మోడీ చరిత్ర పరిజ్ఞానం ఇంతేనా?

“మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం సర్, చారిత్రక పేర్ల గురించి ప్రస్తావించదలుచుకుంటే జస్ట్ గూగుల్ చేయండి చాలు!” ——— ప్రధాన  మంత్రి కాగోరేవారికి భారత దేశ చరిత్ర గురించి సరైన అవగాహన ఉండాలని భావించడంలో తప్పుకాదు. పైగా అదొక షరతు కూడా. దేశ చరిత్ర పైన అవగాహన లేనివారు దేశ రాజకీయ-ఆర్ధిక-విదేశాంగ విధానాలను ఎలా నిర్దేశిస్తారు? కానీ బి.జె.పి ప్రధాని అభ్యర్ధికి అత్యవసరమైన ఈ అవగాహన కొరవడిందని ఆయన ఉపన్యాసాలు చెబుతున్నాయి. రెండు సందర్భాల్లో ఆయన చారిత్రక అవగాహన…

ప్రశ్న: లుక్ ఈస్ట్ పాలసీ అంటే?

ఎ.సురేష్: ‘లుక్ ఈస్ట్ పాలసీ’ అంటే ఏమిటి? సమాధానం: సురేష్ గారూ ఈ ప్రశ్నకు సమాధానం గతంలో రాశాను. ‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడం ఎలా?’ అన్న శీర్షికన ఈనాడు చదువు పేజీలో వచ్చిన వ్యాస పరంపరలో మూడో భాగంలో ఈ పాలసీ గురించి చర్చించాను. సదరు ఆర్టికల్ ను ఈ బ్లాగ్ లో కూడా ప్రచురించాను. ప్రచురించడం అంటే ఈనాడులో వచ్చిన ఆర్టికల్ పి.డి.ఎఫ్ కాపీ ని ఇక్కడ పోస్ట్ చేయడం. ఒకవేళ మీకు…

టిడిపితో దోస్తీపై పునరాలోచనలో బిజెపి?

రాష్ట్రంలో టి.డి.పి, బి.జె.పి లు దగ్గరవుతున్న సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నప్పటికీ ఆ విషయంలో బి.జె.పి పునరాలోచనలో పడినట్లు వివిధ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతు ఇచ్చిన బి.జె.పి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన టి.డి.పి తో దోస్తీ కట్టడానికి బి.జె.పి తెలంగాణ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చే పక్షంలో టి.ఆర్.ఎస్ కూడా ఆ కూటమిలో చేరే అవకాశాలున్నాయని బి.జె.పి నాయకులు కొందరు భావిస్తున్నారు. దానితో…

రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్

ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి. కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల…

ఫిలిప్పైన్స్: హైయన్ మరణాలు పది వేలు?

రాక్షస తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. మహా పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ రష్యా టుడే తెలిపింది. లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం…

ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది. ఇంకా చెప్పాలంటే నేను వేసిన…

మల్లిక్ స్పెషల్: రాష్ట్ర విభజన పాటలు

(తెలుగు కార్టూనిస్టుల్లో మల్లిక్ ది ఒక ప్రత్యేకమైన బాణీ. నిజ జీవితంలో సీరియస్ గా కనిపిస్తాడని చెప్పే మల్లిక్ రాజకీయ కార్టూన్లను చూడడం నాకు ఇదే మొదటిసారి. -విశేఖర్) ***               ***               *** సోనియా గాంధీ : ” తలచినదే జరిగినదా…దైవం ఎందులకూ….” దిగ్విజయ్ సింగ్:  ” ఆగదు ఏ నిమిషం నీ కోసమూ…ఆగితే సాగదు ఈ లోకమూ…” కిరణ్ కుమార్ రెడ్డి: ” జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా….” – – – – మిగిలిన భాగం…

ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’

ఈ సంవత్సరం ఇప్పటికే అనేక ప్రకృతి విలయాలతో డస్సిపోయిన ఫిలిప్పైన్స్ ను శుక్రవారం మరో భారీ తుఫాను ఊపేసింది. ‘చరిత్రలోనే అది అతి పెద్ద తుఫాను’ అని పత్రికలు చెబుతున్నాయి. సూపర్ టైఫూన్ గా చెబుతున్న ఈ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారనీ, ఈ సంఖ్య ఇంకా అనేక రెట్లు పెరగవచ్చని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెబుతోంది. గంటకు 315 కి.మీ వేగంగా గాలులు వీస్తున్నట్లు రష్యా టుడే తెలిపింది. బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్, గాలుల…

అరాఫత్ ది హత్యే, శాస్త్రవేత్తల నిర్ధారణ

పాలస్తీనా స్వాతంత్రోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ సహజ కారణాలతో చనిపోలేదని, ఆయనపై విష ప్రయోగం జరిగిందని దాదాపు నిర్ధారణ అయింది. అరాఫత్ సమాధి నుండి వెలికి తీసిన అవశేషాల్లో అణు ధార్మిక పదార్ధం పోలోనియం-210 భారీగా ఉన్నట్లు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అరాఫత్ ను పూడ్చిపెట్టిన 8 యేళ్ళ తర్వాత కూడా పోలోనియం పదార్ధం ఉండడాన్ని బట్టి ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న వాదనలో నిజం ఉన్నట్లేనని స్విస్ శాస్త్రజ్ఞుల నివేదిక పేర్కొంది. యాసర్ అరాఫత్ హత్యలో…

లియు బోలిన్: మాయం (అయ్యే) కళలో నిష్ణాతుడు -ఫోటోలు

కళలు 64 రకాలని తెలుగు పెద్దలు చెబుతారు గానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం తెరిస్తే కళల సంఖ్యకు అసలు పరిమితంటూ ఉండదని తెలిసొస్తుంది. మాయం అయ్యే కళ గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందో లేదో తెలియదు గానీ, లియు బోలిన్ అనే చైనా కళాకారుడు ఈ కళలో ఆరితేరాడు. మనం రోజూ చూసే దృశ్యాలలో కలిసిపోయి తానక్కడ లేనట్లు భ్రమ కల్పించడం లియు ప్రదర్శించే కళ. అందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం తన శరీరాన్నే…

చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…

ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?

కె.బ్రహ్మం: ప్రపంచీకరణ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: రెండో అంశాన్ని వివరిస్తూ మొదటి అంశానికి వస్తాను. ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు. ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో…

ఎన్నికల హామీ: అంగారకుడిపై ఉచిత భూములు -కార్టూన్

– “నాకనుమానం లేదు. ఇక అంగారకుడిపైన నీరు, ఉచిత భూమి ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాగ్దానాలు కురిపిస్తారు.” *         *          * భారత రాజకీయ పార్టీల హామీల వరదకు ఆనకట్ట వేయగల మొనగాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరని ఇట్టే చెప్పొచ్చు. ప్రజల్ని బిచ్చగాళ్లను చేసి పగ్గం గడుపుకోని పార్లమెంటరీ రాజకీయ పార్టీ కూడా ఇండియాలో కనపడదు. ఇందిరాగాంధి కాలంలో ఎస్.సి, ఎస్.టి ల గుడిసెలకు ఉచితంగా బొంగులు, తాటాకులు ఇవ్వడం…

అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతం

భారత దేశ మొట్టమొదటి అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతంగా పూర్తయింది. శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి – సి25 ఉపగ్రహ వాహక నౌక, అంగారకుడి చుట్టూ పరిభ్రమించడానికి ఉద్దేశించిన ఉపగ్రహాన్ని మొదటి దశలో భూమి చుట్టూ తిరిగే కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తమ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రధాని, రాష్ట్రపతిలు కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం భూమి చుట్టూ…

ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోర్టీ మొదటిసారిగా తన బలాన్ని నిరూపించుకోబోతోంది. బడా భూస్వామ్య – బడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలయిన బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలతో అది పోటీపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పరిస్ధితి కాంగ్రెస్, బి.జె.పిలతో పోలిస్తే ఎలా ఉంటుందో కార్టూనిస్టు ఈ కార్టూన్ లో చెబుతున్నారు. జన, ధన బలాలూ, బలగాలూ దండిగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లతో ఆమ్ ఆద్మీ పార్టీ…