ఇండియాను మళ్లీ బెదిరిస్తున్న అమెరికా

ఎడమ నుండి వరుసగా: విదేశీ మంత్రి మార్కో రుబియో, ట్రంప్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్ అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి పరస్పరం ఒకరి పట్ల మరొకరు గౌరవం, స్నేహ భావన వ్యక్తం చేసుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అమెరికా, ఇండియాను బెదిరించటం మొదలు పెట్టింది. అమెరికా వస్తు సేవల పైన ఇండియా విధిస్తున్న టారిఫ్ లను మళ్లీ ప్రస్తావిస్తూ, అమెరికా నుండి మొక్క జొన్న…

టారిఫ్ వేడితో రష్యా చమురు దిగుమతి తగ్గిస్తున్న ఇండియా!

వాణిజ్య ప్రయోజనాల కోసం భారత దేశ స్వావలంభన, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే సమస్యే లేదని విదేశీ మంత్రి జై శంకర్ గత కొద్ది వారాలుగా పదే పదే చెబుతున్నారు. రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, లేక ఐరోపా, అమెరికాలలో ఉన్నా రష్యా చమురు దిగుమతి గురించి పశ్చిమ దేశాల విలేఖరులు ప్రశ్నించినప్పుడల్లా జై శంకర్ గారు ఈ సంగతే నొక్కి మరీ వక్కాణిస్తూ వస్తున్నారు. అయితే జై శంకర్ మాటలకు భిన్నంగా వాస్తవ పరిణామాలు జరుగుతున్నట్లు న్యూయార్క్…

అమెరికాకు పోస్టల్ సేవలు రద్దు చేసిన 25 దేశాలు -యుఎన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్లోబల్ స్థాయిలో తలపెట్టిన Trade Disruption తాలూకు మంటలు కొనసాగుతూ పోతున్నాయి. ఇండియాతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ దేశాల నుండి జరిగే పోస్టల్ సేవలను సస్పెండ్ చేసుకున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి లోని పోస్టల్ సేవల సంస్థ తెలియజేసింది. రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టడం తోనే, ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా కస్టమ్స్ నియమాల లో ఒకటైన గ్లోబల్ డి మినిమిస్…

50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!

Mercury Public Affairs ఇండియాలో వివిధ వ్యాపారాల్లో అనేక రకాల బ్రోకర్లు ఉంటారు. పల్లెల్లో గేదెలు, దున్నలు లాంటివి అమ్మి పెట్టటానికి కొనుగోలుదారుల్ని వెతికి పెట్టడానికి ఉండే బ్రోకర్లను ‘కాయిదా’ మనుషులు అంటారు. స్థలాలు, ఇళ్లు అమ్మి పెట్టడం – కొనుగోలుదార్లను వెతికి పెట్టేవాళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. సినిమా యాక్టర్లకు సినిమాలు సంపాదించి పెట్టే ట్యాలెంట్ బ్రోకర్లు మరి కొందరు. షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మటం కొనటం చేసే వాళ్ళను స్టాక్ బ్రోకర్లు…

సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!

Nathu-La pass ఇండియా, చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించటానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యం అనేక శతాబ్దాలుగా, ప్రధానంగా లెజెండరీ స్థాయి సంపాదించిన సిల్క్ రోడ్ ద్వారా కొనసాగుతూ వస్తున్నది. మోడి ప్రభుత్వం హయాంలో వరుస పెట్టి ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వద్ద అనేక హింసాత్మక ఘర్షణలు చెలరేగిన దరిమిలా సరిహద్దు వాణిజ్యం నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోవిడ్ 19 వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిందని…

ఇండియాలో అమెరికా పోస్టల్ సేవల సస్పెన్షన్

ఇండియా నుండి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా, ఆగస్టు 27 తేదీ నుండి 50% పైగా కస్టమ్స్ సుంకాలు అమెరికా ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు వెళ్ళే పోస్టల్ సేవలను భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సస్పెన్షన్ ఆగస్టు 25 తేదీ నుండి అనగా రేపు సోమవారం నుండి అమలు లోకి రానున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ఇప్పటి వరకు భారత సరుకులను అమెరికా తన కస్టమ్ సుంకాల నుండి…

యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                       పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…

మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

ఐపిఇఎఫ్: అమెరికా నాయకత్వాన 14 దేశాల కూటమి

అమెరికా, ఇండియాలతో పాటు మరో 12 దేశాలు ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేంవర్క్’ పేరుతో ఏర్పాటు చేసిన మరో కొత్త ఆర్ధిక కూటమి ఈ నెలలో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా కు పెను సవాలు ఎదురవడంతో ఆయా దేశాలతో సరికొత్త ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్నది. అందులో భాగమే ఈ ఐపిఇఎఫ్ కూటమి. మే 23,…

న.మో, షాల భారీ స్టాక్ మార్కెట్ స్కాం -రా.గా

“నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బూటకం అని బిజేపి నాయకత్వానికి ముందే తెలుసు. వారు జరిపిన అంతర్గత సర్వేలో తమకు 220 సీట్లు మాత్రమే వస్తాయని, ఇంటలిజెన్స్ ఏజన్సీల అంచనాలో 200 నుండి 220 వరకు సీట్లు వస్తాయని తేలింది” అని రాహుల్ గాంధీ వెల్లడించారు.

టిడిపి గెలుపుతో బాబు షేర్లు జంపు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ 135 సీట్లు గెలవడంతో మిత్ర పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థానంలో నిలబడి ఉంది. దానితో టిడిపి పార్టీ పెద్దలతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఉన్న ఫళంగా పైపైకి ఎగబాకుతున్నాయి.

ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!

జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస…

ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

బై బై డాలర్! సొంత కరెన్సీల్లో ఇండియా, రష్యా వాణిజ్యం

చిన్న రాజ్యాలు కొట్లాడుకుంటే పెద్ద రాజ్యం లాభపడుతుంది. అలాగే పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటే వాటి దగ్గర లాబీయింగ్ చేసే చిన్న రాజ్యాలు లబ్ది పొందుతాయి. ఓ వైపు ఒకప్పటి అగ్రరాజ్యం సోవియట్ రష్యా వారసురాలు రష్యా; మరో వైపు ఉక్రెయిన్ ని ముందు పెట్టి దాని భుజం మీద తుపాకి పెట్టి కాల్పులు జరుపుతున్న అమెరికా! ఉక్రెయిన్ లో రెండు పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటున్న నేపధ్యంలో ఇండియా వాణిజ్య పరంగా లబ్ది పొందుతోంది. ఈ లబ్ది రెండు…

స్వయం ప్రతిపత్తి కోసం సొంత శాటిలైట్ల ఏర్పాటులో ఐరోపా!

వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇన్నాళ్లూ అమెరికాపై ఆధారపడుతూ వచ్చిన ఐరోపా దేశాలు (యూరోపియన్ యూనియన్) ఇక తమకంటూ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. అందుకు అవసరమైన మౌలిక నిర్మాణాలను (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఉనికిలోకి తెస్తున్నాయి. ఐరోపా వ్యాపితంగా దృఢమైన, గ్యారంటీతో కూడిన ఇంటర్నెట్ కనెక్టివిటీని స్థాపించడం కోసం సొంత ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశ పెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇందుకోసం 6 బిలియన్ యూరోల ($6.8 బిలియన్లు) నిధులు కేటాయించినట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ఉపగ్రహాల…