ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

గుజరాత్: అప్పుల కుప్పగా మార్చిన మోడి

నరేంద్ర మోడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2001-02 లో గుజరాత్ అప్పు 45,301 కోట్లు కాగా అది 2013-14 నాటికి 1.76 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. ఈ డజను సంవత్సరాల్లో గుజరాత్ కి చేసిన సేవ ఇక చాలనుకుని దేశం మొత్తానికి సేవ చేస్తానని మోడి బయలుదేరారు. భారత మాత రుణం తీర్చుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానని మోడి ఓ సందర్భంలో చెప్పారు కూడా. (మోడి తరహాలోనే భారత మాత రుణం తీర్చుకోవాలని దేశ…

85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం…

సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…

అసమాన వ్యవస్ధలకు పునాది అసమానతల బాల్యం -ఫోటోలు

ప్రపంచ వ్యాపితంగా ఏ దేశం చూసినా అసమానతలతో నిండి ఉన్నదే. బాల్యం నుండే అసమానతలను సహజ న్యాయంగా చూపించే వ్యవస్ధలో, మతంలో, నమ్మకాల్లో ఆ అసమానతల్ని రూపుమాపే బదులు న్యాయబద్ధం చేసే సూత్రాలకు కొదవ లేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా ఇదే పరిస్ధితి. కొందరు నోట్లో బంగారు స్పూన్ తో పుడితే అనేకమందిని కటిక నేల ఆదరించి సాకుతుంది. ఈ ఫోటోలు చేప్పేదీ అదే.

ఎన్నికల్లో రెడ్ కార్పెట్, పాలనలో నో కార్పెట్ -కార్టూన్

ఎర్ర తివాచీ పైన నడిచి వచ్చినట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గి వచ్చిన ఎఎపికి పాలనలోకి వచ్చాక గాని మర్మం బోధపడలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి లు చెప్పేది కూడా ఇదేగా? అవినీతిని అంతం చేయడానికి జన్ లోక్ పాల్ తేవాలంటూ అన్నా, అరవింద్ ల బృందం ఆందోళన చేస్తున్నపుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది’ అని సవాలు విసిరాయి రాజకీయ పార్టీలు. సవాలు స్వీకరించిన అరవింద్ ఎఎపి కి అంకురార్పణ చేయగా…

సునందది ఆకస్మిక, అసహజ మరణం -ఎఐఐఎంఎస్

కేంద్ర మంత్రి శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ మరణం “ఆకస్మికం, అసహజం” అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. విష ప్రయోగం జరగలేదని నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు జరుపుతామని తెలిపారు. శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధ డాక్టర్లు ఈ విషయాలు తెలిపారు. డాక్టర్ల నిర్ధారణలతో హత్య అన్న అనుమానాలు తలెత్తాయి. సునంద పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి ఆమెపై దాడి…

శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం…

ఎఎపి వెనుక ఫోర్డ్ ఫౌండేషన్?

ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్ధలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఎఎపి కి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్.ఐ ల పేరుతో అమెరికా నుండి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు.…

ఇండియాలో అమెరికా రాయబారుల వీసా ఫ్రాడ్

తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు…

బొగ్గు కుంభకోణం vis-à-vis పర్యావరణ అనుమతి -కార్టూన్

ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా బొగ్గు తవ్వి పారేస్తున్న కంపెనీలు కొన్నాయితే పర్యావరణ అనుమతులు లేకుండానే లక్షల టన్నుల బొగ్గు గనుల్ని అట్టే పెట్టుకున్న కంపెనీలు మరి కొన్ని. ఇవి సాదా సీదా కంపెనీలు కూడా కాదు. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంకేతాలుగా పాలకులు సగర్వంగా చాటుకునే కంపెనీలు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్, అదాని పవర్.. ఇత్యాది కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బొగ్గు కేటాయింపులకు కేంద్రం ఏర్పాటు…

అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…

దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’…

ఎఎపిపాలన: అప్పుడే తిరుగుబాటు?

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చిన్నపాటి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి విఫలం అయిన వినోద్ కుమార్ బిన్నీ ఈ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్నాడు. అయితే ఆయనకు మద్దతుగా ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఎఎపి ప్రభుత్వం తన సిద్ధాంతాల నుండి పక్కకు వెళ్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అవుతోందని బిన్నీ ఆరోపించాడు. అధికారం చేపట్టి మూడు వారాలు కూడా కాక మునుపే ఈ రకం విమర్శ చేయడంలోనే…

ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా? జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ… నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం…

క్వాంటమ్: ఆఫ్-లైన్ కంప్యూటర్లపైనా అమెరికా నిఘా

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ ఆన్-లైన్ కంప్యూటర్ల పైనే కాకుండా ఆఫ్-లైన్ కంప్యూటర్లపైన కూడా నిఘా పెట్టే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడి అయింది. ఇంటర్నెట్ తో కనెక్షన్ లేకపోయినా నిఘా పెట్టగల పరికరాలను తయారు చేసుకున్న ఎన్.ఎస్.ఏ ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలకు చెందిన అత్యంత ముఖ్యమైన లక్షకుపైగా కంప్యూటర్లపై వాటి సాయంతో గూఢచర్యం నిర్వహించిందని తెలిసింది. లక్ష్యిత కంప్యూటర్లలో రేడియో తరంగాలను వెలువరించే పరికరాలను, తగిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను ఇన్ స్టాల్ చెయ్యడం…