ఇజ్రాయెల్ సందర్శన: పి.వి నాటిన విత్తు మోడి చేతిలో పండైంది! -1
భారత ప్రధాని నరేంద్ర మోడి జులై 4, 5, 6 తేదీల్లో ఇజ్రాయెల్ సందర్శించాడు. మోడీ ఇజ్రాయెల్ సందర్శన లోని ప్రధానమైన అంశం ఆయన యూదు రాజ్యం తప్ప మరే ఇతర దేశానికీ వెళ్లకపోవడం. ముఖ్యంగా పాలస్తీనాకు వెళ్లకపోవడం. ప్రపంచంలో ఏ దేశ పాలకుడైనా ఇజ్రాయెల్ వెళితే పాలస్తీనా కూడా వెళ్ళడం ఆనవాయితీ. లేదా పాలస్తీనా సందర్శిస్తే ఇజ్రాయెల్ కూడా వెళ్ళి అక్కడి పాలకులను కూడా కలిసి వెళతారు. భారత దేశం నుండి రాష్ట్రపతి గానీ ప్రధాని…














