ఇన్‌స్క్రిప్ట్+ తెలుగు కీబోర్డ్ లేఔట్

Originally posted on వీవెనుడి టెక్కునిక్కులు:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు…

ఈ స్పామ్ కామెంట్స్ లక్ష్యం ఏంటి?

ఇక్కడ మూడు స్క్రీన్ షాట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యాఖ్యలుగా ఈ బ్లాగ్ లో పోస్ట్ అయ్యాయి. ఈ స్పాం కామెంట్లకు లక్ష్యం పట్ల నాకు కొన్ని అనుమానాలు తలెత్తడం వల్ల బహిరంగం చేయడం జరుగుతోంది. మొదటి రెండు స్క్రీన్ షాట్లలో చూస్తే ఆ వ్యాఖ్యలకు అర్ధం లేనట్లు తెలుస్తూనే ఉంది. మూడో స్క్రీన్ షాట్ లో చివరి వ్యాఖ్య మిగత వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ఈ వ్యాఖ్య, గురు గోల్వాల్కర్ బోధనలను ఉటంకిస్తూ రాసిన పోస్టు కింద…

నూతన ఆర్ధిక విధానాలపై పోరాడని అవినీతి వ్యతిరేక పోరాటాలు వృధా

(గతంలో రెండు భాగాలుగా ఈ వ్యాసం రాయబడింది. ఆ వ్యాసంలో అనవసరమైన భాగాలు తొలగించి, మరిన్ని వివరాలు జోడించి, మరింత పరిపూర్ణత కావించి తిరిగి ప్రచురించడం జరుగుతోంది) అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారులఅవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నాడని పత్రికలు కోడై కూస్తునాయి. ఈ మధ్య కాలంలో ఈ కూతల సంఖ్య తగ్గినా అన్నా హజారే కి అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు బిరుదు ఇవ్వడం మానలేదు. పఠిష్టమైన లోక్…

‘ఎల్ మేక్’ వీధి పోర్ట్రయిట్లు -ఫొటోలు

‘ఎల్ మేక్’ అమెరికా దేశస్ధుడు. 1980 లో జననం. చిన్నతనం నుండీ బొమ్మలు గీస్తూ స్వతంత్రంగా అధ్యయనం చేస్తూ వచ్చాడట. మనుషుల బొమ్మలు ముఖ్యంగా ముఖాలపైన ఇతను ప్రధానంగా కేంద్రీకరించినట్లు కనపడుతోంది. మెక్సికో, అమెరికాల సంస్కృతి నుండి స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పుకున్నాట్లు తెలుస్తొంది. నైరుతి అమెరికా సంస్కృతి, మతపరమైన చిత్రలేఖనం, గ్రాఫిటి లతో పాటు అనేక రకాల సాంప్రదాయక చిత్ర కళను ఈయన అధ్యయనం చేశాడు. అనేక దేశాల్లో ఈయన వీధి చిత్రాలు గీసాడు. మెక్సికో,…

బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ ఆలీకి 70 -ఫొటోలు

“రాకాసి మొసలి తో కుస్తీ పట్టా. తిమింగలంతో కలబడ్డా, గత వారమే ఓ బండరాయిని చంపేశా. మరో రాయిని మోది గాయపరిచా, ఇటుకని ఆసుపత్రి పాల్జేశా. నేనెంత క్షుద్రుడ్నంటే నన్ను చూస్తే మందులకి కూడా జబ్బొస్తుంది.” లెజెండరీ బాక్సర్ మహమ్మద్ ఆలీ చెప్పిన మాటలివి. తన ఏనుగు బలంపై అయనకెంత నమ్మకమో ఈ మాటలే చెబుతాయి. ఆ నమ్మకమే లేకుంటే లెజెండ్ గా ఎలా మారగలడు? నిజమో కాదో తెలియదు కాని మహమ్మద్ ఆలీ కవిత్వం కూడా…

ఇటలీ లగ్జరీ ఓడ మునక –ఫోటోలు

‘కోస్టా కంకోర్డియా’ పేరు గల ఓడ ఇటలీ సముద్ర జలాల్లో ఒరిగిపోయి మునిగిపోయింది. 4,200 మందిని ఒరుగుతున్న ఓడ నుండి రక్షించగా ఆరుగురు చనిపోయినట్లు ఇప్పటివరకూ తేలింది. ఓడ కెప్టెన్ తనకు నిర్దేశించబడిన మార్గం నుండి అనుమతి లేకుండా పక్కకు వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఓడ సొంత దారు చెబుతున్నాడు. ప్రయాణీకులు రక్షించబడకుండానే ఓడను వదిలేవేళ్ళాడని కేప్టేన్ విచారణను ఎదుర్కొంటున్నాడు. అలా వెళ్ళడం ఇటలీ ఓడ నియమాలకి విరుద్ధం. శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఓడ…

చెన్నై (ఛేపక్) అగ్నిప్రమాదం -ఫొటోలు

ఆదివారం ఆర్ధ రాత్రి (సోమవారం తెల్లవారు ఝాము) ఛేపక్ (చెన్నై) లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పుతున్న సిబ్బందిలో ఒకరు దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్, సోషల్ వెల్ఫేర్ కార్యాలయాలున్న భవనం ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బ తింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. మొదటి అంతస్ధులో మంటల్ని చూసిన వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద…

గ్వాంటనామో బే -ఒబామా విఫల వాగ్దానం

గ్వాంటనామో చీకటి కొట్టం మూసివేత! ఇది బారక్ ఒబామా అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు అమెరికా ప్రజలకు ఇచ్చిన ఘనమైన వాగ్దానం.  విమానాశ్రాయాలలో అనుమానితుల్ని అరెస్టు చేసినా వారిని ఈ చీకటి కారాగారానికే తరలించారు. ప్రజాస్వామిక విలువలపైన అమెరికా రాజ్యానికి ఉన్న గౌరవం ఒట్ఠి బూటకం అని నిరూపించిన అనేక అంశాల్లో గ్వాంటనామో బే జైలు ఖైదీలపైన అమెరికా సాగించిన అకృత్యాలు ఒకటి మాత్రమే. బారక్ ఒబామా, అధ్యక్షుడిగా గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేశాడు. అవేవీ అమలు…

‘తె.జా.అ.వా’ బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ ఎలా ఉంది?

“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ అమరుస్తున్నాను. ఈ టెంప్లేట్ తో ఎవైనా సమస్యలు తలెత్తితే మిత్రులు చెప్పగలరు. ఈ టెంప్లేట్ కూడా వర్డ్ ప్రెస్ వారు ఉచితంగా అందించినదే.

“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ సమీక్ష -2011

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog. Here’s an excerpt: The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 100,000 times in 2011. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see…

పచ్చదనాన్ని నమిలేస్తున్న కాంక్రీట్ అరణ్యం -బ్లూ స్ట్రీట్ ఆర్ట్

వీధి చిత్ర కళాకారుడు ‘బ్లూ’,  సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో గీసిన వీధి చిత్రం ఇది. పట్టణీకరణ తీవ్రం అవుతుండడంతో పల్లెలూ, పల్లెల్ని అంటిపెట్టుకుని ఉండే పచ్చదనం కనపడకుండా పోతున్న సంగతిని ‘బ్లూ’ ఇందులో చిత్రించాడు. – – –

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి (అన్నాపై విమర్శలు…. -2)

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం…

లోక్‌పాల్ బిల్లుకి187 సవరణలా!? ఆమోదనీయం కాదు -చిదంబరం

ఒకటి రెండు సవరణలైతే ఆమోదించవచ్చనీ, రాజ్యసభలో ఏకంగా నూట ఎనభై ఏడు సవరణలు లోక్ పాల్ బిల్లుకి ప్రతిపాదించడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం శనివారం వ్యాఖ్యానించాడు. మిత్రుల మద్దతు పొందడానికి ఒకటి రెండు సవరణలు బిల్లుకి చేయవచ్చనీ చిదంబరం తెలిపాడు. “లోక్ పాల్ బిల్లుని మెరుగుపరిచి పురర్నిర్వచించవలసిన అవసరం రావచ్చు. రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి సంబంధించినంతవరకూ ఒకటి రెండు సవరణలను అనుమతించవచ్చు. ఒకటి రెండు సవరణలు చేసినా అదే బిల్లు…