గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…

కాంగ్రెస్ పడవ మునిగేదే, మరి బి.జె.పి పడవ? -కార్టూన్

‘కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం మునిగిపోతున్న పడవ’ అని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఉవాచ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా గడ్కారీ ప్రకటించాడు.  బి.జె.పి జాతీయ కార్యవర్గంలో మాట్లాడుతూ గడ్కారీ చెప్పిన ఈ మాటలు వాస్తవంలో నిజం కాదని పత్రికల ఏకాభిప్రాయం. బి.జె.పి నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ వరుస ప్రజావ్యతిరేక సంస్కరణలతో బరితెగించేదేనా అన్నది పత్రికల వాదన. ఆ మాట కొంత నిజమే అయినా సంస్కరణల పట్ల బి.జె.పి…

ఎన్నికల వ్యవస్ధల్లో వెనిజులా బెస్ట్, అమెరికా వరస్ట్ -జిమ్మీ కార్టర్

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అమెరికా రాజకీయ నాయకులకు నచ్చని వాస్తవం చెప్పాడు. వెనిజులాలో ఉన్న ప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఆయన కీర్తించాడు. డబ్బే పరమావధిగా నడుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోని వరస్ట్ వ్యవస్ధల్లో ఒకటని కూడా ఆయన ప్రకటించాడు. 2002లో అమెరికా ప్రేరేపిత కుట్రను వెనిజులా ప్రజలు వీరోచితంగా తిప్పి కొట్టినప్పటినుండీ వెనిజులాను శత్రువుగా ప్రచారం చేస్తున్న అమెరికా రాజకీయ వ్యవస్ధకు జిమ్మీ కార్టర్ వెల్లడిచిన వాస్తవం ఒక షాక్…

కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్

“నా పేరు వాడుకోవద్దు, నా ఫోటో పెట్టొద్దు” అని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ని హెచ్చరించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి సన్నిహిత సహచరుడుగా పేరుపడిన అరవింద్ కేజ్రీవాల్ కి అన్నా హెచ్చరిక శరాఘాతం లాంటిది. ‘అన్నా బృందం’ పేరుతో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధ కింద సాగిన ఉద్యమానికి అన్నా ముందు నిలబడినప్పటికీ ఉద్యమానికి అవసరమైన రోజువారీ వ్యవహారాలను చూసింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే నని అప్పట్లో పత్రికలు ఘోషించాయి. అదే నిజమయితే…

కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి. సామ్రాజ్యవాదులకు…

నిలువునా చీలిన అన్నా బృందం, చిచ్చు పెట్టిన రాజకీయ పార్టీ ఆలోచన

“బృందం వేరు పడడం దురదృష్టకరం… ఎటువంటి రాజకీయ పార్టీలోనూ, గ్రూపులోనూ నేను చేరేదిలేదు. వారి ప్రచారానికి నేను వెళ్లను. ప్రచారం సందర్భంగా నా ఫోటోని గానీ, నా పేరుని గానీ వాడుకోవద్దని వారికి చెప్పాను. మీరు స్వంతంగా పోరాడండి.” అరవింద్ కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకుంటూ అన్నా హజారే చేసిన ప్రకటన ఇది. కేజ్రీవాల్ తో విభేధాలున్నాయని అంగీకరించిన తర్వాత రోజే అన్నా, తాజా ప్రకటనతో రాజకీయ పార్టీ ఆలోచన నుండి పూర్తిగా వైదొలిగినట్లయింది. ఆగస్టులో అరవింద్…

యు.పి.ఎ కి మమత సెలవు, మైనారిటీలో కేంద్ర ప్రభుత్వం

మమత బెనర్జీ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతి, డీజెల్ రేట్ల పెంపుదల, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో భారీ కోత… నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ మమత విధించిన 72 గంటల గడువు ముగిశాక మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకటించింది. కోల్ గేట్ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఒక్కుమ్మడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్న అద్వానీ ఆరోపణలను మమత ఉద్ఘాటించింది. ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్లయితే…

మంత్రి కన్నా గారూ! మంత్రి పదవులకి బోలెడుమంది రెడీ

“బిజినెస్ రూల్స్ ప్రకారమే జి.ఒ లు జారీ చేశాం. ఈ జి.ఒ లని తప్పు పడితే భవిష్యత్తులో ఎవరూ మంత్రి పదవి చేపట్టరు.” (టి.వి 5) ఈ మాటలన్నది రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ.  జగన్ అవినీతి కేసులో తమకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల వల్ల భవిష్యత్తులో మంత్రి పదవులు నిర్వహించడానికి ఎవరూ ముదుకు రారేమోనని మంత్రిగారికి అర్జెంటుగా భయం పట్టుకుంది. కోర్టులు ఇలాగే అవినీతి పేరుతో మంత్రులకి నోటీసులు ఇస్తూ భయపెడుతుంటే…

నిన్నటి వరకు మమత, ఇపుడు ములాయం కూడా… -కార్టూన్

యు.పి.ఏ కి కష్టాలు ముమ్మరం అయినట్లు కనిపిస్తోంది. ‘మద్దతు ఉపసంహరిస్తా’ అంటూ మమతా బెనర్జీ తరచుగా బెదిరించే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కూడా ఆమెకు జత చేరినట్లు కనిపిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి తో పంకిలమయిందని ఆయన చేసిన వ్యాఖ్య గురువారం పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించింది. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే నిర్ణయాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ఆమెను మేనేజ్ చెయ్యడానికి అమెరికా విదేశాంగ…

కాంగ్రెస్ మార్కు అవినీతి వ్యతిరేక పోరాటం -కార్టూన్

అన్నా హజారే, ఆయన బృందం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాక వాళ్ళకి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ లేదు. జాతీయ పార్టీలతో పాటు అనేకానేక ప్రాంతీయ పార్టీలు కూడా అన్నా పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు క్యూలు కట్టారు. బి.జె.పి లాంటి పార్టీలు కార్యకర్తలను సరఫరా చేసి తెరవెనుక మద్దతు అందించాయి. అవినీతి సామ్రాట్టులుగా పేరుబడ్డవారు కూడా పత్రికా ప్రకటనలతో యధాశక్తి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్లమెంటులోనే అన్నాకి మద్దతుగా గొప్ప గొప్ప…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…

అవినీతి వ్యతిరేక కార్టూనిస్టు ‘అసీమ్ త్రివేది’ అరెస్టు, దేశవ్యాపిత నిరసన

రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా కార్టూన్లు గీసినందుకు కాన్పూర్ కార్టూనిస్టు అసిమ్ త్రివేది ని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  గత నెలలో అసిమ్ త్రివేదికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ చేసిన స్ధానిక కోర్టు సోమవారం ఆయనని వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది. త్రివేది అరెస్టుపై దేశవ్యాపితంగా నిరసన తలెత్తింది. ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అరెస్టును తీవ్రంగా ఖండించాడు. రాజకీయ నాయకుల…

కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై గురువింద ధాకరే మండిపాటు

చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ…

66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది. “జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన…

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ…