స్టింగ్ ఆపరేషన్: తలలు తెగి పడుతున్నాయ్

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఫలితాలు చూపిస్తోంది. బలి పశువుల తలలు తెగిపడుతున్నాయి. సమస్య మూలాలను కదిలించడానికి బదులు జీతగాళ్లను బలి తీసుకునే కార్యక్రమం మొదలయింది. అందులో భాగంగా మనీ లాండరింగ్ కి అంగీకరిస్తున్నట్లు రహస్య కెమెరాల సాక్షిగా దొరికిపోయిన అధికారులను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయ్యేవరకు వారు సస్పెన్షన్ లో ఉంటారని సదరు బ్యాంకు తెలియజేసింది. రెండు వారాల లోపు విచారణ పూర్తవుతుందని బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ తెలియజేసింది.…

మన్మోహన్ కి కోరలు మొలిచాయి! -కార్టూన్

ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.…

వీడు మామూలోడు కాదు!

తవ్వే కొద్దీ తవ్వుకున్నంత! అక్రమాలు పుట్టలే పుట్టలు!! ఒకే ఒక్కడు; ఐనా ఒంటి చేతితో పుట్టించిన అక్రమ సర్టిఫెట్లకు కొదవ లేదు!! ఒక పేరుతో బి.టెక్ చదివి మరో పేరుతో చదివినట్లు సర్టిఫికేట్ పుట్టించిన బెట్టి మొహంతి అదే సర్టిఫికేట్ తో ఏకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులోనే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు కొట్టేశాడు. జర్మనీ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో దోషిగా తేలిన యువకుడు పెరోలుపై బయటికొచ్చి పరారీలో ఉండగానే ఇవన్నీ ఎలా అమరుతాయి? ఉన్నత స్థాయిలోని…

ప్రైవేటు బ్యాంకులే బ్లాక్ మనీకి ‘అడ్డా’లు; స్టింగ్ ఆపరేషన్

నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చడం, హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించి తిరిగి పెట్టుబడులుగా దేశంలోకి రప్పించడం ఎక్కడో చీకటి గదుల్లో, మూడో కంటికి తెలియని రహస్య గుహల్లో జరిగే పని అనుకుంటే పొరబాటని భారత దేశంలోని ప్రైవేటు బ్యాంకులపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి అయింది. భారత దేశంలో దినదిన ప్రవర్థమానమై వర్ధిల్లుతున్న ప్రైవేటు బ్యాంకులే నల్ల డబ్బుకు అడ్డాలుగా మారాయని ‘కోబ్రా పోస్ట్‘ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ రుజువు చేసింది. దేశంలో…

దేశం వదిలి వెళ్లొద్దు, ఇటలీ రాయబారికి సుప్రీం ఆదేశం

ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటాలియన్ మెరైన్లను ఇండియాకి తిరిగి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు అసాధారణ చర్య చేపట్టింది. ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని తమ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఫిబ్రవరి 24-25 తేదీలలో జరిగిన ఇటలీ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి తిరిగి వెనక్కి వస్తామని మెరైన్లు సుప్రీం కోర్టును కోరగా వారికి ఇటలీ రాయబారి హామీగా నిలిచాడు.…

మోడి ప్రసంగం కేన్’సెల్’ -కార్టూన్

‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు? మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి…

బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో

అమెరికా అనే సామ్రాజ్యవాద మత్త గజాన్ని తెలిసి తెలిసి ఢీకొన్న నేటి కాలపు హీరో బ్రాడ్లీ మేనింగ్. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాల్లో అమెరికా సైనికులు, అధికారులు పాల్పడిన అమానవీయ హత్యాకాండలు, సామాన్య పౌరులపై సాగించిన యుద్ధ నేరాలు తదితర సమాచారాన్ని ‘వికీ లీక్స్’ కి అందజేసి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న దారుణ కృత్యాలకు కేంద్రం అమెరికాయేనని ససాక్ష్యాలతో వెల్లడి చేశాడు బ్రాడ్లీ మేనింగ్. అత్యంత రహస్యంగా బ్రాడ్లీ మేనింగ్ ని విచారిస్తూ తాను నిత్యం వల్లించే…

భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

బొగ్గు కుంభకోణం, మరో చీకటి అధ్యాయం

భారత పాలకవర్గాల అవినీతి చరిత్రలో మరో రసవత్తర అధ్యాయానికి తెర లేస్తోంది. 2జి కుంభకోణం దరిమిలా 122 లైసెన్సులను రద్దు చేసి కాంగ్రెస్ పాలకుల అవినీతి మాలిన్యాన్ని ధృవపరిచిన సుప్రీం కోర్టే తాజా అధ్యాయానికి నాందీ వాచకం పలుకుతోంది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం బొగ్గు గనుల కేటాయింపులు ఒక పద్ధతి లేకుండా జరిగినట్లు స్పష్టం అవుతోందని, అవసరమైతే కేటాయింపులన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అసలు బొగ్గు గనుల కేటాయింపుల రాష్ట్రాల…

ఇటలీ నమ్మక ద్రోహం!

అసలే ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న ఇండియా, ఇటలీ సంబంధాలు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత క్షీణించే పరిస్ధితి ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసొస్తామని చెప్పి వెళ్ళిన భారతీయ జాలరుల హంతకులను తిరిగి ఇండియాకి పంపేది లేదని ఇటలీ ప్రకటించింది. రాయబార చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తాము చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యాలయానికి సోమవారం రాత్రి సమాచారం వచ్చినట్లు…

ఢిల్లీ అత్యాచారం నిందితుడు రాంసింగ్ హత్య?

ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు…

ఐక్య వేదికలూ… వ్యూహాలు -ఈనాడు ఆర్టికల్ 4వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ నాలుగవ భాగం ఈ రోజు ఈనాడు పత్రికలోని ‘చదువు’ పేజీలో ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇవ్వడమైనది. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో ఈ ఆర్టికల్ ను నేరుగా చదువాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగలరు. కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు. – –

హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి ‘సెక్యులరిజం‘ కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు. బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో…

ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది! ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి…