హింసనచణ ధ్వంస రచన… -ఫోటోలు

ఇజ్రాయెల్ ధ్వంస రచనకు 26 రోజులు పూర్తయ్యాయి. వందలాది మంది పాలస్తీనీయులు మర ఫిరంగుల తాకిడికి పుట్టలు పుట్టలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఉమ్మడిగా తుడిచివేయబడుతున్నాయి. భవనాలకు భవనాలే ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. అక్కడ పిట్టలు ఎగరడం ఎప్పుడో మానేశాయి. విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి. రాత్రయితే ఇప్పుడక్కడ నీడలు కదలవు. యంత్ర భూతాల ఫిరంగి గొట్టాలు, ఇనుప రెక్కల డేగలు విరామమెరుగక విరజిమ్ముతున్న పేలుడు మంటల్లో మానవత్వం శలభంలా మాడి మసవుతోంది. ఇజ్రాయెల్ నుండి…

పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి

గాజాలో ఐరాస తరపున శరణార్ధి శిబిరాలను నిర్వహిస్తున్న UNRWA ప్రతినిధి తమ పాఠశాలపై దాడిని వివరిస్తూ కెమెరా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అమానుషాన్ని కళ్ళారా చూసిన ఆయన జరిగిన ఘోరాన్ని తిరిగి గుర్తు చేసుకుంటుండగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నోట మాట రాకపోయినా బలవంతంగా మాటలు కూడబలుక్కుని వివరిస్తూ తలవంచుకుని ఏడ్చేశారు. పాఠశాలలో తలదాచుకుంటున్న వారు నిద్రలోనే చనిపోయారని UNRWA ప్రతినిధి క్రిస్ గన్నెస్ ఆల్ జజీరా టి.వి ఛానెల్ కు చెబుతూ దుఃఖించారు. జబాలియా…

ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

‘మొనగాడు’ అందామా! గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా! మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా! ‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా? గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…

ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….

పొన్నం శ్రీనివాస్: పాలస్తీనా సమస్య ఉగ్రవాద సమస్యే తప్పా… జాతుల అంతం లాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావం ఎలా జరిగింది. అక్కడున్న వాళ్లంత ఎక్కడికి వలస వెళ్లారు. మళ్లి వాళ్ల స్వస్థలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా… సమాధానం: శ్రీనివాస్ గారూ, ఇదే తరహా ప్రశ్నను గతంలో మరో మిత్రుడు అడిగారు. సమాధానం ఇచ్చాను. సమాధానంతో పాటు పాలస్తీనా సమస్యపై రాసిన కొన్ని ఆర్టికల్స్ కు లింక్ లు…

ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు

మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…

ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు. ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి. ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు…

ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర

సౌదీ అరేబియా, కతార్, టర్కీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ద్వారా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు సిరియాలో రెచ్చగొట్టి కొనసాగిస్తున్న కిరాయి తిరుగుబాటులో ఐ.ఎస్.ఐ.ఎల్/ఐ.ఎస్.ఐ.ఎస్ పాత్ర రహస్యం ఏమీ కాదు. వారిని మోడరేట్ ఉగ్రవాదులుగా పేర్కొంటూ కొన్నిసార్లు బహిరంగంగానే ఆయుధ, ధన, గూఢచార సహాయం అందజేసింది అమెరికా. తాజాగా బహిరంగంగానే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని ఒబామా ప్రకటించాడు. టర్కీ, జోర్డాన్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సి.ఐ.ఏ సైనిక శిక్షణ…

ఇసిస్ మెరుపు పురోగమనం: ఇరాక్, సిరియాల విచ్ఛిన్న కుట్రలో భాగం

ఇరాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా జూన్ మూడో వారం నుండి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒక్కసారిగా వార్తలు గుప్పించడం మొదలు పెట్టాయి. ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆల్-షామ్ (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంత్ (ISIL)’ అనే ముస్లిం టెర్రరిస్టు సంస్ధ మెరుపు వేగంతో ఇరాక్ లో దూసుకు వెళ్తోందని, అమెరికా శిక్షణ గరిపిన సుశిక్షిత…

షియా ఇరాన్ సందర్శనలో సున్నీ కువైట్ అమీర్

మధ్య ప్రాచ్యంలో మరో పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు పక్కా మిత్ర దేశం కువైట్ అమీర్ ఒకరు ఆదివారం నుండి తన ఇరాన్ సందర్శన ప్రారంభించాడు. షియా ఇరాన్ ప్రభావం మధ్య ప్రాచ్యంలో పెరిగడానికి దారి తీసే ప్రతి పరిణామాన్ని ఆటంకపరిచే సున్నీ సౌదీ అరేబియా పాత్ర ప్రస్తుత పరిణామంలో ఎంత ఉందన్నది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. గత సంవత్సరం అధికారం చేపట్టిన రౌహాని ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాలతో పాటు ప్రాంతీయ ప్రత్యర్ధి…

ఈజిప్టులో 3,500 సం.ల నాటి వాతావరణ నివేదిక

వాతావరణ మార్పుల గురించి ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలిసి ఇటీవల కాలానిదే. కానీ ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా అలాంటి పరిజ్ఞానం ఒకటుండేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. 3,500 సంవత్సరాల క్రితం నాటి కాల్సైట్ (కాల్షియం కార్బొనేట్) రాతి పలక పైన వాతావరణ మార్పుల గురించిన నివేదికను అమెరికాలోని పరిశోధకులు కనుగొన్నారు. 6 అడుగుల ఎత్తున ఉన్న ఈ కాల్సైట్ పలక పైన ఉన్న 40 లైన్ల పాఠ్యాన్ని ఇటీవలే చదవగలిగారని ఫ్రీ ప్రెస్…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

ఈజిప్టు ప్రభుత్వ మార్పిడితో పాలస్తీనా మూల్యం

ప్రపంచంలో అత్యంత అస్ధిర (volatile) ప్రాంతం మధ్య ప్రాచ్యం. అరబ్ వసంతం పేరుతో గత మూడేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ సంగతిని మరోసారి నిరూపించాయి. మధ్య ప్రాచ్యంలో కూడా అత్యంత భావోద్వేగ ప్రేరక సమస్య పాలస్తీనా సమస్య. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలకు జన్మస్ధలం అయిన పాలస్తీనా సమస్య సహజంగానే అనేక ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఫలితంగా పాలస్తీనాలో జరిగే పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా, మధ్య ప్రాచ్యంలోని…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…