ఫాలక్ తల్లి మున్నీని కాపాడిన పోలీసులు, తల్లిని చేరనున్న ఫాలక్

వళ్లంతా కొరికిన గాయాలతో, ఎముకలు విరికిన చేతులు కాళ్ళతో, గాయపడిన మెదడుతో ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల ‘ఫాలక్’ తల్లి ‘మున్నీ ఖాటూన్’ ను ఢిల్లీ పోలీసులు రాజస్ధాన్ వ్యభిచార గృహం నుండి రెండు రోజుల క్రితం రక్షించారు. మున్నీ పెద్ద కూతురు మూడేళ్ల పాపను కూడా కాపాడిన పోలీసులు తల్లీ కూతుళ్లను ఒక చోటకి చేర్చగలిగారు. అయితే మున్నీ, తన చిన్న కూతురు ఫాలక్ ను మాత్రం ఇంకా కలవ వలసి ఉంది.…

ఢిల్లీ బాలిక ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

వొళ్లంతా కొరికిన గాయాలతో పాటు, చిట్లిన కపాలం, విరిగిన కాలి, చేతి ఎముకలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ‘ఫాలక్’ (ఆకాశం) గా ఆసుపత్రి సిబ్బంది పేరు పెట్టిన పాపను జనవరి 18 తేదీన పద్నాలుగేళ్ల బాలిక ‘పాపకు తానే తల్లినంటూ’ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చిన సంగతి విదితమే. ముంబై టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ అరెస్టుతో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లేనని…

World nuclear map

అణ్వాయుధాలు: అమెరికా ముందు తన ఇంటిని సరి దిద్దుకోవాలి

అణ్వాయుధాలను భద్రంగా కాపాడుకోవడంలోనూ, సమర్ధవంతమైన భద్రతా చర్యలను చేపట్టడంలోనూ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలైన ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ లాంటి దేశాలకు పాఠాలు చెప్పే అమెరికా ముందు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా లేని సంగతిని పట్టించుకోవాలని అమెరికా ప్రభుత్వ ఏజన్సీ నివేదిక తలంటింది. పాకిస్ధాన్ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ, భారత దేశానికి అణ్వాయుధాలు భద్రపరుచుకునే పరిజ్ఞానం లేదనీ, అణ్వాయుధాలే లేని ఇరాన్ అణ్వాయుధాల వల్ల ప్రపంచ భద్రతకే…

అగ్నిపధ్ సినిమా స్ఫూర్తితో టీచర్ ని పొడిచా

అగ్నిపధ్ సినిమాలో హీరోని స్ఫూర్తిగా తీసుకుని తన టీచర్ ని కత్తితో పొడిచానని చెన్నై లోని ఓ పాఠశాలలో టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి తెలిపినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం విద్యార్ధి ఇటీవలే ‘అగ్నిపధ్’ సినిమా చూశాడు. సినిమాలో హీరో తన తండ్రిపైన తప్పుడు ఆరోపణలు చేసినవారిని కత్తితో పొడిచి చంపి పగ తీర్చుకుంటాడు. ఈ దృశ్యం నుండే తాను స్ఫూర్తి పొందానని విద్యార్ధి పోలీసులకు తెలిపాడు. విద్యార్ధి…

టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి టీచర్ ని కత్తితో పొడిచి చంపిన దారుణం తమిళనాడులోని ఓ ప్రవేటు స్కూల్ లో చోటు చేసుకుంది. ‘స్ట్రిక్ట్ టీచర్’ గా పేరుపొందిన నలభై యేళ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఉమా మహేశ్వరి విద్యార్ధుల చదువు గురించి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. చెన్నైలోని ఆర్మేనియన్ స్ట్రీట్ లో గల ప్యారీస్ కార్నర్ లో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. గత పది…

Gujrat-riots

నరేంద్ర మోడి కి ఊరట?

గుజరాత్ మత మారణకాండలో ‘హిందూ మూకల’ దాడిలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి ఎహ్‌సాన్ జాఫ్రీ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించినట్లు తెలుస్తోంది. మోడి తో పాటు మరో అరవై మందిపైన ‘విచారించదగిన సాక్ష్యాలు’ ఏవీ లభించలేదని సుప్రీం కోర్టు నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ తన అంతిమ నివేదికలో తెలిపినట్లుగా, విశ్వసనీయ వర్గాలను’ ఉటంకిస్తూ ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది. ముస్లిం ప్రజలపై మారణ కాండకు పూనుకున్న హిందూ మూకలను చూసీ చూడనట్లు వదిలివేయాలంటూ…

Porn-ministers

‘నీలి వీడియో’ మంత్రుల రాజీనామా

సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే మొబైల్ ఫోన్ లో ‘నీలి వీడియో’ లు చూస్తూ పట్టుబడిన ముగ్గురు కర్ణాటక మంత్రులు రాజీనామా చేసారు. తాము ‘స్వచ్ఛంధంగానే’ రాజీనామా చేసామని సదరు మంత్రులు పత్రికలకు తెలిపారు. మంత్రులు స్వచ్ఛంధంగానే రాజీనామా చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా తెలిపాడు. రాజీనామా చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏమి చెబుతున్నప్పటికీ రాజీనామా చేయడానికి మంత్రులు నిరాకరించినట్లుగా పత్రికలు బుధవారం వార్తలు ప్రచురించాయి. బి.జె.పి సారధి నితిన్ గడ్కారీ ఎట్టి పరిస్ధితుల్లోనూ మంత్రులు రాజీనామా…

జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు

జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో…

Austerity and unemployment

పన్నులు కోతలు వెరసి నిరుద్యోగం -కార్టూన్

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే. ప్రజలపై వీరు రుద్దే క్రమ…

Descipline in China, India

చైనా, ఇండియాల్లో క్రమశిక్షణ -ఫొటో

(ఫేస్ బుక్ నుండి సేకరణ) ఈ ఫొటో ప్రచురణ చైనాని గొప్ప చేయడానికీ కాదు, ఇండియాని తక్కువ చేయడానికీ కాదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వివిధ అవసరాల కోసం జనం కూడే ఇతర ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు పడుతూ, ముందున్న వారిని నెట్టివేస్తూ తానే ముందుకు చేరాలన్న ఆత్రుతలో, తమ దాకా రాదేమో అన్న ఆందోళనతో ఉన్నపుడు, సాధారణంగా ఇటువంటి పరిస్ధితులు కనిపిస్తుంటాయి. అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ…

‘పావెల్ పుహోవ్’ వీధి చిత్రాలు -ఫొటోలు

రష్యా దేశానికి చెందిన వీధి చిత్రకారుడు ‘పావెల్ పుహోవ్’ గీసిన వీధి చిత్రాలివి. వీధి చిత్రకారులకి ప్రత్యేకంగా నిర్ధిష్టమైన కాన్వాస్ అంటూ పరిమితి లేకపోవడంతో వారి సృజనాత్మకతకు కూడా హద్దులు ఉండనట్లు కనిపిస్తోంది. ఓ కరెంటు స్తంభం ఆధారం చేసుకుని కళ్లజోడుని సృష్టించిన చిత్ర కారుడి సృజనను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. – –

Occupy white house

రీ-ఆకుపై వాల్‌స్ట్రీ… సారీ, వైట్‌హౌస్

ఈ సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా గెలుపొందడం కోసం ఒబామా వేషాలు పునః ప్రారంభమయ్యాయి. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ధనికులు పై పన్నులు పెంచుతాననిక్, వారి పన్ను రాయితీలు రద్దు చేస్తానని నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ఒబామా తన వాగ్దానాలను అమలు చేయలేదు. తిరిగి అవే వాగ్దానాలను చేయడానికి ఒబామా సిగ్గుపడకపోవడమే ఆశ్చర్యం. – –

పాకిస్ధాన్ విభజనపై అంబేద్కర్, గోల్వాల్కర్ అభిప్రాయాలను పోల్చతగదు

ముస్లింల గురించి ఆర్.ఎస్.ఎస్ గురువుగోల్వాల్కర్ చెప్పిన అంశాలను ఉటంకిస్తూ ఈ బ్లాగ్ లో ఒక పోస్టు ప్రచురితమయ్యింది. ఆ పోస్టు కింద అంతర్యానం గారు ఓ వ్యాఖ్య రాసారు. అదియధాతధంగా ఇలా ఉంది. వి. శేఖర్ గారు – “థాట్స్ ఆన్ పాకిస్తాన్” అనే పుస్తకంలో అంబేద్కర్ అంటారు “…..దేశవిభజనతోపాటు మహమ్మదీయులందరినీ పాకిస్తాన్ పంపాలి. పాకిస్తాన్ లోనిహిందువులను, బౌద్ధులను భారతదేశానికి తరలించాలి. టర్కీ, గ్రీసు దేశాలలో ఇదిజరిగింది. తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగాభావించడం…

గ్రీసు బడ్జెట్ ఇ.యు చేతికివ్వాలి, జర్మనీ దుర్మార్గం

గ్రీసు బడ్జేట్ రూపకల్పనను కూడా యూరోపియన్ యూనియన్ నియంత్రణకి అప్పజెప్పాలన్న దుర్మార్గమైన ప్రతిపాదనను జర్మనీ ముందుకు తెచ్చింది. ఇప్పటికే గ్రీసు దేశ బడ్జెట్ తో పాటు అక్కడి ఆర్ధిక కలాపాలనన్నింటినీ పెద్ద ఎత్తున గుప్పిట్లో పెట్టుకున్న యూరోపియన్ యూనియన్ ఇకనుండి నేరుగా బడ్జెట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇ.యుకి అధికారం ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. పేరుకి జర్మనీ ప్రతిపాదన అయినప్పటికీ, యూరోపియన్ యూనియన్ దేశాల్లోని బహులజాతి ప్రవేటు కంపెనీలే జర్మనీ ద్వారా ఈ ప్రతిపాదనను…