ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసిసి అరెస్ట్ వారంట్!

Yoav Gallant and Benjamin Netanyahu ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్…

ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

గాజా: నేను చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను!

యధాతధ రాజకీయాల్ని, సెంట్రిస్ట్ ఇంక్రిమెంటలిజాన్ని భరించే ఓపిక కలిగి ఉండటానికి, నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. నవంబర్ లో అమెరికన్లు ఎవర్ని ఎన్నుకుంటారో పట్టించుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. డెమొక్రాట్లకు ఓటు వేస్తే “అపాయం తగ్గుతుందన్న” ఐడియాను సీరియస్ గా తీసుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. ఇజ్రాయెల్, దాని పశ్చిమ మిత్ర దేశాల్ని ఎప్పటికైనా క్షమించటానికి నేనిప్పటికే…

తుఫాను సాయం ప్లీజ్ -ఆగ్నేయ అమెరికా!

– ఆగ్నేయ అమెరికన్లు: హెలెనే తుఫాను సాయం చేయండి, ప్లీజ్! వాషింగ్టన్: సారీ, ఇజ్రాయెలీ యుద్ధ పిపాసులకు మద్దతుగా మరిన్ని వేల మంది అమెరికా సైన్యాన్ని పంపించాలనా మీరు అడుగుతున్నది? ఆగ్నేయ అమెరికన్లు: కాదు మహా ప్రభో! హెలెనే హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాం, కాస్త సాయం చేయమని అడుగుతున్నాం. వాషింగ్టన్: ఒకే. మీకు పరిస్ధితి ఏమీ అర్ధం అవుతున్నట్లు లేదు. కానీ మన సైన్యం ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండలో ఒక చెయ్యి వేసేందుకు…

టర్కీలో అమెరికా సైనికులపై యువకుల దాడి!

The US’ marines attacked in Izmir, Turkey నాటో సభ్య దేశం అయిన టర్కీలో అమెరికా సైనికులకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్మీర్ పట్టణ వీధుల్లో సంచరిస్తున్న అమెరికన్ మెరైన్ సైనికులపై టర్కిష్ యువకుల బృందం దాడి చేశారు. ఒక సైనికుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ వాస్ప్, ఇటీవల వరకు ఇజ్రాయెల్ తీరాన మోహరించింది. సదరు నౌక టర్కీ రేవు ఇజ్మీర్…

గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?

గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు,…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు!

అనుమానించినట్లే జరుగుతున్నది. ఇరాన్ గడ్డపై హమాస్ సంస్థ పోలిటికల్ లీడర్ ను హత్య చేయడం పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీ ఆదేశాలు ఇచ్చాడు. ఆలీ ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక జులై 31 తేదీన తెలియజేసింది. సుప్రీం నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) అత్యవసరంగా జరిపిన సమావేశంలో ఖమెనీ ఈ…

ఇజ్రాయెల్ ఘాతుకం: హమాస్ నేత హనియే హత్య!

ఇజ్రాయెల్ మరో ఘాతుకానికి తెగబడింది. హమాస్ సంస్థ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం ప్రారంభోత్సవం నిమిత్తం ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉండగా ఇస్మాయిల్ హనియే బస చేస్తున్న భవనంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హనియే మరణించినట్లు వివిధ వార్తా సంస్థలు తెలియజేశాయి.  జులై 31 ఉదయం జరిగిన ఈ హత్యలో, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లు…

గాజా యుద్ధం: పాలస్తీనియన్లు వెళ్లేందుకు ఇక చోటు లేదు -ఐరాస

గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైన్యం పాలస్తీనా పౌరుల మారణ హోమం కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 తేదీన హమాస్ తమ పైన దాడి చేసి 2 వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సాకుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. కాగా వారిలో 75 శాతం మంది స్త్రీలు, పిల్లలే కావటం గమనార్హం. కాగా గాజాలో పరిస్ధితిని తాజాగా…

ఈజిప్టు: పాలస్తీనా ఉద్యమంలో ట్రోజాన్ హార్స్ (5)

Rafah Border సహజవాయువు, టూరిజం 2021లో ఈజిప్టు ఇంధన శాఖ మంత్రి తారెక్ ఆల్-మొల్లా ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ఇంధన మంత్రి యువాల్ స్టీనిట్జ్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ లతో ఓ ప్రధాన సహకార ఒప్పందం గురించి చర్చలు జరిపాడు. వాషింగ్టన్ డి.సి. లోని అరబ్ సెంటర్ నివేదిక ప్రకారం, “పాలస్తీనా సముద్ర తీరం లోని లెవియాథన్ చమురు ఫీల్డ్ నుండి వెలికి తీసిన సహజ వాయువును సముద్రం అడుగు నుండి వేసిన కొత్త పైప్…

ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనా శిబిరంలో చొరబడ్డ  ట్రోజాన్ హార్స్! (1)

Middle East & North Africa (MENA) ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతాలలో విస్తరించిన అరబ్బు దేశాలలో ఈజిప్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 5,000 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిన ఈజిప్టు నాగరికత, 6 బిసి సం. లో అఖేమినీడ్ (మొదటి పర్షియన్ వంశం) సామ్రాజ్యం వశం అయ్యే వరకూ స్థానికుల పాలనలోనే కొనసాగింది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజంటైన్లు, ఒట్టోమన్ లు ఈజిప్టును ఒకరి తర్వాత మరొకరు ఆక్రమించుకున్నారు. ఒట్టోమన్ రాజుల…

గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!

(రెండవ భాగం తర్వాత….) సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్…

అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం. ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూ‌ఏ‌ఈ,…

ఆసియాలో ఇండియా సభ్య దేశంగా మరో ‘క్వాడ్’ కూటమి

చైనా, రష్యాలకు వ్యతిరేకంగా… ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక కూటముల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిపి ‘క్వాడ్’ కూటమిని తయారు చేసిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియా కేంద్రంగా మరో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో అమెరికా, ఇండియాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూ‌ఏ‌ఈ), ఇజ్రాయెల్ లు సభ్య దేశాలుగా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా ఆశీస్సులతో వైట్…