నిరుద్యోగంతో తల్లిదండ్రుల చెంత చేరుతున్న అమెరికా యువత -కార్టూన్లు

స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని  “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది. అమెరికా ఆర్ధిక మాంధ్యం…

మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం

గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…

వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం

ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటి వరకు 7,000 కు పైగా టాట్రా ట్రక్కులను ఆర్మీ కోనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. వీటిని ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్ధితి ఆర్మీకి ఏర్పడిందని చెప్పాడు. అంతకంటే సామర్ధ్యం కలిగిన ట్రక్కులు…

నా లేఖ లీక్ చేయడం మహా ద్రోహం -ఆర్మీ చీఫ్

ప్రధానికి రాసిన లేఖను తానే లీక్ చేశాడని ఆరోపిస్తూ, ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ని పదవి నుండి తప్పించాలని ప్రతి పక్ష పార్టీలు ఓ వైపు డిమాండ్ చేస్తుండగానే ‘తన లేఖను లీక్’ చేసినవారిని జాలి, దయ లేకుండా శిక్షించాలని వి.కె.సింగ్ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. ప్రధాన మంత్రికి అత్యంత రహస్యంగా తాను రాసిన లేఖను లీక్ చేయడం ‘మహా ద్రోహం’ (high treason) గా వి.కె.సింగ్ అభివర్ణించాడు. “లేఖను లీక్ చేయడాన్ని మహా ద్రోహంగా…

బక్కచిక్కుతున్న అమెరికా మధ్య తరగతి -కార్టూన్లు

అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ‘సోషలిస్టు వ్యవస్ధ’. అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధే అయినా రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయ్యాక ఏర్పడిన సోషలిస్టు వ్యవస్ధలు అమెరికా, యూరప్ లలో సో కాల్డ్…

బానిసకొక బానిసకొక బానిస ఆఫ్ఘన్ మహిళ

తాలిబాన్ మత ఛాందస ప్రభుత్వ అణచివేత నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేస్తామని బీరాలు పలికిన అమెరికా, తన పదేళ్ళ దురాక్రమణలో సాధించిందేమీ లేదని మానవ హక్కుల సంస్ధ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక వెల్లడించింది. కుటుంబ హింస భరించలేక ఇంటి నుండి పారిపోయినా, భర్త అనుమానంతో పదే, పదే స్క్రూ డ్రైవర్ తో కుళ్ళ బొడిచినా ‘నైతిక నేరానికి’ పాల్పడ్డారంటూ మళ్ళీ స్త్రీలనే ఆఫ్ఘన్ ప్రభుత్వం జైళ్ళలో పెడుతున్నదని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తెలిపింది. ఎన్ని హింసలు…

అమెరికాలో ఇజ్రాయెల్ ఉత్పత్తుల బహిష్కరణ

పాలస్తీనా ప్రజలపై జాత్యహంకార  ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని బ్రూక్లీన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. పాలస్తీనీయుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ ఉత్పత్తులను వాడ కుండా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. ‘పార్క్ స్లోప్ ఫుడ్ కోఆపరేటివ్’ అనే సహకార సంస్ధలో సభ్యులైన వేలాది సభ్యులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. బ్రూక్లీన్ టెక్నికల్ హైస్కూల్ దగ్గర సమావేశం అయిన వీరు ఏక గ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ టి.వి తెలిపింది. “మేము ఈ బాయ్…

బొలీవియాలో ఆయుధాలతో పట్టుబడిన అమెరికా ఎంబసీ కారు

దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో అమెరికా ఎంబసీ కి చెందిన కారు పేలుడు ఆయుధాలతో పట్టుబడిందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ వెల్లడించింది. ఈశాన్య బొలీవియాలోని ‘ట్రినిడాడ్’ పట్టణంలో మంగళ వారం జరిగిన ఈ ఘటనను ‘జాతీయ భద్రత’ కు సంబధించిన అంశంగా బొలీవియా హోమ్ మంత్రి కార్లోస్ రొమేరో వ్యాఖ్యానించాడు. మూడు షాట్ గన్ లు, ఒక రివాల్వర్, రెండు వేల బులెట్ కాట్రిడ్జ్ లతో సహా మరి కొన్ని పేలుడు పదార్ధాలు అమెరికా ఎంబసీ కారులో…

US economy

విదేశాల్లో కుట్రలు, స్వదేశంలో నిరుద్యోగం -కార్టూన్

– బారక్ ఒబామా: మనం బడా టెర్రరిస్టులని తుడిచి పెట్టాం. అరబ్ ప్రజాస్వామిక ఉద్యమాలు పెరగడానికి సాయపడ్డాం. ఇరాక్ కి ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనీ ప్రసాదించాం… అమెరికా పౌరుడు: గుడ్ జాబ్. మారి నా ఉద్యోగం సంగతేంటి? అదీ సంగతి! పాకిస్ధాన్ అనుమతి లేకుండా, ఆ దేశం గగనతలం లోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పిన ఒబామా ఇంతవరకూ అతని శవాన్ని కూడా చూపలేదు. తమ అనుకూల ఎన్.జి.ఒ సంస్ధల సాయంతో నియంతృత్వం ప్రభుత్వాలపై…

ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు

లైంగిక అత్యాచారాలకు పాల్పడి ప్రపంచ స్ధాయిలో పేరు పొందిన రాజకీయవేత్తలు వీళ్లు. ఈ ఫొటోలను ఫస్ట్ పోస్ట్ అందించింది. ఆయా దేశాలలో ఉన్నత పదవులను అధిష్టించినవారు తమ తమ దేశాల్లోని ఉన్నత సాంస్కృతిక విలువలకు అద్దం పట్టేలా జీవించాలి. ఆయా దేశాల జీవన విధానాలకు అద్దం పట్టడమే కాక మొత్తం ప్రపంచ స్ధాయి విలువలను కూడా వీరి ప్రతిబింబించాల్సి ఉంటుంది. మానవ నాగరికతలో కుటుంబ జీవనానికి అత్యున్నత రూపం అయిన మోనోగమీ (ఒక భర్తకు ఒకే భార్య)…

‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్

ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ “స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” (Free Market Economy) వైపు నడిపించడానికి శ్రమించే ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ధ’ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మాజీ అధినేత, ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’, ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్సు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి లక్ష యూరోల బెయిల్ పై ఉన్న స్ట్రాస్ కాన్, విచారణలో పాల్గొంటున్నవారితోనూ, మీడియాతోనూ మాట్లాడరాదన్న షరతులను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ…

1989; Sachin Tendulkar

సచిన్ హెయిర్ స్టైల్స్ ఇలా మారుతూ వచ్చాయి -ఫొటోలు

రింగుల జుట్టుతో భారత క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాదాపు టార్జాన్ హెయిర్ స్టయిల్ లాంటి పొడుగు జుట్టు తో కనిపిస్తున్నాడు. వివిధ దశల్లో అతని హెయిర్ ఎలా రూపం మారుతూ వచ్చిందో చూపుతున్న ఈ ఫొటోల్ని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక ప్రచురించింది. –

అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…

లంచం ఆరోపణలపై చర్య తీసుకోడానికి ఆర్మీ చీఫ్ ఇష్టపడలేదు -రక్షణ మంత్రి

మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణల వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. లంచం విషయం తనకు చెప్పినపుడే చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కి సూచించాననీ, అయినా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనీ, “ఆ విషయంలో మరింత ముందుకెళ్ళాలనుకోవడం లేద”ని ఆర్మీ చీఫ్ తనతో అన్నాడనీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని రాజ్య సభలో ప్రకటించాడు. ఆ సమయంలో లంచం విషయంలో మరింత…

Obama-Decorations

అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను…