యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…

మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…

కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2

విదేశీ చమురు కంపెనీలు చెల్లించే రాయల్టీలను గణనీయంగా పెంచి దానిని ప్రజోపయోగాలకు తరలించడానికి ఛావెజ్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. 2001 చట్టం ద్వారా చమురు అమ్మకాల ఆదాయంలో విదేశీ కంపెనీల వాటాను 84 నుండి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. భార చమురు వెలికి తీసే ఒరినికో చమురు బేసిన్ లో చమురు రాయల్టీలను 1 శాతం నుండి 16.6 శాతానికి పెంచింది. ఈ చెల్లింపులకు బడా చమురు కంపెనీలు ఎక్సాన్, కొనొకో ఫిలిప్స్ తిరస్కరించడంతో వాటిని…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -1

అది న్యూయార్క్ నగరం లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం. ప్రపంచ రాజకీయ ఆధిపత్య సాధనకు అమెరికా పనిముట్టుగా తిరుగులేని రికార్డు సంపాదించిన ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయ భవనంలో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత రోజే అదే చోట ప్రసంగించడానికి పోడియం ఎక్కిన వ్యక్తి ఒక అభివృద్ధి చెందిన దేశానికి నాయకుడు. తమ దేశంలోని ఆయిల్ వనరులను ప్రజల జీవన స్థాయిని పెంచడానికి వినియోగ పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో…

ఛావెజ్ మరణం అమెరికా పన్నాగం కావచ్చు –రష్యా నాయకుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు. “అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న…

అమెరికా సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన హ్యూగో ఛావెజ్ ఇక లేడు

వెనిజులా చమురు క్షేత్రాల నుండి లాభాల రాశులను తవ్వుకుపోతున్న అమెరికా బహుళజాతి కంపెనీలను ఉరికించి కొట్టిన బొలివారన్ విప్లవ నేత హ్యూగో ఛావెజ్ తుది శ్వాస విడిచాడు. అమెరికా గూఢచారులు ప్రవేశ పెట్టిన కేన్సర్ జబ్బుతో పోరాడి అలసిపోయిన ఛావెజ్ మంగళవారం రాత్రి కన్ను మూశాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన క్యూబా డాక్టర్లు నాలుగు సార్లు సర్జరీ చేసినప్పటికీ లొంగని కేన్సర్ కణాలు తమ యజమానులు ఆశించినట్లుగానే ఛావెజ్ ను తుదముట్టించిగాని ఊరుకోలేదు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు…

ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆడ శిశువుల పాలిట వధ్య ప్రదేశ్ గా మారుతోంది. కడుపులో ప్రాణం పోసుకున్న వెంటనే పుట్టబోయేది ఆడపిల్లలేనని చెప్పడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సైతం క్యూ కట్టడంతో ఆడ పిండాలు ఎదగకుండానే పీక నులమడానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఆడ పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఆడ శిశువులను గర్భంలోను, పురిటిలోను చంపడాన్ని నివారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో…

సెల్ ఫోన్ ప్రమాదమే, కేంద్ర ఆరోగ్యమంత్రి -కత్తిరింపు

సెల్ ఫోన్ల వాడకం నిస్సందేహంగా ప్రమాదకరమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ సాక్ష్యాత్తూ లోక్ సభలోనే ధృవపరిచారు. ఆ విషయం 1800 కు పైగా జరిగిన పరిశోధనల్లో తేలిందని మంత్రి గారు చెప్పిన సంగతిని ఆంధ్ర జ్యోతి పేపర్ తెలియజేసింది. పేపర్ వార్తను కింద చూడవచ్చు. ఆజాద్ ప్రకటనను బట్టి సెల్ ఫోన్లతోనే కాక సెల్ టవర్లతో కూడా ముప్పే అని తెలుస్తోంది. సెల్ టవర్ల వల్ల పిచ్చుకల జాతి అంతరించుకుపోతోందని వచ్చిన వార్తలు…

కొంత బుద్ధి, కొంత జ్ఞానం

బొమ్మలు, సంభాషణల రూపంలో ఉన్న కింది కొటేషన్లను నాకొక మిత్రుడు ఈ మెయిల్ చేశాడు. వీటిని చదివిన వెంటనే నలుగురితో పంచుకోవాలన్న కొరిక బలంగా కలిగింది. “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విచారం పంచుకుంటే తరుగుతుంది” అంటారు గదా! బహుశా ఆనందం కోవలోకి జ్ఞానం కూడా వస్తుందనుకుంటాను. ఈ బొమ్మలలో వ్యక్తం అవుతున్నది అనుభవజ్ఞులు సమకూర్చిన జ్ఞానం కనుక పంచుకుంటే మరింత ఉపయోగమే కదా! 1)  ఏది నిజం? నిజం అని భావించేవి చాలా వరకు సాపేక్షికమే. ముఖ్యంగా…

పరిభాష తెలిస్తే తేలికే -ఈనాడు ఆర్టికల్ 3వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా?” ఆర్టికల్ మూడవ భాగం ఈనాడు చదువు పేజిలో ఈ రోజు ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. ఈనాడు వెబ్ సైట్ లో చూడదలిచినవారు ఈ లింక్ క్లిక్ చేయగలరు.

పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!

(ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయిన ఎం.వి.రమణ మూర్తి ‘ది హిందు‘ పత్రిక రాసిన వ్యాసానికి యధాతధ అనువాదం ఇది. చాలా మంది విస్మరించే ఒక శాస్త్రీయ వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఒక సామూహిక విస్మరణను సవరించుకుంటే ఆడపిల్లల బతుకులకు కాస్తయినా గ్యారంటీ లభిస్తుందని ఆశిస్తూ ఆయన ఈ వ్యాసం రాసినట్లు కనిపిస్తోంది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు రచయిత సూచించిన పరిష్కారానికి పరిమితులు ఉన్నప్పటికీ…

మదర్ థెరిసా దయ, నిస్వార్ధం ఒట్టి మిథ్య -పరిశోధకులు

మదర్ థెరిసా గురించి ప్రచారంలో ఉన్న సుగుణాలు ఒట్టి మిథ్య అని ముగ్గురు కెనడా పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవాలను విశ్లేషిస్తే దయామయి, నిస్వార్ధపరురాలు అన్న సుగుణాలు ఆమెకు నప్పవని తమ పరిశోధనలో తేలినట్లు మాంట్రియల్ యూనివర్సిటీ, ఒట్టావా యూనివర్శిటీల పరిశోధకులు తెలిపారని ఎ.ఎన్.ఐ వార్తా సంస్థ తెలియజేసింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేకమంది దాతలనుండి వందల మిలియన్ల డాలర్లు విరాళాలుగా సేకరించిన థెరిసా ఆ డబ్బుని తాను చెప్పిన లక్ష్యాలకు వినియోగించలేదని, ఆమె రాజకీయ సంబంధాలు…

సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…

షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…

అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక ‘సారీ‘ చెప్పడం మామూలుగా మారింది.…