ఇజ్రాయల్ అకడమిక్ బాయ్ కాట్ లో చేరిన స్టీఫెన్ హాకింగ్

ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బహుశా తన జీవితంలో మొదటిసారిగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయల్ ను అకడమిక్ బాయ్ కాట్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమాన్ పెరెజ్ ఆతిధ్యం ఇవ్వనున్న అత్యున్నత స్ధాయి కాన్ఫరెన్స్ కు హాజరు కాకూడదని ఆయన నిర్ణయించాడు. తద్వారా ఇజ్రాయెల్ ను అకడమిక్ గా బాయ్ కాట్ చేస్తున్న బ్రిటిష్ ప్రముఖుల్లో ఆయన కూడా…

మళ్ళీ వార్తల్లో కె.పి.ఎం.జి, 5సం.గా కదలని లైంగిక వేధింపుల కేసు

ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేటు అకౌంటింగ్ కంపెనీ కె.పి.ఎం.జి (క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గార్దెలర్ – Klynveld Peat Marwick Goerdeler) మరోసారి వార్తలకెక్కింది ఒక మహిళ ఉద్యోగి పైన ఆమె సహ ఉద్యోగులే లైంగికంగా వేధింపులకు  పాల్పడిన కేసులోనే ఈసారి కూడా సదరు కంపెనీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి ఈ కేసు పోలీసు, న్యాయ, పరిపాలనా వ్యవస్ధలన్నీ ఏ విధంగా ధనికుల సావాసం చేస్తున్నాయో వెల్లడిస్తున్నది. బహుశా ‘ధనికుల సావాసం’ అనడం సమస్యలోని…

కులాంతర వివాహం: కూతురిని గోడకి కొట్టి చంపిన తండ్రి

ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమిళనాడులో ఓ తండ్రి తన కూతురి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని తమ మానాన తాము బతుకుతున్న జంటను పోలీసులు వెతికి పట్టుకొచ్చి వారి వివాహాన్ని దగ్గరుండి మరీ రద్దు చేశారు. వివాహం రద్దుకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మనఃపూర్వకంగానే అంగీకరించాని బంధువులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ లో వివాహం రద్దు చేయించి ఇంటికి వచ్చాక కూతురు మళ్ళీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడడం సహించలేని…

మొదటి అమెరికా సెటిలర్లు నరమాంస భక్షకులు -పరిశోధన

ఇపుడు అమెరికన్లుగా కనిపిస్తున్నవారెవరూ నిజానికి అమెరికన్లు కాదు. ఇండియాకి కొత్త దారి కోసం వెతుకుతూ వెళ్ళి అమెరికా ఖండంలో అడుగుపెట్టిన కొలంబస్ ఎర్రగా ఉన్న అమెరికన్లను ‘రెడ్ ఇండియన్లుగా’ పిలిచాడు. ఆ తర్వాత యూరోపియన్లు ముఖ్యంగా ఆంగ్లేయులు అక్కడికి వలస వెళ్ళి అసలు అమెరికన్లను పశ్చిమానికి తరుముకుంటూ పోయి మొత్తం అమెరికా భూభాగాన్ని కబళించారు. చివరికి ‘రెడ్ ఇండియన్లను’ అమెరికాయేతరులుగా చేసేశారు. (అమెరికా తెల్లవారికి మాత్రమే చెందాలనే ‘వైట్ సూపర్ మాసిస్టులు’ కూడా ఉన్నారంటే తెల్లవారి తెంపరితనం…

రెండు దేశాలు, ఒకే క్రూరత్వం

సరబ్ జిత్ సింగ్ చనిపోయాడు. పాకిస్ధాన్ లోని జిన్నా ఆసుపత్రి డాక్టర్లు ‘బతకడం కష్టమే’ అని చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు పాకిస్ధానీ ఖైదీలు లాహోర్ లోని కోల్ లఖ్పట్ జైలులో అమానుషంగా దాడి చేయడంతో కోమాలోకి వెళ్ళిన సరబ్ జిత్ సింగ్ గురువారం తెల్లవారు ఝామున 1 గంటకు తుది శ్వాస విడిచాడని పాక్ అధికారులు ప్రకటించారు. గత శుక్రవారం దాడికి గురైన సరబ్ జిత్ సింగ్ వారం రోజులు కోమాలో…

ఎంత హింస మోసిందో, భర్తను కడతేర్చింది…

“ఎంతైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కదా!” ఈ మాట చెప్పడం చాలా తేలిక. కష్టాన్ని మోసేవాడిని నీతి సూత్రాలు ఎందుకు పాటించలేదని నిలదీయడం అతి సులువు. ఒడ్డున నిలబడి లోతు లెక్కలు వల్లించడం మాటలతో పని. ఇక ఇరవై నాలుగ్గంటలూ హింస అనుభవిస్తున్న వారిని ‘ప్రతిఘటించొద్దు, అది నేరం’ అని చెప్పడం ఎంత అన్యాయం? పదేళ్ళు అనుమానపు భర్త చేతుల్లో హింస అనుభవించిన భార్య, ఇక సహించలేక అతన్ని కడతేరిస్తే ఆమె పైన హత్యానేరం మోపడం చట్టం…

స్త్రీల దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము -POW సంధ్యతో ఓ రోజు

(రచన: రమా సుందరి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ షిప్ తో పంజాబ్ యూనివర్సిటీలో ఎం.టెక్ చదువుతున్న రచయిత్రి వద్దకు ‘ప్రగతిశీల మహిళా సంఘం’ అధ్యక్షురాలు సంధ్య వచ్చిన సందర్భంగా… విశేషాలు) సంధ్య వస్తుందనే సంతోషం నన్ను నిలవనీయలేదు. ఎయిర్ పోర్ట్ కు గంట ముందే వెళ్ళి కూర్చున్నాను. డిల్లీలో తెలంగాణా ధర్నా రెండు రోజులు ఉంటుందని, ముందు ఒక రోజు వచ్చి నీతో ఉంటాను అని నాకు చెప్పినప్పటి నుండి నా పరిస్థితి ఇదే.…

భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!

కాలం అనుకూలంగా లేకపోతే (టైం బాగోకపోతే) తాడే పామై కరుస్తుందంటారు. (ఇక్కడ నెపాన్ని కాలం మీదికి నెట్టేసినా దానర్ధం ‘స్ధల, కాల పరిస్ధితులు’ అయి ఉండాలి.) మియాన్మార్ (బర్మా) లో ముస్లింల పరిస్ధితి అలానే తగలడింది. ఒక బౌద్ధ భిక్షువుకు చెందిన భిక్షా పాత్రను ఒక ముస్లిం మహిళ పగలగొట్టిందన్న అనుమానంతో ముస్లింల పైనా, ఒక మసీదు పైనా దాడి జరిపారు అహింసావాదులైన భౌద్ధ మత ప్రజలు. ఇటీవలే మత ఘర్షణలతో అట్టుడికిన మియాన్మార్ లో మరో…

సి.బి.ఐని కడిగేసిన సుప్రీం కోర్టు

– బొగ్గు కుంభకోణం విచారణలో సి.బి.ఐ నిర్వహిస్తున్న పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. సి.బి.ఐ ని ప్రభావితం చేయడానికి న్యాయ శాఖ మంత్రి స్వయంగా పూనుకోవడం, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఇందులో పాత్ర వహించడాన్ని బట్టి పాలకులు అవసరం అయితే ఎంతకు తెగిస్తారో తెలిసి వస్తోంది. విచారణ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి చూపడం లేదని మార్చి 8 తేదీన చెప్పిన సి.బి.ఐ ఏప్రిల్ 26 తేదీన సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వానికి చూపిన తర్వాతే కోర్టుకు…

తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె

కుల దురభిమానమే పెట్టుబడిగా స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన డాక్టర్ ఎస్.రాందాస్ తమిళనాడులో కులాల కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా, అది రాకపోతే సృష్టించుకుని మరీ అమాయక పేద ప్రజల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడు. ‘చిత్ర పౌర్ణమి’ యూత్ ఫెస్టివల్ పేరుతో ఏప్రిల్ 25 తేదీన రాందాస్ నేతృత్వంలోని ‘పట్టలి మక్కల్ కచ్చి’ (పి.ఎం.కె) పార్టీ నిర్వహించిన వన్నియార్ ‘కుల పండగ’ దళితుల రక్తాన్ని మరోసారి చిందించింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా రెండు రాష్ట్రాల…

ముంబై: బాలికకు మత్తు ఇచ్చారు, ఆపైన….

క్రెడిట్ అంతా ఢిల్లీకే పోతోందనుకుందో ఏమో గాని ఈసారి బాలికపై అత్యాచారానికి ముంబై ముందుకొచ్చింది. ముంబై దారుణం ఏమిటంటే చిన్న పిల్ల మీద నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడడం. ముంబైలోని వకోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ పైశాచికం చోటు చేసుకుంది. నిందితులంతా 20-25 సంవత్సరాల మధ్య వయసు వారు. పుట్టిన రోజు పార్టీకని నిందితుల్లో ఒకరి స్నేహితురాలి చేత బాలికను ఇంటికి పిలిపించుకుని మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు.…

ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా…

గూగుల్, ఫేస్ బుక్ లు పిల్లలకు ఎలా చేరువగా ఉన్నాయి? -కోర్టు ఆరా

ఇంటర్నెట్ లో సామాజిక కార్యక్రమాల ముసుగు ధరించే ఐ.టి వ్యాపార కంపెనీల వ్యవహారం పైన భారత దేశంలోని కోర్టులు కొరడా ఝళిపించడానికి సిద్ధం అవుతున్నాయి. చట్టబద్ధ మైన వయసు 18 సంవత్సరాల లోపలి పిల్లలకు ఫేస్ బుక్, గూగుల్ సామాజిక వెబ్ సైట్లు పిల్లలకు ఎలా అందుబాటులో వస్తున్నాయో వివరించాలని ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చట్టాలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల వినియోగదారుల వ్యక్తిగత వివరాల డేటాను అమెరికా కంపెనీలు అమెరికాకు పంపిస్తున్నాయని తద్వారా…

మరో పాపని చంపేశారు, ఈసారి జార్ఖండ్ లో…

పసి పాపల పైన అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా జార్ఖండ్ చేరిపోయింది. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ళ బాలిక బుధవారం అత్యాచారానికి గురయింది. అత్యాచారం సంగతి బైటికి వస్తుందన్న ఉద్దేశ్యంతో పాపని గొంతు పిసికి చంపేశారు. నిందితుడు ఎవరైందీ ఇంకా ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును కేస్ డైరీలో నమోదు చేసిన పోలీసులు వాళ్ళకి, వీళ్ళకి సమాచారం ఇవ్వడం తప్ప స్వయంగా వెతకడానికి పూనుకోలేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అత్యాచారం జరిగిందని భావించడానికి ప్రాధమిక సాక్ష్యాధారాలు…