దేశంలో అందరికీ తెలుసనీ,…

లిబియా దాడులతో స్పష్టమైన అమెరికా బలహీనత -న్యూ డెమొక్రసీ నాయకుడు

లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ,…

రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల్లో చిక్కుకున్న పోర్చుగల్, యూరప్ ని వెంటాడుతున్న అప్పు సంక్షోభం

గ్రీసు, ఐర్లండ్ లను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం ఇప్పుడు పోర్చుగల్ ని బలి కోరుతోంది. ఆర్ధిక సంక్షోభం పేరుతో పోర్చుగల్ ప్రధాని జోస్ సోక్రటీసు బడ్జెట్ లో ప్రతిపాదించిన కఠినమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓటువేయడంతో సోక్రటీసు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటీసు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్నాడు. బ్రసెల్స్ లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సభ యూరోపియన్…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…