ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…

pacific competition

పసిఫిక్ లో అమెరికా, చైనా పోటీ -కార్టూన్

సాపేక్షికంగా చూస్తే చైనా ఇప్పుడు ప్రపంచంలో ప్రధానమైన ఆర్ధిక శక్తి. జిడిపి లో అమెరికా తర్వాత స్ధానం చైనాదే. చాలా తక్కువ కాలంలో అది ఈ స్ధానం చేరుకుంది. చైనాకు విదేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినవే. చైనా విదేశాంగ విధానం ప్రో యాక్టివ్ కాదు. మిలట్రీ చర్యలు తీసుకునైనా వాణిజ్య సంబంధాలు కాపాడుకునే విదేశాంగ విధానం చైనా రూపొందించుకోలేదు. కాని అమెరికా అలా కాదు. దాని విదేశాంగ విధానం పూర్తిగా జోక్యం దారీ విధానమే.…

సిరియాలో కాల్పుల విరమణ ప్రారంభం

సిరియాలో కాల్పుల విరమణ ప్రారంభం అయిందని బీబీసి తెలిపింది. సిరియా ప్రభుత్వం తన సైన్యాన్ని ఉద్రిక్త నగరాలనుండి ఉపసంహరించుకున్నదని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు సిరియా సైనికులు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. టెర్రరిస్టులు ప్రజలపైనా, ప్రజల ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు దాడులు ప్రారంభించినట్లయితే తగిన విధంగా బదులు చెప్పకుండా ఉండబోమని సిరియా ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు సిరియాలో ఇక ప్రజలు ఉవ్వెత్తున ఆందోళనలు చేపట్టాలని ప్రవాస…

చపల చిత్తమా, సృజన చిత్తమా ఈ కళాకృతులు? -ఫొటోలు

“బ్రెజిల్ కళాకారుడు ‘హెన్రిక్ ఒలివీరా’ కి తన కళను ప్రదర్శించే గ్యాలరీల గోడలంటే ఏ మాత్రం గౌరవం లేనట్టుంది. లేకుంటే తన బుర్రను చీల్చుకు వచ్చిన అవుడియాల కోసం ఈ రకంగా గోడల్ని చీల్చేస్తాడా? తన చిత్తానికి తగ్గట్లు మెలికలు తిరుగుతూ నేలనీ, గోడల్నీ, పై కప్పుల్నీ తొలిచేలా  చెట్లను శాసించడానికి ఈయనకి మానవతీత శక్తులేవో ఉన్నట్లున్నాయి మరి.” ఒలివీరా ‘సావొ పోలో’ లో విద్యార్ధిగా ఉన్నపుడు తన గది బయట ప్లై వుడ్ తో చేసిన…

అమెరికా యుద్ధ నౌకల్ని మేం ఫోటోలు తీశాం -ఇరాన్

ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ లు ఆకాశం నుండి ఫోటోలు తీసాయని బ్రిగేడియర్ జనరల్ ఫర్జాడ్ ఎస్మాయిల్ మంగళవారం ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. ఇరాన్ గగన తాళంలోకి జొరబడి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా డ్రోన్ విమానాన్ని గత…

ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతిలో చనిపోయింది

తండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మూడు నెలల పాప అఫ్రీన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరిన అఫ్రీన్ బుధవారం గుండే ఆగి చనిపోయింది. అబ్బాయి కోసం చూస్తే అమ్మాయి పుట్టిందనీ, అందుకే హత్యా ప్రయత్నం చేశాననీ తండ్రి ఉమర్ ఫరూక్ పోలీసుల వద్ద అంగీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. తన పాప ప్రాణాలు నిలుస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న 19 సంవత్సరాల…

ఇండోనేషియాలో 8.7 భూకంపం, సునామీ హెచ్చరిక

ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ద తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా ఏ వార్తా సంస్ధ ప్రకటించలేదు. ‘ఎర్త్ క్వేక్ రిపోర్ట్’ వెబ్ సైట్ అందించిన శాటిలైట్ పటాన్ని కింది చిత్రంలో చూడవచ్చు. మొదట భూకంప…

Modi not guilty

మోడీకే పాపమూ తెలియదట -కార్టూన్

సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ కనిపించలేదట. నెలల తరబడి సాగిన మానవ హననంలో పసి పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అత్యంత పాశవికంగా హత్యలకు గురయినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూచుంది. అయినా రాష్ట్ర ముఖ్య మంత్రికి…

vandemaataram

“వందే మాతరం” -చెరబండరాజు కవిత

(యు.పి లో ఒకే రోజు జరిగిన నాలుగు అత్యాచారాల విషయమై రాసిన పోస్టు కి రాజశేఖర రాజు గారు అద్భుతమైన స్పందన పోస్ట్ చేసారు. ప్రముఖ విప్లవ కవి ‘చెరబండ రాజు’ రాసిన కవితను సందర్భ శుద్దిగా ప్రస్తావించిన రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యని యధా విధిగా ఇస్తున్నాను. చెరబండరాజు కవితకి ఇప్పటికీ ఎంత ప్రాధాన్యం ఉన్నదో కవిత చదివితే ఇట్టే అర్ధం అవుతుంది. దేశ భక్తి పరులు నిజంగా ఆలోచించవలసిన అంశాలు ఈ…

ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

మార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఫుకుషిమా ప్రమాదం…

Too-Big-To-Jail

వాల్ స్ట్రీట్: టూ బిగ్ టు జెయిల్ -కార్టూన్

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు. పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దుతూ తాత్కాలికంగా సంక్షోభాన్ని కార్మిక వర్గంపైకి నెట్టేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు మళ్లీ లాభాలు పుంజుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా బక్క చిక్కే ఉన్నాయి. ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి అమెరికా, యూరప్ ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ ను బయటపడేశాయి. కాని అత్యాశతో అనేక అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, చట్టాలను తుంగలో తొక్కిన బడా…

భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…

యు.పి: ఒకే రోజు నాలుగు రేప్ లు, మూడేళ్ళ పాపతో సహా

ఉత్తర ప్రదేశ్ లో ఒకే రోజు నాలుగు రేప్ కేసులు పోలీసులని చేరాయి. ఒక దళిత బాలిక, మూడేళ్ళ పాప వారిలో ఉన్నారు. రేపిస్టులు తాము చెయ్యదలుచుకున్నది చేసి బాధితులను నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలి పెట్టారు. పదేళ్ళ బాలికను అతని మేనమామతో సహా నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. సామూహిక మానభంగానికి గురయిన దళిత బాలిక ఫిర్యాదుని స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. రెండు రోజులు తిప్పుకున్న తర్వాత మాత్రమే ఫిర్యాదు నమోదు చేశారు. ఝాన్సీ లో ఓ…

14 వ సారి పేలిపోయిన ఈజిప్టు-ఇజ్రాయెల్ ఆయిల్ పైప్ లైను

ఈజిప్టు ప్రజలు మరోసారి తమ దేశం నుండి ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేసే పైప్ లైన్ ను పేల్చేశారు. అమెరికా బలవంతంతో మార్కెట్ ధరల కంటే తక్కువకు తమ బద్ధ శత్రువుకి ఆయిల్ సరఫరా చేయడాన్ని వారు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామిక తిరుగుబాటు ఫలితంగా నియంత హోస్నీ ముబారక్ గద్దె దిగాక ఇప్పటికీ 13 సార్లు ఆయిల్ పైప్ లైన్ ను పేల్చేశారు. హోస్నీ బుమారక్ ను గద్దె  దింపినప్పటికీ అమెరికా కు అనుకూలమైన మిలట్రీ…

గంటర్ గ్రాస్ ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ గా ప్రకటించిన ఇజ్రాయెల్

ప్రఖ్యాత జర్మన్ రచయిత గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ ‘పర్సనా నాన్ గ్రాటా’ (ఆహ్వానించ దగని వ్యక్తి) గా ప్రకటించింది. తద్వారా తన జాత్యహంకార బుద్ధిని బహిరంగంగా చాటుకుంది. పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకుని సెటిల్ మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాన్నీ, పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉంటూ ఇరాన్ అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబు దాడులు చేస్తామని ప్రకటించడాన్నీ గంటర్ గ్రాస్ తన కవిత ద్వారా విమర్శించడమే నేరంగా ఇజ్రాయెల్ పరిగణిస్తున్నది. “What Must…