సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్…

అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ (ఎం.డి.ఎస్) ఏర్పాటు పూర్తి చేశామని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించింది. యూరోప్ కోసం అని చెబుతూ మధ్య యూరప్ నుండి తన సరిహద్దు దేశాల వరకూ ఆయుధ వ్యవస్ధను అమెరికా నిర్మించడం…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…

ఆపరేషన్ గ్లాడియో: పశ్చిమ దేశాల ముసుగు టెర్రరిజమే గురుద్వారా హత్యాకాండ?

ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…

నోరు మూసుకో! -అమెరికాతో చైనా ‘పీపుల్స్ డెయిలీ’

నోరు మూసుకొమ్మని చైనా ప్రభుత్వ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అమెరికాను హెచ్చరించింది. చైనా సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం వద్దని పత్రిక విదేశీ విభాగం గట్టిగా చెప్పింది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య తగాదాలు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా విరోధాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం అమెరికాకి కొత్త కాదనీ ఇటీవలీ కాలంలో చైనా విషయంలో కూడా ఈ ట్రిక్కు వినియోగిస్తున్నదని నిందించింది.…

సిరియాలో ఆల్-ఖైదా ను ప్రవేశపెట్టింది అమెరికా, నాటోలే -అమెరికా చరిత్రకారుడు

‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి విదితమే. ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశామని కూడా ప్రకటించిన అమెరికా అదే సంస్ధకు చెందిన టెర్రరిస్టులకు ఆయుధాలు ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టిందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు, రచయిత, ఆర్ధికవేత్త, జర్నలిస్టు అయిన వెబ్స్టర్ టార్ప్లే తెలిపాడు. ప్రాంతీయంగా టర్కీ ప్రధాని ఎర్డోగన్, విదేశీ మంత్రి దవుతోగ్లు ల దురభిమానాన్ని, అత్యాశను రెచ్చగొట్టి సిరియా కిరాయి తిరుగుబాటులో…

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…

అమెరికా చెబుతున్నది అబద్ధం -భారత జాలర్లు

కాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశామని అమెరికా చెబుతున్నది ఒట్టి అబద్ధమని దుబాయ్ తీరంలో అమెరికా సైనికుల కాల్పుల్లో గాయబడిన భారత జాలర్లు ‘ది హిందూ’ కు తెలిపారు. యు.ఏ.ఇ కి చెందిన కంపెనీలో పని చేస్తున్న భారత జాలర్లపై అక్కడి అమెరికా సైనిక స్ధావరానికి చెందిన సైనికులు కాల్పులు జరపడంతో ఒక భారతీయ జాలరి చనిపోగా, మరో ముగ్గురు జాలర్లు గాయపడ్డారు. కాల్పులకు ముందు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశామనీ వినకపోవడంతో కాల్చారని అమెరికా చెబుతుండగా…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు

ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం. తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…

కొత్త రాజధాని కోసం దక్షిణ సూడాన్ వెతుకులాట

త్వరలో కొత్త దేశంగా ప్రపంచ దేశాల జాబితాలో చేరనున్న దక్షిణ సూడాన్ కొత్త రాజధాని కోసం వెతుకులాటలో పడింది. 2005 లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం దక్షిణ్ సూడాన్ ప్రజలు తమ భవిష్యత్ గురించి తామె నిర్ణయంచుకోవటం కోసం జనవరి 9 నుండి  15 వరకు జరిగిన రెఫరండంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాధమిక ఫలితాల ప్రకారం దాదాపు 99 శాతం మంది స్వతంత్రం దేశం కోసమే మొగ్గు చూపడంతో మరొక కొత్త దేశం ఏర్పాటు…