‘బోస్టన్ ఆక్రమిద్దాం’ ఉద్యమ అతి పెద్ద ర్యాలి -వీడియో

సెప్టెంబరు 30 తేదీన అమెరికాలోని బోస్టన్ నగరంలో వివిధ ప్రాంతాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో బెయిలౌట్లు పంచిపెట్టిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బోస్టన్ శాఖ ముందు అందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. హైస్కూల్ విద్యార్ధులనుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ పాల్గొన్న ఈ ర్యాలికి పోలీసులు కాపలా కాశారు. వికలాంగులు సైతం పాల్గొన్న ఈ ఊరేగింపు తర్వాత బోస్టన్ నగరం నుండి అనేకమంది ఇతర నగరాలకు వెళ్ళి…

బోస్టన్ ను ఆక్రమించండి -ఫొటో + వీడియో

“ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం అమెరికాలో అక్టోబరు 3 నాటికి 50 నగరాలకు పైగా వ్యాపించింది. బోస్టన్ నగరవాసులు “ఆకుపై బోస్టన్” ఉద్యమం కింద సమీకృతులవుతున్నారు. సెప్టెంబరు 30 తేదీన వెయ్యిమందికి పైగా ప్రజానీకం బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు ప్రదర్శన నిర్వహించి ఇళ్ళ రుణాలను ఫోర్ క్లోజ్ చేయడంపై మారిటోరియం విధించాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత డీవే స్క్వేర్ కు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ “ఆకుపై బోస్టన్” ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఉద్యమంలో 7…

రక్తం ఓడుతున్న బహ్రెయిన్ -కార్టూన్

లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా…

ప్రపంచంలోనే చౌక ‘టాబ్లెట్’ విడుదల చేసిన ఇండియా

గత కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న ‘ఆకాశ్’ టాబ్లెట్ విడుదలయ్యింది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి కబిల్ సిబాల్ బుధవారం ‘ఆకాశ్’ ను విడుదల చేశాడు. విద్యార్ధులకు, పేదలకు సైతం కంప్యూటర్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆకాశ్’ టాబ్లెట్ మొదటి విడత లక్ష ఉత్పత్తులను విద్యార్ధులకు ఉచితంగా ఇస్తామని కపిల్ సిబాల్ ప్రకటించాడు. ‘డేటా విండ్’ అనే బ్రిటిష్ కంపెనీ ‘ఆకాష్’ ను తయారు చేస్తోంది. ఆ కంపెనీయే ‘ఆకాష్’ ను అభివృద్ధి చేసింది.…

అమెరికా అంతటా విస్తరిస్తున్న వాల్‌స్ట్రీట్ వ్యతిరేక ఆందోళనలు

అమెరికాలొ వాల్‌స్ట్రీట్ కంపెనీల దోపిడికి, వాల్‌స్ట్రీట్ కంపెనీలకు సహకరిస్తున్న పాలకుల విధానాలకూ వ్యతిరేకంగా అమెరికన్లు సాగిస్తున్న ఆందోళనలు అక్టోబరు 4 తేదీతో 19 వ రోజుకి చేరుకున్నాయి. సెప్టెంబరు 17 తేదీన న్యూయార్క్ లో కొద్దిమందితో మొదలైన “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమించండి” ఉద్యమం, క్రమంగా ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. అస్ధిర ఆర్ధిక వ్యవస్ధపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కార్పొరేట్ కంపెనీల అత్యాశను నిరసిస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల శాఖలను ప్రదర్శనలు, ఆందోళనలతో…

ఆ చట్టం ఆమోదిస్తే ‘వాణిజ్య యుద్ధం’ తప్పదు, అమెరికాకి చైనా హెచ్చరిక

చైనా కరెన్సీ విలువ పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని పూనుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖంచించింది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ యువాన్ విలువను అతి తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా గత రెండు సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. యూరప్, ఇండియాలు కూడా చైనాపైన ఇదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అమెరికా అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. చైనా కరెన్సీ యువాన్ విలువను తక్కువ విలువ వద్ద ఉంచడం వలన చైనా సరుకుల ధరలు తక్కువగా ఉంటున్నాయని దానితో అది…

ఎస్.బి.ఐ డౌన్ గ్రేడ్ తో భారత షేర్ల పతనం

ఇండియా షెర్ మార్కెట్ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్, గత ఐదు వారాల్లో మరోసారి 16,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్ సంస్ధ, దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ తగ్గించడంతో దాని ప్రభావం షేర్లపై పడింది. వరుసగా మూడవరోజు పతనమైన సెన్సెక్స్ మంగళవారం 286.59 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 15745.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 1.6 శాతం నష్టపోయి 4772.15 పాయింట్ల వద్ద ముగిసింది.…

రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల సుప్రీం కోర్టుకి దారిద్ర్య రేఖ ప్రమాణాలపై సమర్పించిన అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతోంది. సోనియా గాంధి నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ సభ్యుడు ఎన్.సి.సక్సేనా అహ్లూవాలియా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కించడానికి విధించిన ప్రమాణంపై నిరసనపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. “రోజుకి 32 రూపాయల ఆదాయంతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవని ఆయన ‘మెయిల్ టుడే’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. “మనిషనేవాడెవ్వడూ రోజుకు రు.32/-తో బతకడం అసాధ్యమని…

అమెరికాలో కదం తొక్కుతున్న “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం -ఫొటోలు

వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా వాల్ స్ట్రీట్ కు అమెరికా సంపదను దోచిపెడుతున్న అమెరికా పాలకులకు వ్యతిరేకంగా “వాల్ స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం న్యాయార్క్ నగర వీధుల్లో కదం దొక్కుతున్న దృశ్యాలివి. సి.బి.ఎస్ న్యూస్ సంస్ధ వీటిని ప్రచురించింది.

అమెరికాలో “వాల్ స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం” ఉద్యమ హోరు

అమెరికాలో ఇప్పుడు “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమం హోరెత్తిస్తోంది. అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలని అణచివేయడానికీ అది వీలు కాకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికీ పావులు కదపడంలో బిజీగా ఉన్న అమెరికా తన ప్రజలు ఈజిప్టు ఉద్యమం తరహాలో చేస్తున్న ఉద్యమంతో కూడా సతమతమవుతోంది. అమెరికాలో నిరసనకారులు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమం చేయకపోవచ్చు గానీ అక్కడి ప్రజల్లో అమెరికా అవినీతి ప్రభుత్వంపైనా, విఫలమైన వ్యవస్ధపైన దాచిపెట్టుకున్న వ్యతిరేకత, ఎదుర్కొంటున్న నిరాశా నిస్పృహలు నిరసనల రూపంలో, “వాల్‌స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం”…

రెండు తలల పిల్లి -ఫొటోలు

ఆ మధ్య రెండు తలల పాము ఒకటి కనపడి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండు తలల పిల్లి వార్తలకెక్కి అబ్బుర పరుస్తోంది. ఈ ఫోటోలు సెప్టెంబరు 28 న తీసినవి. మసాఛుసెట్స్ లోని వార్సెస్టర్ లో నివసిస్తున్న మార్టి అనే ఆవిడ తన పిల్లిని ఫొటో లు తీయడానికి అనుమతించింది. తన రెండు తలల పిల్లికి ఆమే ఫ్రాంక్, లూయి అని పేర్లు పెట్టిందట. ఈ తరహా పిల్లులని జానుస్ కేట్ అంటారట. రోమన్ మైధాలజీలో ఒకే తలలో…

భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -3

పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్ధలలో ప్రజాస్వామ్యం ఒక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉన్నదని ఎలా చెప్పగలం? ప్రజాస్వామ్యం అన్నదానికి నిర్వచనాన్ని పరీక్షించి అందులో వివరించినట్లుగా దాదాపు అన్ని లక్షణాలు సదరు వ్యవస్ధలో ఉన్నట్లయితే, ఆ వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ప్రజాస్వామ్యం ఉందని చెబుతున్నారు. సొషలిస్టు రష్యాలో గానీ, సొషలిస్టు చైనాలో గానీ అక్కడి ప్రజలకు కూడా తెలియని అంశాలను ప్రస్తావించి ఇదే సోషలిజం అని చెప్పి దీనికంటె అమెరికాలో బాగుంది కదా, అందువలన…

సిరియా సంస్కరణలకు అమెరికాయే అడ్డం -కార్టూన్

అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…

ప్రధాని పదవి కోసం బిజెపిలో అప్పుడే పోరు మొదలు

సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగానే బి.జె.పి లో పదవీ కుమ్ములాటలు మొదలైనట్లు కనిపిస్తోంది. శుక్ర, శనివారాలలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హాజరు కాకుండా ఎగవేయడంతో ఈ కుమ్ములాటలు బైటికి వచ్చాయి. మోడి రాకపోవడాన్ని బి.జె.పి ప్రతినిధులు చిన్నవిషయంగా కొట్టి పారేస్తున్నప్పటికీ ఆయన గైర్హాజరీకి వారు ఇచ్చిన కారణాలు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడంలోనే అసలు విషయం వెల్లడవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో రాజకీయ పరిస్ధితిపై…