ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…

టెర్రరిజం సాకుతో ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేస్తున్నారు -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారనీ, ఆఫ్ఘన్ జాతీయులను తమ జైళ్ళలో అక్రమంగా నిర్భంధిస్తున్నారనీ అమెరికా తో పాటు దాని మిత్ర దేశాలు కూడా యధేచ్ఛగా దుర్మార్గాలు సాగిస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించాడు. 2014 తర్వాత కూడా మరో…

మహిళని అరవై వేలకి అమ్మేసి, రక్షించబోయిన పోలీసుల్నీ కొట్టి…

రెండు ఉత్తర భారత రాష్ట్రాలలో జరిగిన ఘాతుకం ఇది. భర్త చనిపోయిన మహిళను అరవై వేల రూపాయలకి అమ్మడమే కాక ఆమెని కాపాడడానికి వెళ్ళిన సోదరుడినీ తన్ని తరిమేశారు. అనంతరం ఆమెని కాపాడడానికి వెళ్ళిన పోలీసు బృందాన్ని కూడా కొట్టి తరిమారు. ఇపుడు మరో పోలీసు బృందాన్ని పంపుతున్నామని మధ్య ప్రదేశ్ లోని జిల్లా ఎస్.పి చెప్పాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను ముగ్గురు వ్యక్తులు రాజస్ధాన్ లోని ఓ గ్రామస్ధునికి అమ్మేశారు. అమ్మిన ముఠాలో…

అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందే దాడులు చేస్తాం–రష్యా

యూరోప్ లో అమెరికా నెలకొల్పుతున్న మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందుగానే (pre-emptive) దాడులు చేయడానికి వెనకాడబోమని రష్యా మిలట్రీ అధికారులు హెచ్చరించారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న వివాదాస్పద ‘మిసైల్ షీల్డ్’ విషయంలో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో తమ ఖండాతర క్షిపణులు కాపాడుకోవడానికి, రష్యా ప్రయోజనాలు భంగం కలగకుండా ఉండడానికి ‘ప్రీ-ఎంప్ టివ్’ దాడులు తప్ప తమకు మరో మార్గం లేదని వారు అన్నారు. అయితే అమెరికా మిసైల్ షీల్డ్ కి రష్యా…

UP' congress debacle

రాహుల్ ప్రసక్తి లేని యు.పి కాంగ్రెస్ ఓటమి సమీక్ష -కార్టూన్

యు.పి లో కాంగ్రెస్ ఓటమిని సమీక్షించడానికి ఎ.కె.ఆంటోని, షీలా దీక్షిత్, సుశీల్ కుమార్ షిండే లతో కాంగ్రెస్ నియమించిన కమిటీ, నివేదికను పూర్తి చేసినట్లు పత్రికలు తెలిపాయి. యు.పి ఎన్నికలకు చాలా ముందు నుండె ప్రచారంలోకి దూకిన రాహుల్ గాంధీ ప్రసక్తి లేకుండానే కమిటీ తన నివేదికను పూర్తి చేసినట్లు అవి తెలిపాయి. సరైన అభ్యర్ధులకి టిక్కెట్లు ఇవ్వకపోవడం, అవినీతిపై ప్రజల దృక్పధం, అధిక ధరలు, వివాదాస్పద ప్రచారం కాంగ్రెస్ ఓటమికి కారణాలని కమిటీ నివేదించిందని తెలుస్తోంది.…

క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…

సచిన్ రాజ్య సభ్యత్వం వెనుక కాంగ్రెస్ కుట్ర -కార్టూన్

సచిన్ టెండూల్కర్ కి  రాష్ట్ర పతి కోటాలో రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ కి మోసపూరిత ఉద్దేశ్యాలున్నాయని బాల్ ధాకరే ఆరోపించాడు. బాల్ ధాకరే ఆరోపణలకు ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఇచ్చిన కార్టూన్ రూపం ఇది. కాంగ్రెస్ కి ఏ ఉద్దేశ్యాలున్నాయో ఏమో గాని రాజకీయ చదరంగంలో సచిన్ ఒక పావుగా మారే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరో పక్క రాజ్య సభ సభ్యత్వం స్వీకరించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రాబోనని సచిన్…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…

ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి

ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని నాలుగేళ్లపాటు దొంగిలించిన గూగుల్ సంస్ధను అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్.సి.సి) కేవలం $25,000 పెనాల్టీతో వదిలిపెట్టింది. తనకు తెలియకుండా జరిగిందని పదే పదే అబద్ధాలు చెప్పినా గూగుల్ ‘బందిపోటు దోపిడి’ ని లైట్ తీసుకుంది. వేరే అవసరం కోసం రాసిన ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ లో కలిసిందని పచ్చిగా నాటకాలాడినా ‘మరేం ఫర్వాలేదు’ పొమ్మంది. కార్పొరేట్ కంపెనీలు, ఫెడరల్ రెగ్యులేటర్ సంస్ధలు ఒకరినొకరు సహరించుకుంటూ అమెరికా ప్రజలను నిరంతరం…

ఎన్రికా లెక్సీ: ఇటలీ నౌక, సిబ్బంది వెళ్లిపోవడానికి సుప్రీం అనుమతి

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న…

క్లుప్తంగా…. 30.04.2012

జాతీయం లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు “డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని…

క్లుప్తంగా… 29.04.2012

జాతీయం ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన…

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో పెరుగుతున్న కుటుంబ హింస

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో కుటుంబ హింస పెరుగుతోందని పోలీసుల సర్వే తెలియజేసింది. ఆర్ధిక పరిస్ధితులు చట్టాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై అమెరికాకి చెందిన ‘పోలీస్ ఎక్సిక్యూటివ్ రీసెర్చ్ ఫోరం’ రెగ్యులర్ గా సమీక్ష జరుపుతుంది. సర్వేలో ప్రతిస్పందించిన 700 సంస్ధలలో 56 శాతం ‘పూర్ ఎకానమీ’ వల్ల కుటుంబ హింస పెరిగిందని తెలిపాయి. ఇది 2011 సంవత్సరం లోని పరిస్ధితి కాగా 2010 లో 40 శాతం సంస్ధలు సంక్షోభ పరిస్ధితులు కుటుంబ…

సంక్షోభాల్లో సైతం పెట్టుబడిదారుల లాభాలకు కొదవలేదు

2008 ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా కోలుకోనే లేదు. సంక్షోభం పేరు చెప్పి ఓ పక్క కార్మికులు, ఉద్యోగుల వేతనాల్లో విపరీతమైన కోతలు విధిస్తుంటే మరో పక్క కంపెనీనీలు మాత్రం ఎప్పటిలాగా లాభాలు పోగేసుకుంటూనే ఉన్నాయి. బ్రిటన్ లోని టాప్ వెయ్యి మంది ధనికులు రికార్డు స్ధాయిలో 414 బిలియన్ పౌండ్లు కూడ బెట్టారని ‘ది డెయిలీ మోర్నింగ్ స్టార్’ పత్రిక నివేదించింది. ధనికుల సంపాదన పెరగడంతో పాటు, ధనికుల సంఖ్య కూడా పెరిగిందని పత్రిక…