మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.…

రక్తం పారిన ఎర్రెర్రని నేలలు, సముద్రాలు -ఫోటోలు

‘ఎరుపంటే ఎందుకురా భయం భయం! పసి పిల్లలు మీకంటే నయం నయం!! కలం వెంబడి అచ్చంగా నిప్పులు కురిపించిన చెరబండరాజు గారి ఓ కవితలోని పాదాలివి. ఇంధ్ర ధనుస్సులో ఎరుపు రంగు ఆ చివరన ఉంటుంది. ఎరుపు రంగు కిరణానికి తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) మిగిలిన ఆరు రంగులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందువలన ఎరుపు రంగు తీక్షణత ఎక్కువ. ఆ కారణం వల్ల పసి పిల్లలు ఎరుపు రంగుకి ఇట్టే ఆకర్షితులు అవుతారు. రక్తం…

ఇంకా వెన్నాడుతున్న ప్రమాదాలు -ది హిందు ఎడిట్

భారత నౌకా బలగం, స్వల్ప కాల విరామం అనంతరం, ప్రమాదాల నిలయంగా కొనసాగుతూనే ఉంది. గత వారమే సహాయక నౌక ఒకటి విశాఖపట్నం తీరంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన ఒక నావికుడి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో నలుగురు ఆచూకీ దొరకని వారుగా ప్రకటించబడ్డారు. వైజాగ్ సమీపంలో ఒక వాణిజ్య నౌక ఢీ కొట్టడంతో ఐ.ఎన్.ఎస్ కోరా అనే క్షిపణి యుద్ధ నావ స్వల్ప నష్టానికి గురైన తర్వాత పక్షం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద ఘటన.…

గేట్ల వద్ద వద్ద అసలు శత్రువు -ది హిందు ఎడిట్ (ఫోటోలు)

(ఆదివారం నాడు ఇండియా-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద అవతలివైపు భారీ పేలుడు సంభవించింది. అమాయక పౌరులు అనేకమంది ఈ ఆత్మాహుతి బాంబు పేలుడులో మరణించారు. ఈ అంశంపై మంగళవారం, నవంబర్ 4 2014, ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ***************** పాకిస్తాన్ లో వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి దుఃఖభాజనం. శోచనీయం ఏమిటంటే ఇది (సరిహద్దు) ద్వారాల వద్ద అసలు శత్రువు ఇండియా…

టెర్రరిజంను అమెరికా ఎలా ప్రోత్సహిస్తుంది?

జి.కె.గణేష్: టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా? సమాధానం: ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.  ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం…

డ్రోన్ లను కూల్చగల చైనా లేజర్ వెపన్ సిద్ధం

‘తాడిని తన్నేవాడు ఉంటే, వాడి తలను తన్నేవాడూ ఉంటాడ’ని సామెత! ప్రపంచంలో అత్యంత అధునాతనమైన మానవ రహిత యుద్ధ విమాణాలైన డ్రోన్ లను లెక్కకు మిక్కిలిగా తయారు చేసుకుని విర్ర వీగుతున్న అమెరికాకు చైనా నుండి దుర్వార్త ఎదురయింది. డ్రోన్ విమానాలను, అవి ఎంత చిన్నవైనా సరే, పసిగట్టిన 5 సెకన్లలో కూల్చగల లేజర్ ఆయుధాలను తయారు చేశామని చైనా ప్రకటించింది. తయారు చేయడమే కాదు విజయవంతంగా పరీక్షించామని కూడా చైనా తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని…

స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు

“పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్” అంటాడు గిరీశం మహాకవి గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నాటకంలో. పొగ తాగడం అనివార్యం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆనక ఆ ప్రాతిపదికన తన అలవాటును గొప్పదిగా ఎస్టాబ్లిష్ చేయడానికి గిరీశం ఆ మాట చెప్పాడు. అప్పు సంగతి దాదాపు అలాంటిదే. పొగ అవసరం లేకపోయినా ఉందని గిరీశం ఎస్టాబ్లిష్ చెయ్యబోయాడు. అప్పు అవసరం మాత్రం నిజంగానే అనివార్యం. ఎందుకని అనివార్యం? నిజానికి ఎవరి శ్రమకు తగిన సంపాదన వారికి…

ఆసియా కోసం ఓ కొత్త బ్యాంకు -ది హిందు ఎడిటోరియల్

(బ్రెట్టన్ వుడ్ కవలలుగా అభివర్ణించబడే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మరో బ్యాంకు ఆసియా ఖండం కోసం ఆవిష్కృతం అయింది. ఇది కూడా చైనా చొరవతో, అత్యధిక చైనా నిధులతో, ఇండియా దన్నుతో రూపుదిద్దుకోవడం గమనార్హం. బీజింగ్ లో 21 దేశాల వ్యవస్ధాపక భాగస్వామ్యంతో ఆసియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు బీజింగ్ లో ప్రారంభం అయింది. బ్యాంకుకు పురిట్లోనే సంధి కొట్టడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించినా ఆటంకం అధిగమిస్తూ ఎ.ఐ.ఐ.బి…

ఒట్టావాలో టెర్రర్ -ది హిందు ఎడిటోరియల్

ఉగ్రవాదానికి కెనడా కొత్తది ఏమీ కాదు. ఆ దేశ పార్లమెంటుపై దాడి గతంలో ఎన్నడూ ఎరగనట్టిదిగా కనిపించవచ్చు గానీ -కెనడా అమాయకత్వపు ముగింపుగా కూడా దాడిని అభివర్ణించారు- ఉగ్రవాదంతో ఆ దేశానికి, మరే ఇతర పశ్చిమ దేశం కంటే ముందునుండీ, సుదీర్ఘ అనుభవమే ఉంది. 1970లో క్విబెక్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎల్.క్యూ) బ్రిటిష్ దౌత్యవేత్తను, కెనడియన్ కార్మిక మంత్రిని కిడ్నాప్ చేసి రెండున్నర నెలలపాటు తన అదుపులో ఉంచుకుంది. అప్పటి ప్రధాన మంత్రి పియర్రే ట్రుడ్యూ క్విబెక్…

ఇసిస్ టెర్రరిస్టులకు అమెరికా ఆయుధాలు

పొద్దున లేస్తే పత్రికల్లోనూ, టి.వి ఛానెళ్లలోనూ ఇసిస్ పై అమెరికా సాగిస్తున్న యుద్ధం సంగతులే దర్శనం ఇస్తాయి. ఉత్తర సిరియాలో టర్కీ సరిహద్దులో ఇసిస్ పై పోరాడుతున్న కుర్దు బలగాలకు కావలసిన ఆయుధాలను విమానాల ద్వారా గాల్లోనుండి జారవిడుస్తున్నామని అమెరికా చెబుతోంది. గత ఆదివారం నుండి ఈ జారవేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఆయుధాలు వాస్తవంగా ఇసిస్ చేతుల్లోకి వెళ్ళాయని ప్రెస్ టి.వి విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.…

విఫల స్వప్నం విషమై హిట్లర్ ప్రాణాన్ని మింగిన వేళ… -ఫోటోలు

‘Thousand-Year Reich!” ఇది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఇష్టంగా ప్రవచించిన కల. Reich అంటే జర్మనీ భాషలో సామ్రాజ్యం అని అర్ధం. జర్మనీ సామ్రాజ్యం వెయ్యేళ్లు అవిచ్ఛిన్నంగా సాగాలని హిట్లర్ కలలు కన్నాడు. కానీ సోవియట్ రష్యాతో చేసుకున్న నిర్యుద్ధ సంధిని తుంగలో తొక్కుతూ ఎర్ర నేలను కబళించడానికి దండయాత్ర చేసి తన కలలను తానే కల్లలుగా మార్చుకున్నాడు. సోవియట్ ఎర్ర సేనలు తూర్పు వైపు నుండి కదం తొక్కుతూ బర్లిన్ నగరాన్ని పాదాక్రాంతం చేసుకుంటున్న…

ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2

మొదటి భాగం తరువాయి…………   ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను…

ప్రశ్న: సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

ఎస్.రామ కృష్ణా రావు: Two three decades ago there was cold war between America & Russia. Both were competing for no1 position. But down the line Russia faded away and USA is actively participating in almost all parts of the world’s politics. Russia became neutral & insignificant. I would like to know what went wrong with…

ఎబోలా: వణికిపోతున్న ఆధునిక ప్రపంచం -ఫోటోలు

  మానవ వైద్య పరిజ్ఞానానికి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్ లు ఇప్పటికీ కొరకరాని కొయ్యలుగానే ఉంటున్నాయని ఎబోలా వైరస్ విస్తృతి తెలియజేస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.  శత్రు దేశాలను లొంగ దీసుకోవడానికీ, సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న దేశాలను దారికి తెచ్చుకోవడానికీ సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రాణాంతక వైరస్ లను తమ ప్రయోగశాలల్లో భద్రపరచడమే కాకుండా, జెనెటిక్ ప్రక్రియల ద్వారా సరికొత్త ప్రాణాంతక వైరస్ లను సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం నాణేనికి మరో…

కాశ్మీర్: ఇండియా అవగాహనకు దూరమౌతున్న అమెరికా!

జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి…