44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం

బుధవారం తెల్లవారు ఝామున ఘోరమైన రోడ్డు ప్రమాదం సభవించింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఒకటి డివైడర్ ని ఢీకొట్టి ఉన్నపళంగా అగ్నికి ఆహుతయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందో తెలుసుకుని తప్పించుకునే లోపు బస్సు నిండా దట్టమైన పొగలు అల్లుకుపోవడంతో ఎటు పోవాలో తెలియక మంటల్లో మాడి మసై పోయారు. రిజర్వేషన్ బుకింగ్ జాబితా తప్ప ప్రయాణీకులను గుర్తించడానికి మరే మార్గమూ లేకుండా పోయింది. డ్రైవర్, క్లీనర్ తో సహా…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

అగ్రరాజ్యాన్ని వణికించిన శాండి: ఏడాది తర్వాత… -ఫోటోలు

మిన్ను మన్ను ఏకం చేసే పెను తుఫాను ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి పోయాక భారత దేశంలో పరిస్ధితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుండి సాయం అందే దారి లేక జనం ఎప్పటిలాగా కష్టాలను ఈదడం ప్రారంభిస్తారు. వారికి తుఫాను తర్వాత ఏ పరిస్ధితి ఉంటుందో దానికి ముందు కూడా దాదాపు అదే పరిస్ధితి కనుక ఒక ఎదురు దెబ్బ తగిలిందని సమాధానం చెప్పుకుని జీవన పయనంలో సాగిపోతారు. వారి నష్టాన్ని రెండింతలు చేసి చెప్పుకునే పాలక…

ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

విభజన గీతా మకరందం

-రచన: పైడి తెరేష్ బాబు (పైడి శ్రీ) మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి అపార్థా! గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము…

నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్

సుప్రీం తీర్పు ప్రకారం ఓటింగ్ మిషన్ లో ‘None Of The Above’ (NOTA) బటన్ ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే NOTA మీట నొక్కాల్సి ఉంటుంది. కానీ NOTA ఓట్లు లెక్కించరాదని తీర్పులో పేర్కొన్న దృష్ట్యా ఈ మీటకు విలువ లేకుండా పోయింది, అది వేరే సంగతి! NOTA మీట ప్రవేశ పెడుతున్నారు కాబట్టి నిర్బంధ ఓటింగ్ ని అమలు చేయాలని నరేంద్ర మోడి ఒక ప్రతిపాదన…

బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు)…

పన్నులు ఎగవేయడమే కార్పొరేట్ నీతి!

బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు సంక్షోభ కాలాల్లో కూడా లాభాలు ఎలా సాధిస్తాయి? డబ్బు లేదు మొర్రో అంటూ ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు తెచ్చేది ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర్నుండే. దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని నిర్వహించే ప్రభుత్వం దగ్గర లేని డబ్బు పెట్టుబడిదారీ కంపెనీలకు ఎక్కడి నుండి వస్తుంది? కార్మికుల వేతనాలనూ, సౌకర్యాలను నానాటికీ కుదిస్తూ లాభాలు పోగేసుకోవడం కంపెనీల ప్రధాన మార్గం. లాభాలు పోగేసుకోవడంలో వాటికి ఉన్న రెండో ప్రధాన మార్గం పన్నులు ఎగవేయడం.…

కారుతోలే హక్కుకోసం సౌదీ మహిళల పోరాటం

ప్రజల చైతన్యం ‘వెర్రి’ తలలు వేస్తే తన బతుకు ఏమవుతుందో సౌదీ రాచరికానికి బాగానే తెలుసు. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత కలిగిన అమెరికా తోడు నిలవగా రాచరిక ప్రజాస్వామ్యం అనబడే విచిత్ర వ్యవస్ధను నెట్టుకొస్తున్న సౌదీ రాచరికానికి మహిళల ‘గొంతెమ్మ’ కోరికల పట్ల ఈ మధ్య మహా దిగులు పట్టుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ‘Women2Drive’ ఉద్యమాన్ని అరెస్టులతో అణచివేసిన సౌదీ ప్రభుత్వం అది మళ్ళీ తలెత్తడంతో గంగ వెర్రులెత్తుతోంది. సోషల్ నెట్ వర్క్…

మన్మోహన్ సి.బి.ఐ ని ఆహ్వానించారు -కార్టూన్

బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా? మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

ఆ గ్రామాలకు సూర్యరశ్మి ఇచ్చేది అద్దాలే -ఫోటోలు

నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మిగిలిన ఆరు నెలలూ వారు చీకటిలో మగ్గాల్సిందే. ఆ రెండు గ్రామాలూ లోతైన లోయల్లో ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడి ఉండడమే దానికి కారణం. వణికించే చలికి తోడు సూర్యరశ్మి లేకపోవడం ఆ గ్రామాలకు శాపంగా మారింది. ఈ సమస్యకు వారు ఓ వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. కొండలపై పెద్ద పెద్ద ఉక్కు అద్దాలు అమర్చి సూర్య రశ్మిని గ్రామాలపైకి పరావర్తనం…

ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో

అమెరికా గూఢచార సంస్ధ ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ని అమెరికా, ఐరోపాల్లో ‘నో సచ్ ఏజన్సీ’ అని కూడా అంటారు. దానర్ధం అంత లో ప్రొఫైల్ లో ఉంటుందా సంస్ధ అని. ప్రపంచ వ్యాపితంగా అది సాగిస్తున్న విస్తారమైన గూఢచర్యం (స్నోడెన్ పుణ్యమాని) లోకానికి తెలిసాక ఎన్.ఎస్.ఎ అంత లో ప్రొఫైల్ లో ఎందుకు ఉంటుందో జనానికి తెలిసి వచ్చింది. ఎన్.ఎస్.ఎ గూఢచర్యంలోని దిగ్భ్రాంతికరమైన 10 పద్ధతులను ఈ వీడియో వివరిస్తోంది. ఈ వీడియో ప్రధానంగా గూగుల్…