కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…

అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు

భారత దేశంలోనే ప్రముఖ న్యాయ నిపుణుడుగా (జ్యూరిస్టుగా) పేరు ప్రఖ్యాతులు పొందిన ఫాలి నారిమన్ కాశ్మీరు జాతీయుడు అఫ్జల్ గురు ఉరితీత పైన స్పందించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని కడిగేశాడు. అఫ్జల్ కుటుంబానికి సరైన సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరితీసి పాతిపెట్టడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. మానవతకు భారత దేశ సాంప్రదాయంలో అత్యున్నత స్ధానం ఉన్నదని, ఫోన్ చేసి చెప్పగల సమాచారాన్ని స్పీడ్…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -ఈనాడు

ఈనాడు దిన పత్రిక సోమవారం (18-02-2013) నాటి ‘చదువు’ పేజిలో ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ని ప్రచురించింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆర్టికల్ కాపీని కింద ఇస్తున్నాను. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులొ చూడగలరు.) మొదటి భాగం వరకు ఈ రోజు ప్రచురించారు. రెండో భాగాన్ని, తరువాత వచ్చే చదువు పేజిలో (వచ్చే సోమవారం) ప్రచురించనున్నట్లు పత్రిక తెలిపింది. గత సంవత్సరం ఏప్రిల్ 23 తేదీన ఈనాడు పత్రికే ఈ బ్లాగ్ ను తన…

అరేబియా అత్తరులు అన్నీ కలిపి కడిగినా… -జస్టిస్ కట్జు

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను…

తడిమే చేతులు, ఆకలి చూపులు, అసభ్య కూతలు… భయం, భయం…

లైంగిక అత్యాచారాలు గొప్పోళ్ల ఇళ్లకు దూరమా? అంగుళం, అంగుళమూ సంపదలు ఉట్టిపడే పాల రాతి చలువ గోడల మధ్యకు ఆకలి చూపులు చొరబడవా? ఊలు దారాలకు డబ్బు కట్టలు దట్టించి నేసిన మడత నలగని సూటు వెనుక చీకటి అంతరంగాలకు తావు లేదా? వజ్రపుటుంగరాలు, గోల్డెన్‌ రిస్టు వాచీలు ధరించే చేతులు అసభ్య చేష్టలు ఎరుగవా? ప్రపంచ ప్రఖ్యాత సితార్ మేస్ట్రో కూతురుగా పుట్టి తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అనౌష్క శంకర్ చెప్పిన చేదు నిజాలు…

ఆ కుటుంబానికి ఇక వినోదం(దిని) దూరం

ఒక అమ్మాయి జీవితంలో సంతోషం నింప వలసిన ప్రేమ, కాలకూట విషాన్ని విరజిమ్మి చివరికి ఆ జీవితాన్నే బలిగొన్న విషాదాంతం ఇది. ‘ప్రేమ’ రూపంలో వ్యక్తమయిన ‘పురుష దురహంకారం’, వినోదిని తిరస్కారంతో అసలు రంగు వెల్లడించుకుని జడలు విప్పిన ఉన్మత్తంతో ‘యాసిడ్ దాడి’గా ప్రతీకారం తీర్చుకుంది. ఫలితంగా మూడు నెలల పాటు తీవ్ర శారీరక, మానసిక వేదన అనుభవించిన వినోదిని మంగళవారం శాశ్వతంగా కన్నుమూసింది. మెడ, కళ్ళు, చెవులు భాగాలను తీవ్రంగా కాల్చుకుతిన్న యాసిడ్ తన ప్రభావాన్ని…

ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల, మరో మహానది!?

కమల హాసన్ హీరోగా నటించిన మహానది సినిమా గుర్తుందా? సూర్యనెల్లి అత్యాచార బాధితురాలి సుదీర్ఘ న్యాయ పోరాటం కాస్త అటు ఇటుగా ఆ సినిమాను గుర్తుకు తెస్తోంది. కాకపోతే ఇక్కడ ఒక్క చెల్లెలే ఉంది తప్ప ఆమె తరపున పగ తీర్చుకునే హీరో అన్నయ్యే లేడు. అత్యాచారం చేసినవారు డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నవారయితే అత్యాచార బాధితులే ఎలా నేరస్థులుగా ముద్ర వేయబడతారో సూర్యనెల్లి సామూహిక అత్యాచారం ఒక సజీవ సాక్ష్యం. ప్రత్యేక కోర్టు 35 మంది…

కుంభమేళా తొక్కిసలాట, 36 మంది దుర్మరణం -ఫొటోలు

ప్రపంచంలోనే అతి భారీ సంఖ్యలో మనుషులు ఒక చోటికి చేర్చే కార్యక్రమంగా ప్రసిద్ధి పొందిన అలహాబాద్ కుంభమేళా ఆదివారం తొక్కిసలాటకు సాక్షిగా నిలిచింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు ఫుట్-ఓవర్-బ్రిడ్జి కూలిపోవడం ముఖ్య కారణం. రైల్వే అధికారులు, పోలీసులు, ప్రజలు చెప్పిన వివిధ అంశాలను బట్టి ‘ఒక ప్లాట్ ఫారం మీదికి వస్తుందని ప్రకటించిన రైలు చివరి…

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

అఫ్జల్ గురు ఉరితీత, ఢిల్లీలో కాశ్మీరీల ఆందోళనలు -ఫొటోలు

2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో అరెస్టు అయి అప్పటినుండి జైలులో మగ్గుతున్న అఫ్జల్ గురుకి కోర్టు విధించిన మరణ శిక్షను శనివారం ఉదయం అమలు చేసారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షను అమలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ లబ్ది పొందడానికే ఈ సమయంలో ఆయనని ఎన్నికలముందు ఉరి తీసారన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉరి శిక్ష అమలుపై…

గిరిజనాల పరిస్ధితికి దర్పణం ఈ పాట -వీడియో

భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దేశ సహజ మౌలిక ఖనిజ వనరులను దేశ ప్రజలకు వినియోగ పెట్టడం మాని తవ్వి విదేశీ కంపెనీలకు ముడి పదార్ధాలుగా దేశం దాటిస్తున్నారు. ఆ క్రమంలో తరాల తరబడి అడవులు, కొండలను నమ్ముకుని బతుకుతున్న పేద గిరిజన రైతు కూలీలు కొంపా, గోడు దోపిడీదారులకు అప్పజెప్పి తమకు పరిచయం లేని మైదాన ప్రాంతాల్లో పని…

చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?

“మీరు హరిజనులు. చదవడానికి, రాయడానికి మీకు హక్కు లేదు. బూట్లు, చెప్పులు కుట్టడమే మీ పని. మా ఇళ్ళలో మిమ్మల్ని దాసులుగా ఉంచుకుంటాం. మీ తాత ముత్తాతలు చేసిన పని అదే. మీరు హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లిపోండి. లేదా, ఇక్కడ రక్తపాతం తప్పదు.” ఏ మారు మూల పల్లెలోనో అహం మూర్తీభవించిన అగ్రకుల భూస్వాములు పలికిన మాటలు కావు యివి. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధుల ప్రేలాపనలు ఇవి. పాట్నా యూనివర్సిటీలో షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు నివసించే…

దుః ఖైర్లాంజి -ఎండ్లూరి సుధాకర్ కవిత

(దిన, వార పత్రికలు చదివే వారికి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ పేరు చిరపరిచతమే. ఆయన రాసిన ఈ కవిత వెబ్ మహిళా సాహిత్య పత్రిక ‘విహంగ‘ లో ఫిబ్రవరి 1 తేదీన ప్రచురించబడింది. పత్రిక సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) ఆ రాత్రి ఆకాశం నెత్తుటి వెన్నెల కురిసింది ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరై పోయింది ఆ రాత్రి ఆత్మ గౌరవం ఆయుధంకాలేక విలపించింది…

సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered…

అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి?

ఈ వ్యాసం వీక్షణం పత్రికలో వచ్చింది. రచయిత లోక సంచారి. పశ్చిమ రాజ్యాలనుండి దిగుమతి అవుతున్న సామ్రాజ్యవాద విష సంస్కృతి, 1991 నుండి భారత పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాల వలన వెర్రితలలు వేస్తున్న వస్తు వినిమయ సంస్కృతి దరిమిలా లుప్తమైపోతున్న మానవ సహజ సంబంధాలు, మహిళలపై హింసా ప్రవృత్తి రాజ్యమేలుతున్న పరిస్ధితి, రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలన్నీ నేరస్ధుల పక్షాన నిలిచే ధోరణులు వ్యవస్ధీకృతమై ఉండడం, మహిళా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పని చేస్తున్న…