బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్

కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం…

మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…

Seventeen-year-old prostitute Hashi talks to a customer as Maya waits to get a customer

ఆకలికమ్ముడుబోయిన అపరంజి బొమ్మలు -ఫొటోలు

మానవత్వం పెదవిపైన మాసిన చిరు నవ్వులు మనసులేని కౌగిలిలో నలిగిపడిన పువ్వులు బుసకొట్టే కామాగ్నికి విసిరేసిన సమిధలు కొడిగట్టిన జీవంతో మిణుకుమనే ప్రమిదలు వసివాడని బాల్యంతో కసి తీర్చే దేహాలు వలువులు విడిచిన విలువల సాక్ష్యాత్కారాలు చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకు రెమ్మలు నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు కసి దాగిన, కలతల కాగిన జీవచ్ఛవాలు ఎవరు వీరు? ఎవరు వీరు? మనం జారవిడుచుకున్న మన జాతి పరువులు మనిషి జారవిడిచిన మానవ జాతి విలువలు ఈ…

Jobs and wars

ఉద్యోగాలు, యుద్ధాలు -కార్టూన్

దురాక్రమణ యుద్ధాలవల్ల ఆర్ధిక వ్యవస్ధలు కులారిల్లుతున్నప్పటికీ, అవే యుద్ధాల వల్ల కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పరిస్ధితి ఉంది. యుద్ధాలు చేసి దురాక్రమించి ప్రపంచ వనరులు గుప్పెట్లో పెట్టుకోవడం పశ్చిమ దేశాల ‘మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ దురాశ కాగా, యుద్ధాలకు ఎదురొడ్డి నిలిచే శక్తుల వల్లా, యుద్ధోన్మాదుల అదుపులో లేకుండా పోయే యుద్ధ ఖర్చుల వల్లా ఆర్ధిక సంక్షోభాలు అనివార్యంగా ఎదురవుతున్న పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో నిరుద్యోగ సైన్యానికి ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతున్నా, యుద్ధాలు మాత్రం…

ఖమ్మం స్కూల్ బస్ కాలవలో పడి 14 మంది పిల్లల మృతి

ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్సు కాలవలో పడిపోవడంతో 14 మంది స్కూల్ పిల్లలు చనిపోయారని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం 40 మంది పిల్లలు దుర్ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. కొత్త గూడెం మండలం లో ఎల్.వి.రెడ్డి స్కూల్ కి చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడిందని ఎన్.డి.టి.వి తెలిపింది. గాయపడిన 18 మంది పిల్లలను ఆసుపత్రిలో…

ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు

తన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన…

ఇద్దరు స్త్రీలను రేప్ చేసి తర్వాత హత్యాకాండ జరిపారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

హత్యాకాండ జరిగిన రాత్రి అమెరికా సైనికులు జరిపిన అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా సైనికులు హత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి అనంతరం హత్యాకాండ జరిపారని పార్లమెంటరీ విచారణ కమిటీ సభ్యులు, శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో ప్రకటించారు. హత్యాకాండలో చనిపోయిన నలుగురు స్త్రీలలో రేప్ కి గురికాబడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారని కమిటీ సభ్యులు పార్లమెంటుకి తెలియజేశారు. జంగాబాద్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని మందుపాతరతో పేల్చివేసినందుకు ప్రతీకారంతోనే అమెరికా సైనికులు ఈ…

20 మంది అమెరికా సైనికులు హత్యాకాండలో పాల్గొన్నారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

మార్చి 12 తెల్లవారు ఝామున, కాందహార్ సమీప గ్రామాల్లో ఆఫ్ఘనిస్ధాన్ పౌరులపై జరిపిన హత్యాకాండలో 20 మంది వరకూ అమెరికా సైనికులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటరీ విచారణా కమిటీ తేల్చింది. ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన పార్లమెంటరీ విచారణ కమిటీ హత్యా కాండ బాధిత గ్రామాలను సందర్శించి వాస్తవాలు సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. హామీద్జాయ్ లాలి, అబ్దుల్ రహీమ్ ఆయుబి, షకీబా హష్మి, సయ్యద్ మహమ్మద్ ఆఖుండ్, బిస్మిల్లా ఆఫ్ఘన్మాల్, షకీలా హష్మి…

Perfect war

పక్కా యుద్ధం (Perfect war) -కార్టూన్

– “పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు” – ‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై…

రైలు ఛార్జీల పెంపుదల మమత కి ముందే తెలుసు -ఎన్.డి.టి.వి

తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు…

అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్

ఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’  అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న”…

శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…

Agri labour

‘ఉపాధి హామీ పధకం’ కి బడ్జెట్ లో నిధుల కత్తిరింపు

ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…

వంద సెంచరీల సచిన్ -ఫొటోలు

మార్చి 16 2012 తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం భారత క్రికెట్ ప్రేమికులు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ వందవ సెంచరీ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక అందించిన ఫొటోలు ఇవి. – –