టర్కీ: ఇసిస్ టెర్రరిస్టుల కార్ఖానా! -కార్టూన్

సిరియాలో టెర్రరిస్టులను ప్రవేశపెట్టిన అమెరికా మిత్ర దేశాలలో టర్కీ ఒకటి. సౌదీ, కతార్, యూ‌ఏ‌ఈ లాంటి అరబ్ షేక్ ప్రభుత్వాలు డబ్బు గుమ్మరిస్తే, పశ్చిమ దేశాలతో సహా ప్రపంచం నలు మూలల నుండి ఇస్లామిక్ యువతను సమీకరించే పనిని అమెరికా, సౌదీ, ఐరోపా దేశాల ఇంటలిజెన్స్ సంస్ధలు చేపట్టగా, వారికి శిక్షణ ఇచ్చి సిరియా-టర్కీ సరిహద్దు గుండా సిరియాలో ప్రవేశపెట్టే బాధ్యత టర్కీ తీసుకుంది. ఇసిస్ మూకలు సిరియా నుండి దొంగిలించిన చమురు సరఫరా చేస్తుంటే దానిని…

పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ! ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు:  1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి…

వీసా పోటీ: ఐరోపాకు విస్తరిస్తున్న రష్యా చెల్లింపు వ్యవస్ధ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి.  మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను…

అమెరికా ఇక ప్రపంచ పోలీసు కాజాలదు -ట్రంప్

  తదుపరి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య మొదటి చర్చ అమెరికాలో ప్రారంభం అయింది. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగబోయే లోపు అధ్యక్ష పదవికి పోటీ లో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చ (డిబేట్) లో మూడు సార్లు పాల్గొనవలసి ఉంటుంది.   ఈ చర్చలలో అభ్యర్థులు తమ ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ విధానాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తామో…

ప్రణాళికలో వెనకబడటం (విద్య-ఓ‌ఈ‌సి‌డి-ఇండియా) -ద హిందు ఎడిట్…

[సెప్టెంబర్ 26 తేదీన ద హిందు ‘Falling behind schedule’ శీర్షికన ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] ఆర్గనైజేషన్ ఫోర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్మెంట్ నివేదిక ప్రకారం ప్రస్తుతం సాధించబడ్డ విద్యా దక్షతలు వ్యక్తిగత శ్రేయస్సు మరియు సామాజిక ప్రగతి పెంపుదలకు సరిపడా అవసరమైన దాని కంటే చాలా దూరంలోనే ఉండిపోయాయి. మిలియన్ల మంది శరణార్ధులలో వలసలు వెళుతున్న ప్రజానీకం మరీ ముఖ్యంగా అత్యంత ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. కాస్తంత నీడ, సహాయం…

సంచలనం: ఇసిస్ అమెరికా చర్చల ఆడియో లభ్యం

అమెరికా అసలు రంగు అనుమానం లేకుండా రుజువయ్యే వార్త ఇది. ప్రపంచంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్ధలుగా పేరు పొందిన సంస్ధలు అన్నింటికీ మూలం అమెరికాయే అని మరోసారి రుజువు అయిన సందర్భం ఇది. ప్రస్తుతం అత్యంత కఠిన, పాషాణ, రక్తదాహంతో నిండినదని అమెరికా కూడా చెబుతున్న ఐ‌ఎస్/ఇసిస్/ఇసిల్ సృష్టికర్త, మద్దతుదారు, ఆయుధ-ధన-శిక్షణ సరఫరాదారు అమెరికాయే అని తిరుగు లేకుండా రుజువు చేసే ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. సిరియా కిరాయి తిరుగుబాటు…

కస్టమర్ డేటా అమ్మేస్తున్న రిలయన్స్ జియో -ఎనోనిమస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
వచ్చే డిసెంబర్ చివరి వరకు ఉచిత డేటా ఆఫర్ తో 4G మార్కెట్ లో తొక్కిసలాట సృష్టించిన రిలయన్స్ జియో తన అప్లికేషన్స్ ద్వారా సేకరించే యూజర్ (కస్టమర్ల) డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా హ్యాకర్ గ్రూఫు హ్యాక్టివిస్ట్ సంస్ధ ‘ఎనోనిమస్’ ప్రకటించి సంచలనం సృష్టించింది.? గూగుల్ కంపెనీ లాగానే భారీ మొత్తంలో ఉచిత సేవలు, ఉచిత యాప్స్ ను యూజర్స్ కు ఇవ్వజూపుతున్న రిలయన్స్ కంపెనీ తన ఉచిత…

రాఫెలే ఫైటర్: ఫ్రాన్స్ తో ఒప్పందం ఖరారు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూ‌పి‌ఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది. 7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం. రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా…

సిక్సర్ సిద్దు: బ్యాట్ లేకుండా బ్యాటింగ్

పాపం నవ జ్యోత్ సింగ్ సిద్ధూ! పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ఆశపడి ఏ‌ఏ‌పి లో జొరబడబోయారు. కానీ సి‌ఎం పదవి అప్పగించేందుకు ఏ‌ఏ‌పి ఒప్పుకోకపోవడంతో ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో కూటమి పెడుతున్నట్లు ప్రకటించారు. కానీ తమ ఫ్రంటు ఒక ఫోరంగా మాత్రమే ఉంటుందని ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. తాను పార్టీ పెడితే అకాలీ వ్యతిరేక ఓట్లు చీలి మళ్ళీ అకాలీకే లాభిస్తుందని అందుకని పోటీ చేయడం లేదని ప్రకటించారు. ప్రకటించిన కారణం…

సామ్ సంగ్ నోట్ 7: నెత్తురు కక్కుకుంటూ…

మొబైల్ ఫోన్ల మార్కెట్ లో యాపిల్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ వస్తున్న సామ్ సంగ్ కంపెనీ తన తాజా ఫ్లాగ్ షిప్ మోడల్ నోట్ 7 వల్ల ఆర్ధికంగానూ, ప్రతిష్ట పరంగానూ నష్టాల్ని ఎదుర్కొంటోంది. ఎంతో ఆర్భాటంగా, ఎన్నో ఆశలు మరెంతో ఆసక్తి రేపిన సామ్ సంగ్ నోట్ 7 మోడల్ లోని బ్యాటరీ చార్జి చేసేటప్పుడు పేలి పోతుండడంతో ఎప్పుడూ లేనట్లుగా అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకుని డబ్బు ఇచ్చేయవలసిన పరిస్ధితికి…

ఇటలీ: యూరోని వదిలేస్తే తప్ప ఆర్ధిక వృద్ధి అసాధ్యం!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు…

ఐరాస కాన్వాయ్ పై దాడి అమెరికా పనేనా?

  సెప్టెంబర్ 19 తేదీన అలెప్పో ప్రాంతంలో ఐరాస హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పై జరిగిన దాడి విషయమై సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన సమయంలో, ఆ సమయానికి ముందూ వెనకా, అలెప్పో ప్రాంతంలో రికార్డ్ అయిన ఫ్లయిట్ డేటా వివరాలను పరిశీలించిన రష్యన్ ప్రభుత్వం ఈ కొత్త వివరాలను వెల్లడి చేసింది.  అలెప్పో ప్రాంతం లోని ఉరుమ్ ఆల్-కుబ్రా ప్రాంతంలో ఐరాస కాన్వాయ్ ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్ అటాక్ జరిగిందని ఐరాస తెలిపింది. ఆ…

జర్మనీ సిక్కులపై ఇండియా కోసం గూఢచర్యం, అరెస్టు!

ఆయన జర్మనీ దేశస్ధుడే. వయసు 58 యేళ్ళు, ఉద్యోగం ఇమిగ్రేషన్ ఆఫీస్ లో. తన ఉద్యోగం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ఒక (పేరు వెల్లడి కాని) భారత ప్రభుత్వ గూఢచార సంస్ధ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడిపోయాడు. విదేశీ గూఢచార సంస్ధల తరపున లేదా ఆ సంస్ధల కోసం గూఢచర్యం చేయడం జర్మనీలో నేరం. ఒక్క జర్మనీలోనే కాదు, ఏ దేశంలోనైనా అది నేరమే. జర్మనీలో అలాంటి వారికి కనీసం 10 యేళ్ళు జైలు శిక్ష…

అచ్ఛే దిన్ కనుచూపు మేరలో లేవు -మూడీస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి.  అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని…

సిరియా: విచక్షణ లేకుండా బాంబులు వెయ్, నింద ప్రత్యర్థి మీదికి నెట్టేయ్!

  అనుకున్నట్టే జరుగుతోంది. సిరియాలో కిరాయి తిరుగుబాటు ప్రవేశపెట్టిన దగ్గర్నుండి ఎలాంటి కుత్సిత ఎత్తుగడలనైతే అమెరికా శిబిరం అనుసరిస్తూ వస్తున్నదో ఇప్పుడూ అదే ఎత్తుగడ అమలు చేస్తున్నది. వారం రోజుల క్రితం రష్యాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలులో లేకుండా చేయడానికి చేయవలసిందల్లా చేసి ఆ నెపాన్ని సిగ్గూ ఎగ్గూ  లేకుండా సిరియా-రష్యా శిబిరం మీదికి నెట్టివేస్తున్నది.  వారం క్రితం సిరియా విషయమై అమెరికా-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ…