హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -1

అది న్యూయార్క్ నగరం లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం. ప్రపంచ రాజకీయ ఆధిపత్య సాధనకు అమెరికా పనిముట్టుగా తిరుగులేని రికార్డు సంపాదించిన ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయ భవనంలో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత రోజే అదే చోట ప్రసంగించడానికి పోడియం ఎక్కిన వ్యక్తి ఒక అభివృద్ధి చెందిన దేశానికి నాయకుడు. తమ దేశంలోని ఆయిల్ వనరులను ప్రజల జీవన స్థాయిని పెంచడానికి వినియోగ పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో…

ఛావెజ్ మరణం అమెరికా పన్నాగం కావచ్చు –రష్యా నాయకుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు. “అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న…

అమెరికా సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన హ్యూగో ఛావెజ్ ఇక లేడు

వెనిజులా చమురు క్షేత్రాల నుండి లాభాల రాశులను తవ్వుకుపోతున్న అమెరికా బహుళజాతి కంపెనీలను ఉరికించి కొట్టిన బొలివారన్ విప్లవ నేత హ్యూగో ఛావెజ్ తుది శ్వాస విడిచాడు. అమెరికా గూఢచారులు ప్రవేశ పెట్టిన కేన్సర్ జబ్బుతో పోరాడి అలసిపోయిన ఛావెజ్ మంగళవారం రాత్రి కన్ను మూశాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన క్యూబా డాక్టర్లు నాలుగు సార్లు సర్జరీ చేసినప్పటికీ లొంగని కేన్సర్ కణాలు తమ యజమానులు ఆశించినట్లుగానే ఛావెజ్ ను తుదముట్టించిగాని ఊరుకోలేదు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు…

సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…

ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…

సైబర్ దాడుల వెనుక చైనా సైన్యం పాత్ర!

అమెరికాకి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ ఒకటి మంగళవారం ఓ జోకు పేల్చింది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడానికి తంటాలు పడింది. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ హస్తం ఉందని కనిపెట్టినట్లు వర్జీనియా నుండి పని చేసే ‘మాండియంట్’ కంపెనీ ప్రకటించింది. షాంఘై నగరంలో ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని ఒక భవంతి నుండి ‘Advanced Persistent Threat’ (ఎపిటి) వస్తున్నట్లు కనుగొన్నామని తెలిపింది. సైబర్ దాడుల గురించి…

కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…

ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…

తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్

ఒకరు అరే అంటే మరొకరు ఏరా అంటారు. ఒకరు తొడగొడితే మరొకరు మీసం మెలివేస్తారు. ఒకరు పౌర విమానం పంపితే మరొకరు ఏకంగా జెట్ ఫైటర్ విమానాన్నే పంపుతారు. తూర్పు చైనా సముద్రంలో చైనా, జపాన్ లు మళ్ళీ కీచులాటలు మొదలు పెట్టాయి. కీచులాటలు కాస్తా యుద్ధం వైపుకి దారి తీస్తాయేమోనని ఉగ్గబట్టుకోవడం ఇరుగు పొరుగు దేశాల పనిగా మారుతోంది. నివాస యోగ్యం కాని చిన్న చిన్న దీవుల పైన ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలను…

ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

అమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001…

సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఆపండి! ఒబామాకు అమెరికన్ల పిటిషన్

తిరుగుబాటు పేరుతో సిరియాలో మారణకాండకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం ఆపాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం నిర్వహించే వెబ్ సైట్ whitehouse.gov లో ఈ మేరకు వివిధ సెక్షన్ల ప్రజలు ఒక పిటిషన్ నమోదు చేశారు. ముస్లిం టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం పేర్కొన్న ఆల్-ఖైదా సంస్ధకు సిరియాలో తిరుగుబాటు నడుపుతున్న 29 సంస్ధలు విధేయతను ప్రకటించాయనీ, అలాంటి టెర్రరిస్టులకోసం అమెరికా ప్రభుత్వం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు పెట్టడం గర్హనీయమని…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…