స్మార్ట్ సిటీ: ఇంతవరకు ఒక్క పైసా రాలింది లేదు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
మోడి ప్రభుత్వం మరో విడత స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించింది. స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఎంపిక అయిన నగరాలను కేంద్రం ప్రకటించడం ఇది మూడోసారి. ఇన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఈ రెండేళ్ల మోడి పాలనలో విదేశీ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా (విదేశీ పెట్టుబడి కాబట్టి ఒక్క డాలర్ కూడా అందాం పోనీ) దేశంలోకి, స్మార్ట్ సిటీల్లోకి రాలేదు. మొదటి విడత 20 నగరాల జాబితా విడుదల చేయగా రెండో విడత 13 నగరాల…

అమెరికన్ ‘నెట్ ఫ్లిక్స్’ కు ప్రవేశం ఇవ్వని చైనా!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
– అదే భారత పాలకవర్గాలైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్లు. చట్టాలు నిర్దేశించిన నియమ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేసి ‘రండి రండి రండి దయ చేయండీ! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!’ అని పాడుతూ స్వాగత సత్కారాలు పలికేవాళ్లు. “చైనాలోకి జొరబడడం ఎంతవరకు వచ్చింది?” అని రాయిటర్స్ వార్తా సంస్ధ ‘నెట్ ఫ్లిక్స్ ఇంక్.’ కంపెనీ సి‌ఈ‌ఓ రీడ్ హేస్టింగ్స్ ని అడిగింది. దానికాయన నిరాశగా పెదవి విరిచి “ప్చ్! ఎలాంటి…

బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

– [ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం] ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్…

సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది. రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది. గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్…

రాంకుమార్ ఆత్మహత్య(?)తో స్వాతి హత్య ఇక మిస్టరీ!

రాం కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, కాదు… ఆత్మహత్య చేసుకున్నాడని పూళల్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు. ప్రాణాధికంగా ప్రేమించిన యువతి తన రూపాన్ని అపహాస్యం చేయడం సహించలేక హంతకుడిగా మారిన భగ్న ప్రేమికుడు రాం కుమార్ తన వాస్తవ ప్రేమ కధ ఏమిటో లోకానికి తెలియకుండానే భూమిపైన నూకలు చెల్లించుకున్నాడు. జైలులోని డిస్పెన్సరీలో ఉండగా రాం కుమార్ అక్కడి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు నుండి విద్యుత్ ప్రవహిస్తున్న తీగను బైటికి లాగి నోటితో కరిచి…

నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్పుతా! -అమెరికాతో రష్యా రాయబారి

ఐసిస్ పురోగమనానికి వీలుగా సిరియా సైన్యంపై వైమానిక దాడులు నిర్వహించి 80 మంది వరకు ప్రభుత్వ సైనికులను బలిగొన్నందుకు అమెరికాపై సిరియా కాస్త ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన డెర్ ఎజ్-జోర్ లోనే ఆకాశంలో ఎగురుతున్న అమెరికన్ గూఢచార డ్రోన్ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేసింది.  అమెరికా-రష్యాల మధ్య కొద్దీ రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం టెర్రరిస్టు. సంస్ధల వల్ల ఉల్లంఘనకు గురవుతుందని అందరూ భావిస్తుండగా అమెరికాయే ఒప్పందాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ…

సిరియా సైన్యంపై అమెరికా దాడి, క్షమాపణలు!

ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకుంటున్న అమెరికా వాస్తవంలో దానికి మద్దతు ఇస్తున్నదని మరోసారి రుజువు అయింది. ఇస్లామిక్ స్టేట్ బలగాలపై పోరాడుతున్న సిరియా ప్రభుత్వ సైన్యాలపై అమెరికన్ ఫైటర్ జెట్ విమానాలు బాంబులు కురిపించి 60 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. దానితో అమెరికా వాస్తవానికి ఇసిస్ తరపున సిరియా ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నదని స్పష్టం అయిపోయింది. శనివారం సాయంత్రం సమయంలో అమెరికా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. దాడి…

WTO: అమెరికా చేతిలో ఇండియాకు మరో ఓటమి

  సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఇండియాకు మరో ఓటమి ఎదురయింది. అమెరికాకు అనుకూలంగా WTO ఇచ్చిన తీర్పుపై ఇండియా అప్పీలుకు వెళ్లగా అప్పిలేట్ బోర్డు కూడా అమెరికా వాదనకు మద్దతుగా వచ్చింది. దానితో అమెరికా సోలార్ విద్యుత్ కంపెనీలు ఇండియాలో ముడి సరుకులను వినియోగించి ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయాలన్న ఇండియా వాదన మరో ఓటమి ఎదుర్కొంది.  జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ పధకం కింద…

బేయర్, మాన్ శాంటో విలీనం: మహా రాకాసి అవతరణం

  రాకాసి, రాకాసి విలీనం అయితే ఏమవుతుంది? మహా రాకాసి పుడుతుంది.  రెండు రాకాసులు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ రాకాసులు విడి విడి గా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు పని వాళ్ళు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలు విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా అలా…

సిరియాలో కాల్పుల విరమణ -ద హిందూ ఎడిట్…

  సిరియాలో కాల్పుల విరమణ విషయమై రష్యా అమెరికాల మధ్య జెనీవాలో కుదిరిన ఒప్పందం, ఐదున్నర సంవత్సరాల అంతర్యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు బహుశా అత్యంత మెరుగైన అవకాశం కావచ్చు. ఒప్పందం కింద, అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వం తిరుగుబాటుదారుల ఆధీనం లోని ప్రాంతాలపై బాంబులు వేయకుండా రష్యా నిరోధిస్తుంది. అమెరికా యేమో ఇస్లానిక్ స్టేట్ తో సహా జిహాదిస్టు  గ్రూపులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రష్యాతో చేతులు కలుపుతుంది. విశాల చట్రం ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందం,…

ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ కూల్చిన సిరియా సైన్యం

సిరియాలో ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టుల తరపున ఇజ్రాయెల్  కూడా యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తేటతెల్లం అయింది. ఇజ్రాయెల్-సిరియా సరిహద్దులో సిరియా బలగాలపై ఫైటర్ జెట్ విమానాలతో బాంబు దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా బలగాలు కూల్చివేశాయి. దానితో మధ్య ప్రాచ్యంలో టెర్రరిస్టు సంస్ధలు జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మద్దతు ఉన్నట్లు స్పష్టం అయింది.  కూల్చివేతను ఇజ్రాయెల్ నిరాకరించింది. కానీ సిరియా బలగాలపై తమ యుద్ధ విమానాలు బాంబు దాడులు చేసిన సంగతిని మాత్రం ఆ…

బలూచిస్తాన్ స్వతంత్రంకు మద్దతు ఇవ్వం -అమెరికా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎర్ర కోట ప్రసంగం నాడు సృష్టించిన దుమారాన్ని అమెరికా చప్పున చల్లార్చింది. బలూచిస్తాన్ ప్రజల పోరాటాలకు ప్రధాని మోడి మద్దతు ఇస్తున్నట్లుగా భారత పత్రికలు తీసిన అర్ధం నిజం కాదని అమెరికా ఇచ్చిన వివరణ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతకు అమెరికా కట్టుబడి ఉన్నదనీ, బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి తాము మద్దతు ఇచ్చేది లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. “మా ప్రభుత్వ విధానం ఏమిటంటే పాకిస్తాన్…

ముంబైకి రిలయన్స్ ఎగేసిన బాకీ రు 1577 కోట్లు!

ముంబై మునిసిపాలిటీకి ఐదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చెల్లించవలసిన బాకీని చెల్లించని ఉదంతం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్మెంట్ ఆధారిటీ (ఎం‌ఎం‌ఆర్‌డి‌ఏ) కి చెందిన రెండు స్ధలాలను లీజుకు తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, లీజు ద్వారా తలెత్తిన చెల్లింపులను ఎగవేసినట్లు లేదా ఇంతవరకు చెల్లించనట్లుగా ఒక ఆర్‌టి‌ఐ కార్యకర్త వెల్లడి చేశాడు. అక్రమ కట్టడం పేరుతో, ఆక్రమణ పేరుతో పేదల గుడిసెలను పెద్ద ఎత్తున తొలగించి…

అమెరికా ప్రబల శత్రువు రష్యాయే -సిఐఎ

రష్యా పైన మరో అత్యున్నత అమెరికా అధికారి వ్యసనం వెళ్లగక్కాడు. అమెరికాకు అన్ని విధాలుగా సవాలుగా పరిణమించిన దేశం ఒక్క రష్యా మాత్రమే అని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎజన్సీ డైరెక్టర్ బ్రెన్నన్ వ్యాఖ్యానించాడు. ఏ రంగంలో తీసుకున్నా రష్యా దేశం ఈ రోజు గట్టి స్దానంలో నిలవడానికి ముఖ్య కారణం ఆ దేశ అధ్యక్షుడు పుటిన్ అని బ్రెన్నన్ తన అక్కసు వెళ్లబోసుకున్నాడు. సిబిసి వార్తా సంస్దకు ఇంఠర్వ్యూ ఇస్తూ బ్రెన్నన్ ఈ వ్యాఖ్యలు చేసాడు. “అన్ని…

ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…

‘ప్రత్యేకం’ అయినది ఏ విధంగా ప్రత్యేకం అవుతుంది? విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుండి ఆపన్న హస్తం అందించాల్సిన అగత్యం ఏర్పడింది అనడం ఎన్నడూ సందేహం కాలేదు. కానీ రాష్ట్రం ఏ రీతిలో ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నదన్న అంశంలోనే కృషి జరగవలసి వచ్చింది. దానిని ప్రత్యేక తరగతి హోదా కలిగిన రాష్ట్రంగా ప్రకటించవచ్చా లేక ప్రత్యేక తరగతి హోదాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరాలను తీర్చే బాధ్యత లేని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వరకు…