Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల…

గాంధీ బొమ్మ లేని 2000 నోటు!

డీమానిటైజేషన్ / రీమానిటైజేషన్ లీలలు ఒకటీ, రెండూ కాదు.  ఆ మధ్య సంస్కృత అంకెలను తప్పు ముద్రించారు. ఆ తర్వాత ఆంగ్లం అంకెలని కూడా తప్పు ముద్రించారు. థ్రెడ్ లేకుండా కొన్ని నోట్లు పంచారు. ఓ చోట  బ్యాంకు రెండు వేల నోటు తెచ్చుకున్నాక కొన్ని గంటల లోపే ముక్కలు ముక్కలుగా దానంతట అదే విరిగిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. కొన్ని చోట్ల సగం మాత్రమే ప్రింట్ అయిన 500 నోట్లు ఎటిఎం లలో ప్రత్యక్షమై…

నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది.  PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల…

నోట్ల రద్దు నిరసన: లక్ష కి.గ్రాల కూరగాయలు ఫ్రీగా ఇచ్చేసిన రైతులు

“డీమానిటైజేషన్ వల్ల జనానికి కాస్త అసౌకర్యం కలిగించిన మాట నిజమే. కానీ ప్రజలందరూ డీమానిటైజేషన్ కు మద్దతు ఇస్తున్నారు. మోడీ మంచి చర్య తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారని మెచ్చుఁకుంటున్నారు. దేశంలో ఏ ఒక్కరూ నిరసన తెలియజేయక పోవటమే అందుకు నిదర్శనం. జనం ఎక్కడా వీధుల్లోకి రాకపోవడమే అందుకు సాక్షం.”  ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. డీమానిటైజేషన్ ఫలితంగా వందకు మందికి…

సుప్రీం ప్రక్షాళన: బి‌సి‌సి‌ఐ అధ్యక్షుని డిస్మిస్!

సుప్రీం కోర్టు పుణ్యాన భారత క్రికెట్ 2017 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అవినీతి రాజకీయ నాయకులకు, ఆశ్రిత పక్షపాతానికి, వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన బి‌సి‌సి‌ఐ అధ్యక్షుడు కార్యదర్శి పదవుల నుండి అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లను తొలగించింది. వారి స్ధానాలను భర్తీ చేసేందుకు క్రికెట్ ఆటతో సంబంధం ఉన్న నిష్కళంక దక్షులను వెతకాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులతో ద్వి సభ్య కమిటీ నియమించింది. అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ…

నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు. కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని…

మంచి కోసం బలహీనుల బలిదానం తప్పదు!

రచన: డా. రమణ యడవల్లి (ఫేస్ బుక్ నుండి) ********* “ఏవిఁటీ! దేశప్రజలందరికీ ఒక్కరోజులో ఈత నేర్పేశారా! యెలా సాధ్యం?” “సింపుల్! రాత్రికిరాత్రే ఒక్కసారిగా ప్రజల్ని నీళ్ళల్లోకి తోసేశాం.” “వామ్మో!” “సరీగ్గా వాళ్ళూ ఇలాగే ఆర్తనాదాలు చేశారు.” “తర్వాత?” “వారిలో కొందరు ప్రాణభయంతో కాళ్ళూచేతుల్ని తపతపలాడిస్తూ ఈత నేర్చేసుకున్నారు.” “మిగిలివాళ్ళు?” “వాళ్ళు సోమరులు, నీళ్ళల్లో మునిగి చచ్చారు.” “ఈత నేర్పే పద్ధతి ఇది కాదేమో!” “ప్రజలకి మంచి చెయ్యాలనే మా స్పూర్తిని నువ్వు అభినందించాలి!” “కానీ బలహీనులు…

సిరియాలో శాంతికి ఒక అవకాశం -ద హిందూ..

(True transalation of The Hindu editorial “A Chance For Peace in Syria”, published on December 21, 2016.) ********* సిరియా సంక్షోభానికి దౌత్య పరిష్కారం కనుగొనటానికి రష్యా, టర్కీ, ఇరాన్ లు ఒక చోటికి చేరడం ఆహ్వానించదగిన పరిణామం. టర్కీలో రష్యా రాయబారి అందరి కార్లొవ్ హత్యకు గురయినప్పటికీ మాస్కోలో మంగళవారం జరగనున్న శిఖరాగ్ర సభను కొనసాగించడానికే నిర్ణయించడం బట్టి తాము అనుకున్న పంధాలో ముందుకు వెళ్ళడానికే తాము నిబద్ధులమై ఉన్నామని…

రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ‘ఆహా… ఒహో…’ అన్న వారంతా ఇప్పుడు వెనక్కి మళ్లుతున్నారు. U టర్న్ తీసుకుంటున్నారు. “బ్లాక్ మనీపై పోరాటం మంచిదే” అని నితీశ్ కుమార్ అప్పుడు తొందరపడి ఆమోదించేశారు. ఇప్పుడు “డిసెంబర్ 30 వరకూ చూసి, పరిస్ధితి సమీక్షించి నా అవగాహన చెబుతాను” అంటున్నారు. “నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ అమలు తీరు బాగోలేదు” అని సి‌పి‌ఐ నేతలు నీళ్ళు నమిలారు. ఇప్పుడు “పేదలకు, కార్మికుల జీవితాలు నాశనం చేశారు” అంటున్నారు. “ఇది చేయమని ఎప్పటి…

అవున్నిజం, మోడి గంగ అంత నిర్మలుడు!

భూకంపం పుట్టిస్తానన్న రాహుల్ గాంధీ అన్నంత పని చేయలేకపోయారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో బహిరంగ సభ జరిపి ఆయన పాల్పడిన వ్యక్తిగత అవినీతి గురించి చెప్పడం ద్వారా ఎన్నడో చేయాల్సిన పనిని కనీసం ఇప్పుడన్నా చేశారు. గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రధాన మంత్రి సొంత జిల్లా మెహసానాలో ఆయన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి, ముఖ్య మంత్రిగా…

టర్కీలో రష్యా రాయబారి హత్య -ఫోటోలు

సిరియాను దురాక్రమించిన టెర్రరిస్టులపై పోరాటంలో సిరియా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు రష్యా దుష్ఫలితాల్ని అనుభవిస్తోంది. సిరియా కిరాయి తిరుగుబాటులో సొంత సైనిక అధికారులను, కొద్ది మంది సైనిక సలహాదారులను కోల్పోయిన రష్యా మొదటిసారి ఒక సివిల్ అధికారిని కోల్పోయింది.  టర్కీలో రష్యా రాయబారిగా పని చేస్తున్న ఆండ్రీ కార్లోవ్ సోమవారం టర్కీ రాజధాని అంకారా లో హత్యకు గురయ్యారు. అంకారాలో ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాక ప్రసంగిస్తున్న కార్లోవ్ పైన దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరిపాడు. నిందితుడిని 22…

ఇంకో తుఘ్లక్ రూల్, డిసెంబర్ 30 లోపు ఒకే డిపాజిట్

భారత జనం పైన మరో తుఘ్లక్ నిబంధన వచ్చిపడింది. ఈసారి ఆర్‌బి‌ఐ చేత అధికారికంగా ఈ రూల్ ని జారీ చేయించారు. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 30 లోపు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఒక్కసారే ఉంటుంది. డిపాజిట్ చేసే సొమ్ము రు 5,000 గానీ అంతకు లోపు గానీ ఉంటే బ్యాంకు వాళ్ళు నిన్ను ఏమీ అనరు. 5,000 కు పైన ఉంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతటితో అయిపోలేదు.…

నోట్ల రద్దు: అడుక్కుంటున్న విదేశీ టూరిస్టులు -వీడియో

విదేశీ టూరిస్టులకు డీమానిటైజేషన్ శరాఘాతం అయింది. ముఖ్యంగా నోట్ల రద్దు ప్రకటించిన రోజుకు అటూ ఇటూ రోజుల్లో ఇండియాలో చారిత్రక స్ధలాలు చూద్దామని వచ్చిన టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో ఉన్న 500, 1000 నోట్లు చిత్తు కాగితాలు అయ్యాయి. బ్యాంకులో మార్చుకోవడానికేమో వారి వద్ద ఆధార్ లాంటి భారతీయ గుర్తింపు కార్డులు లేవు. ఉన్న చిల్లర డబ్బులతో (100, 50, 10 మొ.నవి) జరిగినంత కాలం గడిపారు. ఇక జరగడం ఆగిపోయాక ఎటూ పాలుపోక…

డీమానిటైజేషన్ & రీమానిటైజేషన్ -కార్టూన్

రీమానిటైజేషన్ (ఆర్ధిక వ్యవస్ధ లోకి కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ) కు అట్టే సమయం పట్టబోదని నిన్న (లేకపోతే మొన్న) ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చేశారు. ఎప్పటిలాగానే ఆయన హామీలో వివరాలు ఏవీ లేవు. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ “70 రోజుల వరకూ ఆగాలి” అని స్వయంగా చెప్పాడు. అంతకు ముందు రోజు (డిసెంబర్ 13 న) ఇంకా 15 రోజులు ఆగాలి అని చెప్పి…

అలెప్పోలో ఆల్-ఖైదాకు సాయం చేస్తున్న అమెరికా మిలట్రీ పట్టివేత

గత ఆరేళ్లుగా సిరియా ప్రభుత్వం చెబుతున్నదే నిజం అయింది. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నది సిరియన్లు కాదనీ, సౌదీ అరేబియా, కతార్, టర్కీలు ఇతర ముస్లిం దేశాల నుండి సమీకరించిన టెర్రరిస్టులను తమ దేశంలోకి ప్రవేశపెట్టి కృత్రిమ తిరుగుబాటు సృష్టించాయని వారికి అమెరికాతో సహా వివిధ పశ్చిమ దేశాల మిలట్రీ సలహాదారులు శిక్షణ ఇస్తున్నాయని, సిరియాలో తిష్ట వేసి టెర్రరిస్టులను నడిపిస్తున్నారని సిరియా ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. అలెప్పో నగరంలో బంకర్లలో దాగిన అమెరికా,…